- Home
- Entertainment
- Bheemla Nayak Prerelease event: అడవి తల్లి సాంగ్ పాడిన కమ్మరి దుర్గవ్వ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మనసు చలిస్తుంది
Bheemla Nayak Prerelease event: అడవి తల్లి సాంగ్ పాడిన కమ్మరి దుర్గవ్వ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మనసు చలిస్తుంది
భీమ్లా నాయక్(Bheemla Nayak) మూవీతో మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తెచ్చారు. కిన్నెర కళాకారుడు మొగిలయ్య భీమ్లా నాయక్ చిత్రంలో సాంగ్ పాడడం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే మరొక విలేజ్ టాలెంట్ భీమ్లా నాయక్ చిత్రంలో పాటపాడారు. ఆమె ఎవరో కాదు కుమ్మరి దుర్గవ్వ.

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర యూనిట్ ఆమెను సత్కరించారు. అలాగే దుర్గవ్వ వేదికపై అడవి తల్లి సాంగ్ పాడారు. ఈ నేపథ్యంలో దుర్గవ్వ నేపథ్యం తెలిస్తీ వారికైనా కళ్ళ వెంబడి నీరు రావాల్సిందే.
కుమ్మరి దుర్గవ్వ (Kummari Durgavva)అనూహ్యంగా పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ సినిమాలో ‘అడవి తల్లి’ పాట పాడి అందరినీ ఆకట్టుకుంటోంది. పల్లె పాటలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దుర్గవ్వ ఓ స్టార్ హీరో సినిమాలో పాటపాడే అవకాశం దక్కించుకోవడం విశేషం. భీమ్లా నాయక్ సినిమాలో పాట పాడే ఛాన్స్ దక్కించుకున్న ఈ దుర్గవ్వ ఎవరని నెటిజెన్స్ వెదుకుతున్నారు.
దుర్గవ్వకు సినిమాల్లో ఇదే తొలిపాట కాదు. గతంలోనూ ఆమె తెలుగుతో పాటు మరాఠీ చిత్రాల్లోనూ జానపదాలు పాడి ఆకట్టుకుంది.మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి దుర్గవ్వ భర్త రాజయ్య చాలా ఏళ్ల క్రితమే మరణించాడు. ఆమెకు కుమార్తె శైలజ, కుమారుడు ప్రభాకర్ ఉన్నారు. నిరుపేద కావడంతో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేది. వరినాట్లు, పొలం పనులకు వెళ్లినప్పుడు దుర్గవ్వ తనకు వచ్చిన జానపద పాటలు పాడేది. తల్లి టాలెంట్‌ను గుర్తించిన శైలజ ఆమె పాటలను వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా వైరల్ అయ్యాయి.
దీంతో మంచిర్యాలకు చెందిన పలువురు జానపద కళాకారులు తమ ఆల్బమ్స్‌లో దుర్గవ్వతో పాటలు పాడించుకునేవారు. అవికూడా పాపులర్ కావడంతో సింగర్లు మల్లిక్‌తేజ, మామిడి మౌనిక వంటి కళాకారులు సైతం ఆమెకు అవకాశాలు ఇచ్చారు. ముఖ్యంగా ‘సిరిసిల్ల చిన్నది.. నాయితల్లే.. అనే పాటతోపాటు ‘ఉంగురమే.. రంగైనా రాములాల టుంగూరమే’ అనే పాటలు ఆమె ప్రత్యేక గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలోనే మామిడి మౌనిక, సింగర్ మల్లిక్‌తేజ ప్రోద్బలంతో దుర్గవ్వకు ‘భీమ్లా నాయక్’ సినిమాలో పాడే అవకాశం వచ్చింది.
అయ్యప్పనుమ్ కోశియుమ్ తెలుగు రీమేక్ గా భీమ్లా నాయక్ తెరకెక్కింది. ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భీమ్లా నాయక్ హిందీ వర్షన్ కూడా విడుదల కావడం మరో విశేషం. పవన్ కళ్యాణ్ (pawan kalyan)మరొకరు మారు పవర్ ఫుల్ పోలీస్ రోల్ చేస్తున్నారు. మరో హీరో రానా ఆర్మీ అధికారి పాత్ర చేస్తున్నారు. భీమ్లా నాయక్ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఇగో వార్ అన్న సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ మూవీలో పవన్ భీమ్లా నాయక్ గా, రానా డానియల్ శేఖర్ గా పరస్పరం తలపడనున్నారు.
భీమ్లా నాయక్ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర సంగీతం అందిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మలయాళ కుట్టి నిత్యా మీనన్ పవన్ కళ్యాణ్ జంటగా నటించారు. సంయుక్త మీనన్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు.