- Home
- Entertainment
- Krishna Mukunda Murari: నిజం తెలుసుకుని కుప్ప కూలిపోయిన గౌతమ్.. తెలివిగా ప్లాన్ మార్చేసిన భవాని!
Krishna Mukunda Murari: నిజం తెలుసుకుని కుప్ప కూలిపోయిన గౌతమ్.. తెలివిగా ప్లాన్ మార్చేసిన భవాని!
Krishna Mukunda Murari: స్టార్ మాలో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. ఆడపడుచు కోసం పోరాటం చేస్తున్న ఒక కోడలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 20 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో కృష్ణ కి ఇచ్చిన మాట తప్పుతున్నాను. రేపు గౌతమ్ మొహం ఎలా చూడాలి అనుకుంటాడు మురారి. మరోవైపు పెళ్లి వాళ్ళని ఎలా మర్యాదలు చేయాలో మురారి కి చెప్తుంది భవాని. ఇంతలోనే కృష్ణ కిందికి రావడం చూసి అందరూ కామ్ అయిపోతారు. నేను కిందికి వెళ్లి కామ్ అయిపోతే అందరూ నన్ను అనుమానిస్తారు అనుకుంటూ తన స్టైల్ లో మాట్లాడుతుంది కృష్ణ.
ఏమైంది ఎసిపి సర్ ఎందుకు అలా ఉన్నారు మీకు ఏమైనా ఇష్టం లేని పని చేస్తున్నారా అంటూ నిలదీస్తుంది. అలాంటిదేమీ లేదు అంటాడు మురారి. అయినా అవన్నీ నీకెందుకు నిన్నేమైనా డ్రాప్ చేయాలా నువ్వు ఏమైనా చిన్న పిల్లవా, పెద్దత్తయ్య తనకి పని అప్పచెప్పారు మురారి బిజీగా ఉన్నాడు అంటుంది ముకుంద. పెద్ద అత్తయ్య చెప్తే కచ్చితంగా చేసి తీరాలి కానీ ఈ మధ్యలో నువ్వు ఎందుకు పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకున్నట్లుగా అంటుంది కృష్ణ.
అందరూ ఆ మాటలకి షాక్ అవుతారు. పాత సామెత కదా ఎందుకు అందరూ అలా చూస్తున్నారు అయినా మీ పని మీద మీరు వెళ్ళండి నా పని మీద నేను వెళ్తాను. మీ వెనక నేనెందుకు ఆగిపోయిన పెళ్ళికి బాజాల లాగా అంటూ మళ్లీ పెళ్లి ఊసెత్తుతుంది కృష్ణ. నీ పని మీద మీరు వెళ్తే నా పని మీద నేను వెళ్తాను ఈరోజే ఆపరేషన్ ప్రారంభిస్తున్నాను పెద్ద అత్తయ్య సక్సెస్ అవ్వాలని దీవించండి అంటూ భవాని కాళ్ళకి నమస్కరిస్తుంది కృష్ణ.
కనీసం గుమ్మం వరకైనా తోడు రండి అంటూ భర్తని తనతో పాటు తీసుకెళ్తుంది. కృష్ణ కి నిజం తెలిసిపోయిందా తన మాటల్లో ఏదో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. తన మాటల తో ఏదో సంకేతాన్ని తెలియజేస్తుంది అంటూ కంగారుపడుతుంది భవాని. మరోవైపు తన కొలీగ్ భాను దగ్గరికి వచ్చి ఇంకా కృష్ణ రాలేదు అంటూ కంగారు పడతాడు గౌతమ్. ఆరడుగుల ఉన్న నిన్నే బెదరగొట్టి తరిమేసారు అలాంటిది ఒంటరి ఆడపిల్ల తనని వదులుతారా.
