MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 10 నిమిషాల్లో ఫోన్ పట్టుకుంటే.. ఇక సినిమాలు ఆపేస్తా – స్టార్ హీరో ఓపెన్ ఛాలెంజ్

10 నిమిషాల్లో ఫోన్ పట్టుకుంటే.. ఇక సినిమాలు ఆపేస్తా – స్టార్ హీరో ఓపెన్ ఛాలెంజ్

Kishkindhapuri - Bellamkonda Srinivas: కిష్కింధపురి సినిమా సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ కిష్కింధపురి సినిమా చూసేటప్పుడు ఫోన్ పట్టుకుంటే ఇండస్ట్రీని వదిలేస్తానంటూ ఛాలెంజ్ విసిరారు.

2 Min read
Author : Rajesh K
Published : Sep 10 2025, 06:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సినిమా కష్టాలు
Image Credit : https://x.com/BSaiSreenivas

సినిమా కష్టాలు

భారీ బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కించడం కాదు. ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించడం పెద్ద ఛాలెంజ్‌గా మారింది. ఎంత పెద్ద హీరో సినిమా అయినా.. కాస్త మిక్స్‌డ్ టాక్ వస్తే చాలు.. ఆశించిన కలెక్షన్లు రాబట్టలేకపోతారు. ఇక మిడియం రేంజ్ హీరోల సినిమా కష్టాలు మాములుగా ఉండవు.. కాస్త స్లో టాక్ వస్తే.. థియేటర్లలో ప్రేక్షకులే కనిపించరు. ఎంతో యువ హీరోల సినిమాలు ఇలానే కనీస వసూళ్లు సాధించకపోయాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
నిర్మాతల వ్యాఖ్యలు – ప్రమోషన్లలో కొత్త ట్రెండ్
Image Credit : https://x.com/BSaiSreenivas

నిర్మాతల వ్యాఖ్యలు – ప్రమోషన్లలో కొత్త ట్రెండ్

చిన్న సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో మూవీ మేకర్స్ ప్రేక్షకులను ఆకర్షించేందుకు విభిన్న రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉదాహరణకు ఇటీవల కోర్ట్ సినిమా ప్రమోషన్స్‌లో నిర్మాత నాని మాట్లాడుతూ – “ఈ సినిమా నచ్చకపోతే, నా సినిమాలు చూడకండి” అంటూ సవాల్ విసిరారు. అదే తరహాలో నాగవంశీ కూడా వార్ 2 ప్రమోషన్స్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా మూవీ మేకర్స్ షాకింగ్ కామెంట్స్ చేస్తూ.. సినిమాలపై క్యూరియసిటీ పెంచేస్తున్నారు. ప్రమోషన్లలో ఈ కొత్త ట్రెండ్ పాటిస్తూ.. ప్రేక్షక దేవుళ్లను థియేటర్లకు రప్పిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలే యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చేశారు.

Related Articles

Related image1
Bellamkonda Pan India Movie: పెద్ద బ్యానర్ లో బెల్లంకొండ వారి పుత్రరత్నం మరో పాన్ ఇండియా సినిమా...?
Related image2
Anupama : డైరెక్టర్ కు రాఖీ కట్టిన అనుపమా పరమేశ్వరన్.. హెచ్చరించిన రవితేజ!
35
కిష్కింధపురి కథ – థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్
Image Credit : https://x.com/BSaiSreenivas

కిష్కింధపురి కథ – థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన కిష్కింధపురి సినిమా సెప్టెంబర్ 12న విడుదల కానుంది. హర్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కౌషిక్ పెగల్లపాటి దర్శకత్వంలో రూపొందిన కిష్కింధపురి కథ 1989లో జరిగిన సంఘటనల చుట్టూ తిరుగుతుంది. సువర్ణమాయ అనే భవనంలోకి దెయ్యాలపై రీసెర్చ్ చేసేందుకు వెళ్లిన హీరో, హీరోయిన్, వారి ఫ్రెండ్స్ ఎదుర్కొన్న సవాళ్లు కథలో ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. థ్రిల్లింగ్ సన్నివేశాలు, చైతన్ భరద్వాజ్ అందించిన బీజీఎం ఈ సినిమాకు ప్లస్ అవుతాయని యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

45
“ఫోన్ పట్టుకుంటే ఇండస్ట్రీ వదిలేస్తా” – బెల్లంకొండ సవాల్
Image Credit : https://x.com/BSaiSreenivas

“ఫోన్ పట్టుకుంటే ఇండస్ట్రీ వదిలేస్తా” – బెల్లంకొండ సవాల్

కిష్కింధపురి సినిమా సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ, “సినిమా అంటే మనం టైమ్ మరిచిపోయి లీనం కావాలి. కిష్కింధపురి సినిమా ఆ థ్రిల్ ఇస్తుందని నేను నమ్ముతున్నా. ఒకవేళ సినిమా మొదలయ్యాక 10 నిమిషాల తర్వాత ఎవ్వరైనా ఫోన్ పట్టుకుంటే, నేను ఫిల్మ్ ఇండస్ట్రీని వదిలేస్తా. కథ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఆడియన్స్‌కి మంచి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి మా టీమ్ చాలా కష్టపడింది” అని కామెంట్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గత సినిమా భైరవం మూవీపెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో కిష్కింధపురిని హిట్ చేయాలని బెల్లంకొండ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

55
భారీ అంచనాలు – హిట్ కావాలనే ఆశ
Image Credit : https://x.com/BSaiSreenivas

భారీ అంచనాలు – హిట్ కావాలనే ఆశ

‘రాక్షసుడు’ వంటి హిట్‌తో మంచి పేరు తెచ్చుకున్న బెల్లంకొండ, అనుపమ పరమేశ్వరన్ కలసి నటించడం వల్ల ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గార్లపాటి నిర్మించిన ఈ చిత్రానికి చిన్మయ్ సలాస్కర్ సినిమాటోగ్రఫీ అందించారు. రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో బెల్లంకొండ చేసిన ఈ సంచలన కామెంట్స్ సినిమాపై హైప్‌ను మరింత పెంచాయి. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఎంత హర్రర్ థ్రిల్లర్ అయినా రెండున్నర గంటల పాటు ఫోన్ పట్టుకోకుండా చేయడం అసాధ్యం అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. దీంతో రిలీజ్ తర్వాత ట్రోలింగ్ తప్పదని అభిమానులు అంటున్నారు.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Folk Song: యూట్యూబ్‍లో 110 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్..ఈ పాట వింటే ప్రతి ఒక్కరి గుండె బరువెక్కాల్సిందే
Recommended image2
Sreeleela: క్రికెటర్ తో పీకల్లోతు ప్రేమలో శ్రీలీల..?
Recommended image3
Peddi Movie: పెద్దికి హిట్ టాక్ వస్తే ముందు లేచిపోయే రికార్డ్ ఏది.. పుష్ప 2 ? ధురంధర్ 2?
Related Stories
Recommended image1
Bellamkonda Pan India Movie: పెద్ద బ్యానర్ లో బెల్లంకొండ వారి పుత్రరత్నం మరో పాన్ ఇండియా సినిమా...?
Recommended image2
Anupama : డైరెక్టర్ కు రాఖీ కట్టిన అనుపమా పరమేశ్వరన్.. హెచ్చరించిన రవితేజ!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved