MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఇంకొకరైతే ఆ కేసులో నన్ను కూడా ఇరికించేవారు, నిజమైన ఫ్రెండ్ అంటే సుమనే.. క్రేజీ హీరో సంచలన వ్యాఖ్యలు

ఇంకొకరైతే ఆ కేసులో నన్ను కూడా ఇరికించేవారు, నిజమైన ఫ్రెండ్ అంటే సుమనే.. క్రేజీ హీరో సంచలన వ్యాఖ్యలు

Suman : సుమన్ ఓ కేసులో చిక్కుకోవడం వాళ్ళ కెరీర్ లో వెనుకబడిపోయారు. సుమన్ కష్టాల్లో ఉన్నప్పటికీ ఫ్రెండ్ షిప్ కి విలువ ఇచ్చిన వ్యక్తి అని ఓ క్రేజీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 13 2025, 07:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగు ఇండస్ట్రీలోకి సుమన్ ఎంట్రీ 
Image Credit : Facebook/Suman

తెలుగు ఇండస్ట్రీలోకి సుమన్ ఎంట్రీ 

సీనియర్ నటుడు సుమన్ కెరీర్ లో ఓ వివాదంలో చిక్కుకుని జైలు పాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సుమన్ తన కెరీర్ లో వెనుకబడిపోయారు. సుమన్ కి ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. వారిలో భాను చందర్ ఒకరు. భాను చందర్ 80, 90 దశకాలలో హీరోగా రాణించిన సంగతి తెలిసిందే. సుమన్ తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడానికి పరోక్షంగా కారణం భాను చందర్ అనే చెప్పాలి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రాంగ్ స్టెప్ వేస్తున్నావు అని సుమన్ కి చెప్పా 
Image Credit : Facebook/Suman Talwar Hero

రాంగ్ స్టెప్ వేస్తున్నావు అని సుమన్ కి చెప్పా 

 భాను చందర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుమన్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. అప్పట్లో సుమన్ తెలుగు సినిమాలు చేసేవాడు కాదు అని భానుచందర్ అన్నారు. నేను సుమన్ తో ఒకరోజు ఇలా అన్నాను. సుమన్ నువ్వు రాంగ్ స్టెప్ వేస్తున్నావు అని చెప్పా. ఏమైంది అని అడిగారు. నువ్వు తమిళ ఇండస్ట్రీకి పనికిరావు రా.. తెలుగు ఇండస్ట్రీకి వస్తే నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు అని చెప్పా. నువ్వు తెలుగు ఇండస్ట్రీకి వచ్చేయ్ అని చెప్పా. సుమన్ వెంటనే అయ్యో నేను రాను.. నాకు తెలుగు భాష ఒక్క ముక్క రాదు అని చెప్పాడు. 

35
తెలుగులో సుమన్ తొలి చిత్రం 
Image Credit : our own

తెలుగులో సుమన్ తొలి చిత్రం 

భాష గురించి నువ్వు దిగులు పడకు.. మూడు నెలల్లో నేర్చేసుకోవచ్చు అని చెప్పా. వెంటనే సుమన్ ని తీసుకుని వెళ్లి తమ్మారెడ్డి భరద్వాజ గారికి పరిచయం చేశాను. మేమిద్దరం కరాటేలో బ్లాక్ బెల్ట్స్. మమ్మల్ని హీరోగా పెట్టి ఒక సినిమా తీస్తే బావుంటుంది అని తమ్మారెడ్డితో అన్నాను. ఆయన ఏంటి భాను ఎవరో ఎర్ర తోలు వాడిని నాకు పరిచయం చేస్తున్నావు అని అన్నారు. రెండు రోజుల తర్వాత ఆయనే వచ్చి భాను.. మీ ఇద్దరితో సినిమా చేస్తున్నాను కథ రెడీగా ఉంది. రేపటి నుంచే షూటింగ్ అని అన్నారు. ఆ చిత్రమే ఇద్దరు కిలాడీలు అని భాను చందర్ తెలిపారు. 

45
నాతో మాట్లాడకు అని సుమన్ అన్నారు 
Image Credit : our own

నాతో మాట్లాడకు అని సుమన్ అన్నారు 

భాష విషయంలో సుమన్ బిగినింగ్ లో ఇబ్బంది పడ్డారు. నేను, తమ్మారెడ్డి గారు ఎంకరేజ్ చేశాం. దీనితో తక్కువ సమయంలోనే సుమన్ తెలుగులో క్రేజీ హీరోగా మారిపోయారు. మా ఇద్దరి ఫ్రెండ్ షిప్ కూడా బాగా బలపడిపోయింది. కానీ ఒక రోజు సడెన్ గా సుమన్ కారులో నా దగ్గరికి వచ్చి రేయ్ భాను.. రేపటి నుంచి నువ్వు నాకు ఫోన్ చేయవద్దు, మాట్లాడవద్దు అని చెప్పాడు. ఏం జరిగిందిరా నీకేమైనా మెంటలా అని అడిగా. 

55
నిజమైన ఫ్రెండ్ అంటే సుమనే 
Image Credit : Google

నిజమైన ఫ్రెండ్ అంటే సుమనే 

ఒక వివాదంలో పోలీసులు నన్ను ఎంక్వైరీ చేస్తున్నారు. నాతో పరిచయం ఉన్న వారందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. నువ్వు నా ఫ్రెండ్ అని తెలిస్తే నిన్ను కూడా క్వశ్చన్ చేస్తారు. నా వల్ల నువ్వు కూడా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. రేపు నా పరిస్థితి ఏంటో తెలియదు.. నేను ఇంట్లో ఉంటానా.. జైల్లో ఉంటానా అనేది కూడా తెలియదు. కాబట్టి నాకు దూరంగా ఉండడమే బెటర్ అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాతి రోజు పేపర్ చూస్తే సుమన్ జైల్లో ఉన్నారని న్యూస్ కనిపించింది.  సుమన్ ప్లేస్ లో ఇంకెవరైనా ఉండి ఉంటే నాతో పాటు భాను చందర్ కూడా ఇరుక్కోవాలి అని కోరుకునేవారు. కానీ సుమన్ రియల్ ఫ్రెండ్. తన వల్ల తాన్ ఫ్రెండ్ ఇబ్బందులు పడకూడదు అని ఆలోచించాడు. అది సుమన్ వ్యక్తిత్వం అంటూ భాను చందర్ ప్రశంసలు కురిపించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ
Recommended image2
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image3
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Related Stories
Recommended image1
మిరాయ్ హీరోయిన్ రితిక నాయక్ కి ఇష్టమైన తెలుగు హీరో ఎవరో తెలుసా, అల్లు అరవింద్ కూడా ఆమెకి ఫిదా
Recommended image2
బాలయ్య, నాగార్జున పరువు పోయే పరిస్థితి క్రియేట్ చేసిన కమెడియన్ ఎవరు.. రూ.50000 తో అరాచకం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved