- Home
- Entertainment
- ఆ హీరోయిన్ భుజంపై చేయి వేయడానికి వణికిపోయిన అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్, ఏఎన్నార్ లను భయపెట్టిన నటి ఎవరంటే?
ఆ హీరోయిన్ భుజంపై చేయి వేయడానికి వణికిపోయిన అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్, ఏఎన్నార్ లను భయపెట్టిన నటి ఎవరంటే?
ఎన్టీఆర్, ఏఎన్నార్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రెండు కళ్లు అంటుంటారు. వారి మాట అంటే ఇండస్ట్రీలో శాసనంతో సమానం. కానీ అటువంటి పెద్ద హీరోలను కూడా భయపెట్టిన హీరోయిన్ గురించి మీకు తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us

తెలుగు సినీ పరిశ్రమకు సేవలందించిన లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్ఆర్) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా టాలీవుడ్‌లో నాలుగు దశాబ్దాల పాటు కీలక పాత్ర పోషించిన ఆయన సినీ ప్రస్థానం సుమారు 75 సంవత్సరాలపాటు సాగింది. 90 ఏళ్లు దాటిన తరువాత ఏఎన్నార్ క్యాన్సర్ తో మరణించారు. ఇక అక్కినేని కుటుంబం కూడా ప్రతీ ఏడాది ఆయన జయంతి, వర్ధంతి ని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహిస్తుంటుంది. రీసెంట్ గానే ఏఎన్ఆర్ శత జయంతి వేడుకలను వారి కుటుంబం ఘనంగా నిర్వహించింది.
చివరి సినిమా కుటుంబంతో చేసిన అక్కినేని
ఇక ఏఎన్నార్ ఊపిరి ఉన్నంత వరకూ సినిమాకోసమే బ్రతికారు. సినిమానే ఊపిరిగా భావించారు. మరణించే వరకూ నటిస్తూనే ఉన్నారు . అంతే కాదు ఆయన తన చివరి సినిమా తన ఫ్యామిలీ అంతటితో కలిసి చేశారు. అక్కినేని మూడు జనరేషన్స్ కలిసి నటించిన సినిమా మనం.
ఈ సినిమా చేసిన కొద్ది రోజులకే అక్కినేని చనిపోయారు. హీరోగా ఆయన టాలీవుడ్ కు ఎంతో చేశారు. ఏఎన్నార్ ఇండస్ట్రీ చేత సరికొత్త అడుగులు వేయించారు. టాలీవుడ్ కు వెస్ట్రన్ డాన్స్ లు నేర్పించిన హీరో అక్కినేని. ఆయనతో నటించడమంటే హీరోయిన్లు ఎవరైనా సరే ఎగిరిగంతేసేవారట.
హీరోయిన్లతో ఏఎన్ ఆర్ చాలా సరదాగా ఉండేవారు. కాని ఒక హీరోయిన్ అంటేనే ఏఎన్నార్ కాస్త భయపడేవారు, అక్కినేని మాత్రమే కాదు ఎన్టీఆర్ కి కూడా ఆ హీరోయిన్ అంటే కాస్త భయమే ఉండేదట. ఆమె ఎవరో కాదు భానుమతి. భానుమతి ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో అందరికి తెలుసు. ఎంత పెద్ద హీరో అయినా ఆమె అలానే ఉండేవారు. ఈక్రమంలోనే ఏఎన్ఆర్, భానుమతి గురించి ఓ ఆసక్తికరమైన పాత సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భానుమతితో కలిసి నటించిన సమయంలో ఏఎన్ఆర్‌కు ఎదురైన ఓ చిన్న అనుభవాన్ని స్వయంగా ఆయనే జయప్రదతో చేసిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
భానుమతితో నటించాలంటే భయం
హీరోయిన్ గా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, దర్శకురాలిగా భానుమతి స్థాయి, సామర్థ్యం, ఆత్మవిశ్వాసం వేరు. స్టార్ హీరోల ముందు కూడా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడేవారు భానుమతి. ఎన్టీఆర్ ఏఎన్నార్ ల కంటే ముందు ఇండస్ట్రీకి వచ్చారు ఆవిడ. అంతే కాదు ఈ ఇద్దరు హీరోలకంటే వయసులో కూడా పెద్దవారు కావడంతో అందరు ఆమెను గౌరవించేవారు.