నీకోసం తన కాపురాన్ని రిస్క్ లో పెట్టుకుంటుంది అంటాడు భాను. కానీ మా ఇద్దరికీ ఏసిపి సర్ సపోర్టు ఫుల్ గా ఉంది అంటాడు గౌతమ్. కానీ అతనికి ఫ్యామిలీ సపోర్టు లేదు కదా అంటాడు భాను. అనవసరంగా కృష్ణమ్మ ని ఇందులో ఇన్వాల్వ్ చేశాను అంటూ బాధపడతాడు గౌతమ్. మరోవైపు మురారిని ఫాలో చేస్తే నందిని ఎక్కడ ఉందో తెలుస్తుంది అనుకొని ఆటో ఎక్కి కారుని ఫాలో అవ్వమని చెప్తుంది కృష్ణ. అయితే ఆ ఆటో డ్రైవర్ ట్రాఫిక్ లో కన్ఫ్యూజ్ అయి కారుని మిస్ చేయటంతో బాగా నిరుత్సాహపడుతుంది కృష్ణ.
మరోవైపు ముకుందని నందిని ఎక్కడ అని అడుగుతాడు మురారి. నాకు తెలియదు బహుశా పెద్ద అత్తయ్య తనతో తీసుకువస్తారేమో అంటుంది ముకుంద. నువ్వు పెద్దమ్మతో కలిసి తిరుగుతున్నావు కదా నీకు నిజం తెలియదా అంటాడు మురారి. నిజంగానే నాకు ఏమీ తెలియదు అయినా నువ్వు ఎందుకు అంత డల్ గా ఉన్నావు నాతో చెప్పకూడదా, నేను అంత పరాయి దాన్నా అంటుంది ముకుంద ఏమీ లేదని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మురారి.
మరోవైపు దిగులుగా తన దగ్గరికి వచ్చిన కృష్ణని ఏమైంది ఎందుకు అంత డల్ గా ఉన్నావు ఏసిపి సర్ ఏరి అని అడుగుతాడు గౌతమ్. పెద్దత్తయ్య వాళ్ళతో ఉన్నారు ఈరోజు నందినికి పెళ్లి చేస్తున్నారు అని చెప్తుంది కృష్ణ. ఒక్కసారిగా షాక్ అయిన గౌతమ్ కుప్పకూలిపోతాడు. కంగారు పడకండి మీ పెళ్లి ఖచ్చితంగా నేను చేస్తాను అని కాన్ఫిడెంట్ గా చేస్తుంది కృష్ణ. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నావు, అసలు నాకు ఈ పెళ్లి వద్దు వాళ్ళ అరాచకానికి నేనే సాక్ష్యం.
ఇప్పుడు నాతో పాటు నువ్వు కూడా ప్రాబ్లం లో ఇరుక్కుంటావు అంటాడు గౌతమ్. అలాంటిదేమీ జరగదు సర్ అసలు నందిని ఎక్కడ ఉందో తెలిస్తే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అంటుంది కృష్ణ. మరోవైపు పెళ్లికి వచ్చిన భవాని వాళ్ళని నందిని ఏది అని అడుగుతాడు మురారి. మా ఫ్రెండ్ తీసుకువస్తుంది అంటుంది భవాని. అంతలోనే పెళ్లి వాళ్ళు రావడంతో వాళ్లకి మర్యాదలు చేయమని వాళ్లతో పంపిస్తుంది.
మరోవైపు కొన్ని జీవితాలు ఇంతే సామాజికంగా నా హోదాని పెంచుకున్నా భవాని అనే శిఖరాన్ని దాటి నందిని చేరుకోలేని అంటూ డిసప్పాయింట్ అవుతాడు గౌతమ్. తరువాయి భాగంలో మండపానికి వచ్చిన నందిని నాకు ఈ పెళ్లి వద్దు అంటూ మారం చేస్తుంది. మరోవైపు మండపానికి వచ్చిన గౌతం వాళ్లు అక్కడ నందిని వాళ్ళు లేకపోవడంతో ఆటలో వాళ్లే గెలిచారు అంటూ నిరుత్సాహ పడతాడు గౌతమ్. అలా జరగదు కచ్చితంగా మీ ప్రేమ గెలుస్తుంది అంటుంది కృష్ణ.