- Home
- Entertainment
- Bheemla Nayak Review: ట్విట్టర్ టాక్... పవన్-రానా ఏం కొట్టుకున్నార్రా బాబు... బొమ్మ బ్లాక్ బస్టర్
Bheemla Nayak Review: ట్విట్టర్ టాక్... పవన్-రానా ఏం కొట్టుకున్నార్రా బాబు... బొమ్మ బ్లాక్ బస్టర్
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)రీ ఎంట్రీ తర్వాత చేస్తున్న రెండో చిత్రం భీమ్లా నాయక్. ఆయన గత చిత్రం వకీల్ సాబ్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలో పవన్ నుండి ఓ సాలిడ్ హిట్ కావాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఆ క్రమంలో వచ్చిందే భీమ్లా నాయక్.
- FB
- TW
- Linkdin
Follow Us

మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్ తెలుగు రీమేక్ గా భీమ్లా నాయక్(Bheemla Nayak) తెరకెక్కింది. బిజూ మీనన్, పృథ్విరాజ్ చేసిన పాత్రలు పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి చేశారు. దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ అందించారు. త్రివిక్రమ్ ఎంట్రీతో ప్రాజెక్టు స్వరూపం మారిపోయింది. పవన్ ఇమేజ్ కి తగ్గట్లుగా సన్నివేశాలు, కథలో చిన్న చిన్న మార్పులు చేశారు.
ఇక భీమ్లా నాయక్ విడుదలకు అనేక అవరోధాలు ఏర్పడ్డాయి. మొత్తంగా ఫ్యాన్స్ నిరీక్షణకు తెరదించుతూ భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న థియేటర్స్ లో దిగింది. గత రాత్రి యూఎస్ లో ప్రీమియర్స్ ప్రదర్శన జరిగింది. అలాగే తెలంగాణా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు వేశారు. దీంతో భీమ్లా నాయక్ (Bheemla Nayak review)చూసిన ప్రేక్షకులు తమ స్పందన ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు.
భీమ్లా నాయక్ కథ విషయానికి వస్తే... ఒక సిన్సియర్, అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్ భీమ్లా నాయక్(పవన్ కళ్యాణ్) డ్యూటీలో భాగంగా ఓ మాజీ ఆర్మీ ఆఫీసర్ డానియల్ శేఖర్(రానా) ని అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న కేసులో పట్టుకుని అరెస్ట్ చేస్తాడు. పోలీసుల గురించి తప్పుగా మాట్లాడడం వలన అతని పంచ ఊడగొట్టి, అవమానకర పద్ధతిలో పోలీస్ స్టేషన్ కు తరలిస్తాడు. డానియల్ శేఖర్ మాజీ ఆర్మీ ఆఫీసర్ అని భీమ్లా నాయక్ కు తెలీదు. అలాగే ఇతను ఒక పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న పెద్ద(సముద్రఖని) కొడుకు అన్న సంగతి కూడా తెలీదు.అయితే డానియల్ శేఖర్ గురించి అసలు నిజం తెలుసుకున్న వెంటనే భీమ్లా నాయక్… డానియల్ శేఖర్ కు సారి చెప్పి విడుదల చేయించే ప్రయత్నాలు చేపడతాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఇగో వార్ మొదలవుతుంది. ఈ యుద్ధంలో చివరికి విజయం ఎవరిది అనేదే భీమ్లా నాయక్..
భీమ్లా నాయక్ చూసిన ప్రేక్షకులు దాదాపు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు. సినిమాలోని ప్రధాన పాత్రలతో పాటు దర్శకుడు సాగర్ కే చంద్ర టేకింగ్, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు ఆకట్టుకున్నాయన్న మాట వినిపిస్తుంది.
భీమ్లా నాయక్ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా మొదలై ప్రీ ఇంటర్వెల్ సమయానికి జోరందుకుంటుంది. ఇంటర్వెల్ సన్నివేశం కూడా అద్భుతం అన్న మాట వినిపిస్తోంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం సినిమా రేసీగా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ కి మించిన దమ్ము సెకండ్ హాఫ్ లో ఉందంటున్నారు. పవన్ కళ్యాణ్, రానా మధ్య వచ్చే సన్నివేశాలు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగిస్తాయట.
భీమ్లా నాయక్ మూవీకు రానా పాత్ర గురించి, ఆయన పెర్ఫార్మన్స్ గురించి ఎక్కువ మంది ట్వీట్ చేస్తున్నారు. డానియల్ శేఖర్ పాత్రకు ఆయన పర్ఫెక్ట్ మ్యాచ్ అంటున్నారు. భీమ్లా నాయక్ చిత్రానికి రానా ప్రధాన ఆకర్షణ అనడంలో ఎటువంటి సందేహం లేదని తెలుస్తుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో రానా మరోసారి అబ్బురపరిచారనిపిస్తుంది.
ఇక పవన్ ప్రెజెన్స్, డైలాగ్స్, మాస్ అప్పీరెన్స్ ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్. భీమ్లా నాయక్ గా పవన్ అదరగొట్టారు. నిత్యా మీనన్ కి ఒకటి రెండు మంచి సన్నివేశాలు ఉన్నాయి. రావు రమేష్, మురళీ శర్మ పాత్రలు ఆకట్టుకున్నాయి. బ్రహ్మానందం చివర్లో మెరిపించాడు.
ఇక థమన్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇంటర్వెల్, క్లైమాక్స్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాల్లో థమన్ ఇచ్చిన బీజీఎమ్ మూవీ స్థాయిని పెంచింది.థమన్ పాటలు, బీజీఎం నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. మొత్తంగా భీమ్లా నాయక్ ఫ్యాన్స్ ఆశించిన అన్ని అంశాలతో కూడిన పర్ఫెక్ట్ మాస్ ఎంటర్టైనర్ అంటున్నారు.