తెలుగు చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు భానుమతి. వయస్సులోను, నటన పరంగా కూడా భానుమతి ఏఎన్ఆర్ కంటే ముందుగానే పరిశ్రమలో స్థిరపడ్డారు. ఆమె ధైర్యసాహసాలు, స్పష్టత, పట్టుదల సినీ పరిశ్రమలో అందరికీ తెలిసిన విషయమే. అంతటి స్థాయిలో ఉన్న భానుమతితో నటించాలంటే అప్పటి నటులకు కూడా భయం కలిగేదట.
నాగేశ్వరావు ను బెదిరించిన భానుమతి
ఈక్రమంలోనే భానుమతితో జరిగిన ఓ సంఘటనను ఏఎన్ఆర్ స్వయంగా వివరించారు. ఓ సినిమా పాట షూటింగ్ జరుగుతుంది, ఆ సీన్ సందర్భంగా, భానుమతి భుజంపై చేయివేయాల్సిన సన్నివేశం ఉండేది. అయితే ఆ సీన్ చేయాలంటే ఏఎన్ఆర్ చాలా టెన్షన్ పడ్డారట. ఆమె ఎదురుగా నడుస్తూ, సన్నివేశం ప్రకారం చేయివేయాల్సిన సీన్‌ను షూట్ చేయాల్సి ఉండేది.
ఆ సమయంలో భానుమతి ధరించిన చీరకొంగు, బ్లౌజ్ మెరిసే మెటీరియల్‌తో ఉండటంతో, చేయివేస్తే గుచ్చినట్లుగా అనిపించింది. దీనివల్ల ఏఎన్ఆర్ అసౌకర్యానికి గురయ్యారు. ఇంకోవైపు ఆమెతో నటించాలన్న భయం, దాంతో ఆ సీన్ చేయడానికి ఏఎన్ఆర్ వణికిపోయేవారు. చివరికి ఆమె స్వయంగా "సరిగ్గా చేయివేయండి" అంటూ గట్టిగా చెప్పడంతోో ఏఎన్నార్ భయపడ్డారట.
అంతే కాదు భానుమతి అందరికంటే సీనియర్ కావడంతో.. అక్కినేని నాగేశ్వారావు కు నటుడిగా ఎదగడానికి ఓ హోమ్ వర్క్ కూడా ఇచ్చారట . కెమెరా తీసుకుని అప్పటి అందమైన లొకేషన్స్ ఫోటో తీయ్యమనేవారట. ఒకసారి చెట్లు ఎక్కడం, కొండలు ఎక్కడం, సడెన్ గా నవ్వడ, ఏడ్వడం, డాన్స్ వేయడం.. ఇలా రకరకాల పనులద్వారా నటన నేర్పించిందని ఆయన అన్నారు. అంతే కాదు ఆ అనుభవం ఎప్పటికీ మరిచిపోలేనిదని ఆయన అన్నారు.
భానుమతి ప్రభావం:
భానుమతిపై ఇండస్ట్రీలో ఎలాంటి గౌరవం ఉండేదో ఈ సంఘటన ద్వారా తెలుస్తోంది. ఎన్టీఆర్ వంటి సీనియర్ నటులు కూడా ఆమె ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారట. ఆమె నైపుణ్యం, వ్యక్తిత్వం అందరినీ ప్రభావితం చేయడంలో ప్రధాన పాత్ర వహించాయి.ఏఎన్ఆర్ మాటల్లోనే వెల్లడైన ఈ సంఘటన ఇప్పుడు అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది. సినీ చరిత్రలో గొప్ప నాయికా నాయకుల మధ్య జరిగిన ఈ చిన్న సంఘటన వారికి ఉన్న పరస్పర గౌరవాన్ని, అదే సమయంలో అప్పటి కాలంలో నటుల బాధ్యతను సూచిస్తుంది.