- Home
- Entertainment
- Alia Bhatt Photos: గంగూబాయి స్టైల్ కి ‘బెర్లిన్’ ఫిదా... చీరకట్టులో మెస్మరైజ్ చేస్తున్న ‘అలియా భట్’
Alia Bhatt Photos: గంగూబాయి స్టైల్ కి ‘బెర్లిన్’ ఫిదా... చీరకట్టులో మెస్మరైజ్ చేస్తున్న ‘అలియా భట్’
‘ఆర్ఆర్ఆర్’(RRR) హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) నటించిన తాజా చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. ఈ చిత్రం ప్రీమియర్ లో భాగంగా చిత్ర సభ్యులు ఇటీవల బెర్లిన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఫెస్టివల్ స్టేజ్ పై అలియా భట్ గంగూబాయి స్టైల్ లో అందరినీ ఆకట్టుకుంది.

72వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అలియా భట్ (Alia Bhatt) నటించిన ‘గంగూబాయి కతియావాడి’ (Gangubai Kathiawadi) ప్రీమియర్ కోసం చిత్ర యూనిట్ ఇటీవల జర్మనీకి వెళ్లింది.
ఇప్పటికే మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న గంగూబాయి కతియావాడి మేకర్స్ భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈక్రమంలోనే జర్మనీలోని బెర్లిన్ లో నిర్వహిస్తున్న బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లోనూ తమ మూవీ ప్రీమియర్ షోను ప్రదర్శించారు. ఈ సందర్భంగా అలియా భట్ తన స్టైల్ లో ఫెస్టివల్ లో అట్రాక్ట్ గా నిలుస్తోంది. తన ఫిల్మ్ ను ప్రమోట్ చేసుకునేందుకు ‘గంగూబాయి’ స్టైల్ లోనే అక్కడి గెస్ట్స్ ను పరిచయం చేసుకుంది. ఇందుకు ఫెస్టివల్ కు వచ్చిన సభ్యులు ఫిదా అయ్యారు.
అయితే అక్కడి ఫొటోలను అలియా తన సోషల్ మీడియా అఫిషియల్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. బెర్లిన్ లో తన ప్రమోషన్స్ విషయాలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రెండో రోజు ఫెస్టివల్ లో పాల్గొన్న అలియా భట్ గంగూబాయి స్టైల్ లో చూపరులను ఆకట్టుకుంది. వెనుకకు తిరిగిన నమస్తే పోజ్ తో ఫొటోలకు ఫోజులిచ్చింది. అయితే ఇదే ఫోజ్ ను ఆమె ప్రియుడు రణబీర్ కపూర్ (Ranbir Kapoor) కూడా వెనుకబడిన నమస్తే పోజ్తో ప్రశంసించిన విషయం తెలిసిందే.
గంగూబాయి కతియావాడిలో అలియా భట్ ముంబైలోని రెడ్ లైట్ జిల్లా అయిన కామాతిపురలో రాజకీయ అధికారం మరియు ప్రాబల్యాన్ని సాధించుకున్న నిజజీవిత సెక్స్ వర్కర్‌గా కనిపిస్తుంది. జయంతిలాల్ గడాస్ పెన్ ఇండియా లిమిటెడ్ ఈ చిత్రాన్ని నిర్మించింది. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించారు. అజయ్ దేవగన్ (Ajay Devagan), శంతను మహేశ్వరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన గంగూబాయి ట్రైలర్ మాస్ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. అలియా భట్ ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.