- Home
- Entertainment
- Bheemla Nayak: అందాల రాక్షసిలా 'భీమ్లా నాయక్' బ్యూటీ.. క్యూట్ లుక్స్ తో చంపేస్తున్న నిత్యా మీనన్
Bheemla Nayak: అందాల రాక్షసిలా 'భీమ్లా నాయక్' బ్యూటీ.. క్యూట్ లుక్స్ తో చంపేస్తున్న నిత్యా మీనన్
సౌత్ లో ప్రస్తుతం ఉన్న నటీమణులలో నటన పరంగా Nitya Menen టాప్ లీగ్ లో ఉంటుంది. కళ్ళతోనే హావభావాలు పలికించే నటీమణులు చాలా అరుదు. ఆ అద్భుతమైన ప్రతిభ నిత్యామీనన్ సొంతం.

సౌత్ లో ప్రస్తుతం ఉన్న నటీమణులలో నటన పరంగా Nitya Menen టాప్ లీగ్ లో ఉంటుంది. కళ్ళతోనే హావభావాలు పలికించే నటీమణులు చాలా అరుదు. ఆ అద్భుతమైన ప్రతిభ నిత్యామీనన్ సొంతం.
నిత్యామీనన్ నుంచి దర్శకులు ఎలాంటి ఎమోషన్ అయినా రాబట్టుకోవచ్చు. ఇక నిత్యామీనన్ కూడా సినిమాల ఎంపిక విషయంలో సెలెక్టివ్ గా ఉంటుంది. రీసెంట్ గా నిత్యామీనన్ స్కై ల్యాబ్ చిత్రంలో నటించింది. ప్రస్తుతం నిత్యా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన భీమ్లా నాయక్ చిత్రంలో నటిస్తోంది.
నిత్యా మీనన్ తొలిసారి Pawan Kalyan కి జోడిగా నటిస్తుండడంతో ఆసక్తి నెలకొంది. ఆ మధ్యన నిత్యా మీనన్ భీమ్లా నాయక్ చిత్రంలో తన రోల్ గురించి కూడా కొన్ని విషయాలు షేర్ చేసింది.
త్రివిక్రమ్ తో ముందు నుంచి పరిచయం ఉంది. ఆయనకు నేనెప్పుడూ ఒక రౌడీ అమ్మాయిలాగే కనిపిస్తాను. అందుకే సన్నాఫ్ సత్యమూర్తి లో అలాంటి రోల్ ఇచ్చారు. ఇప్పుడు భీమ్లా నాయక్ లో కూడా నేను రౌడీ అమ్మాయి లాగే కనిపిస్తాను. అయ్యప్పన్ కోషియంలో ఈ పాత్రకు అంత ప్రాధాన్యత ఉండదు. కానీ భీమ్లా నాయక్ లో నా రోల్ పెంచారు అని నిత్యామీనన్ పేర్కొంది.
ఇక నిత్యామీనన్ గ్లామర్ రోల్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్. స్కిన్ షో ఉండే పాత్రలని నిత్యా మీనన్ అసలు అంగీకరించాడు. ఆమె కేవలం తన నటన, క్యూట్ లుక్స్ తోనే ఇంతమంది అభిమానులని సొంతం చేసుకుంది.
తాజాగా నిత్యా మీనన్ తన క్యూట్ లుక్స్ తో మరోసారి ఆకట్టుకుంది. ఇన్స్టాగ్రామ్ లో నిత్యామీనన్ తన లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేసింది. కర్లీ హెయిర్ , క్యూట్ లుక్స్ తో నిత్యామీనన్ అందాల రాక్షసి లాగా ఇచ్చిన ఫోజులు నెట్టింట వైరల్ గా మారాయి. నెటిజన్లు వెరీ క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.