Bellamkonda Pan India Movie: పెద్ద బ్యానర్ లో బెల్లంకొండ వారి పుత్రరత్నం మరో పాన్ ఇండియా సినిమా...?
వరుస సినిమాలతో దూకుడు మీద ఉన్నాడు బెల్లంకొండవారి యంగ్ హీరో సాయి శ్రీనివాస్. తెలుగులో మరో స్టార బ్యానర్ లో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు.
బెల్లంకొండవారి వారసుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు శ్రీనివాస్. హీరోగా నిలబడటానికి చాలా ప్రయత్నాలు చేశాడు. చివరికి ఆయన నటించిన చిన్న సినిమా రాక్షసుడు పెద్ద హిట్ అయ్యింది. ఇక తన కెరీర్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు శ్రీనివాస్ ఇప్పటికే బాలీవుడ్ లో పాగా వేయాలని ప్లాన్ చేసుకున్నాడు బెల్లంకొండ.
బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం ఛత్రపతి సినిమా హిందీ రీమేక్ లో చేస్తున్నాడు. యాక్షన్ డైరెక్టర్ వినాయక్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతుంది. మాస్ సూపర్ యాక్షన్ తో కూడిన ఈ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్.
చత్రపతి రీమేక్ షూటింగు పూర్తికాగానే బెల్లంకొండ మరో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేయనున్నాడని సమాచారం.అది కూడా టాలీవుడ్ లో స్టార్ ప్రోడక్షన్ హౌస్ సితార బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి డైరెక్టర్ ను సెట్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. త్వరలో అఫీషియల్ గా ఈ సినిమా అనౌన్స్ చేయబోతున్నారని తెలుస్తోంది.
యూత్ లోను .. మాస్ ఆడియన్స్ లోను బెల్లంకొండకి మంచి పేరే ఉంది. ముఖ్యంగా బోయపాటితో జయ జానకీరామ లాంటి సినిమాలు చేసి మాస్ పల్స్ ను టచ్ చేశాడు శ్రీనివాస్. బెల్లంకొండ సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. బాలీవుడ్ సినిమా కోసం గ్యాప్ ఇచ్చిన సాయి శ్రీనివాస్.. ఇక తెలుగులో వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టబోతున్నాడు.