Bheemla Nayak: సాంప్రదాయం తొణికిస లాడుతున్నట్టు.. గుడిలో 'భీమ్లా నాయక్' బ్యూటీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భల్లాల దేవుడు రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు భీమ్లా నాయక్ ఫీవర్ తో ఊగిపోతున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భల్లాల దేవుడు రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు భీమ్లా నాయక్ ఫీవర్ తో ఊగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుంటే హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది.
అమలాపురం నుంచి అమెరికా వరకు పవన్ ఫ్యాన్స్ భీమ్లా నాయక్ జపం చేస్తున్నారు. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో బుధవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవంతం అయింది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేసిన కొత్త ట్రైలర్ ఫ్యాన్స్ కి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ అతిథులుగా హాజరయ్యారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సంయుక్త మీనన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. గ్లామర్ మెరుపులు మెరిపించడమే కాదు.. తన స్పీచ్ తో సంయుక్త అందరినీ కట్టి పడేసింది. రానా, పవన్ కళ్యాణ్ లపై ప్రశంసలు కురిపించింది. హైదరాబాద్ తన హోమ్ టౌన్ కావాలని ఆశిస్తున్నట్లు తన మనసులో మాట బయట పెట్టింది.
అలాగే 'ఇల్లేమో దూరం.. అసలే చీకటి గాఢాంధకారం' అంటూ పవన్ కళ్యాణ్ రాజకీయ సభల్లో చెప్పే మాటలు చెప్పి ఫ్యాన్స్ లో జోష్ నింపింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నిత్యామీనన్ హాజరు కాలేదు. దీనితో సంయుక్త అందరి దృష్టిని ఆకర్షించింది.
తాజాగా సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో టెంపుల్ లో సంప్రదాయం తొణికిస లాడుతున్నట్టు ఉన్న ఫోటోలు షేర్ చేసింది. సాంప్రదాయ చీరకట్టులో సంయుక్త చూడ ముచ్చటగా ఉంది.
పవన్ ఫ్యాన్స్ లో, ట్రెండ్ వర్గాల్లో భీమ్లా నాయక్ చిత్రంపై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో పవన్ కి జోడిగా తొలిసారి నిత్యామీనన్ నటిస్తోంది. అలాగే రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. మురళి శర్మ, రావు రమేష్, సముద్ర ఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.