- Home
- Entertainment
- Bheemla Nayak: అయ్యప్పనుమ్ కోషియం, భీమ్లాకి మధ్య తేడా గమనించారా.. త్రివిక్రమా మజాకా..
Bheemla Nayak: అయ్యప్పనుమ్ కోషియం, భీమ్లాకి మధ్య తేడా గమనించారా.. త్రివిక్రమా మజాకా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆరడుగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటి కలసి నటించిన భీమ్లా నాయక్ చిత్రం ప్రేక్షకుల మాస్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. నేడు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆరడుగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటి కలసి నటించిన భీమ్లా నాయక్ చిత్రం ప్రేక్షకుల మాస్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. నేడు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. సాగర్ చంద్ర దర్శకత్వంలో.. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లేలో ఈ చిత్రం తెరకెక్కింది. మలయాళీ చిత్రం అయ్యప్పన్ కోషియంకి ఇది రీమేక్.
ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి ఒరిజినల్ వర్షన్ చూసిన వారిలో చాలా సందేహాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ చిత్రంలో విలన్ అంటూ ఎవరూ ఉండరు. అలాంటి కథలో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో, రానా లాంటి సాలిడ్ పెర్ఫామెన్స్ ఇచ్చే నటుల్ని పెట్టి ఎలా చేస్తారు అనే సందేహాలు ఉండేవి. పవన్ కోసం రానా పాత్ర తగ్గిస్తారా అనే చర్చ కూడా జరిగింది. అందులోనూ ఒరిజినల్ వర్షన్ లో ఈ స్థాయిలో మాస్ జాతర ఉండదు.
అప్పుడప్పుడూ విడుదలవుతూ వచ్చిన టీజర్స్ తో ఈ మూవీలో పవన్ పాత్రని బాగా పెంచేశారు అనే డౌట్ కలిగింది. అన్నీ మనమే ఊహించేసుకుంటే అక్కడ త్రివిక్రమ్ ఎందుకు ఉండేది ? సిల్వర్ స్క్రీన్ మాంత్రికుడు త్రివిక్రమ్ తన రచనకు పదును పెట్టి ఒరిజినల్ కథకు, పాత్రలకు న్యాయం చేస్తూ మ్యాజిక్ చేశారు.
అయితే ఒరిజినల్ వర్షన్ కు, భీమ్లా కి కొన్ని స్పష్టమైన తేడాలు ఉన్నాయి. ఒరిజినల్ వర్షన్ లో హీరోయిన్స్ కి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ఇక్కడ నిత్యామీనన్, సంయుక్త ల పాత్రలు పెంచారు. ఒరిజినల్ వర్షన్ లో ఫస్ట్ హాఫ్ లో పృథ్వి రాజ్ పాత్ర హైలైట్ అవుతుంది. అంటే ఇక్కడ రానా పోషించిన డానీ రోల్. రానా పాత్రని హైలైట్ చేయడం ఇక్కడ కుదరదు. ఎందుకంటే రానాకి ఎదురుగా ఉన్నది పవన్ కళ్యాణ్.
ఇక్కడ త్రివిక్రమ్ మార్క్ రైటర్, సాగర్ చంద్ర టేకింగ్ అద్భుతంగా కలసి వచ్చింది. ఎవరి పాత్రలు తగ్గించారని ఫీలింగ్ రాకుండా స్టన్నింగ్ అనిపించే ఫేస్ ఆఫ్ సీన్స్ తో రక్తి కట్టించారు. ఇక క్లయిమాక్స్ లో ఒరిజినల్ వర్షన్ కాస్త బోరింగ్ అనిపిస్తుంది. కానీ భీమ్లాలో ఎమోషనల్ సీన్స్ తో కట్టిపడేసారు. సినిమాలో క్లయిమాక్స్ హైలైట్ అని అంటున్నారు.
త్రివిక్రమ్ ఒరిజినల్ సోల్ మిస్ కాకుండా పవన్, రానా ఇద్దరికీ ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే పవన్ ఫ్యాన్స్ కోరుకునే అంశాలని కూడా జోడించగలగడం బాగా ప్లస్ అయింది. పవన్ ఇమేజ్ కి, రానా బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా రాసుకున్న డైలాగులు బాగా పేలుతున్నాయి. ఇక బ్రహ్మానందం, సునీల్, హైపర్ ఆది పాత్రలని తెలుగు ఆడియన్స్ కోసం పెట్టారనే చెప్పాలి.