మూగ నటి అభినయ తెరవెనుక కన్నీటి గాథ.. మాట కోసం లక్షల అప్పులు..
మూగ నటిగా చిత్ర పరిశ్రమలో పేరుతెచ్చుకుంది అభినయ. హీరోయిన్లని మించిన అందంతో ఆకట్టుకుంటూ, అభినయంలో పేరుకు తగ్గట్టుగానే నిలుస్తూ అలరిస్తుంది. కానీ ఆమె సినిమాల్లోకి రాకముందు కష్టాలు మాత్రం అనేకం.

మూగ, చెవిటి సమస్యలున్నా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అభినయ. ఆమె అద్భుతమైన నటనా, అత్యద్భుతమైన హవభావాలు ఆమెని ఆడియెన్స్ కి చేరువ చేశాయి. సినిమాలకు పనికి రాదనే దశ నుంచి ప్రత్యేకపాత్రలకు ఆమె కేరాఫ్‌గా నిలుస్తూ రాణిస్తుంది. సౌత్‌లో బిజీ యాక్ట్రెస్‌గా మారిపోవడం విశేషం. `శంభోశివ శంభో` చిత్రంతో ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా అభినయకి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఆమె చిన్ననాటి నుంచే మూగ, వినికిడి సమస్యతో బాధపడుతుంది. అయితే మాటలు తెప్పించేందుకు ఆమె పేరెంట్స్ ఎన్నో బాధలు పడ్డారు. లక్షల ఖర్చు చేశారట. ఎలాగైనా మాటలు తెప్పించాలని, వినికిడి సమస్య లేకుండా చేయాలని తెలిసిన ప్రతి ట్రీట్‌మెంట్ చేయించారట. స్పీచ్ థెరపీ కూడా చేయించారు. చెన్నై నుంచి హైదరాబాద్‌కి తీసుకొచ్చారు. అనేక ఆసుపత్రిలు తిప్పారు.
ఆమె ట్రీట్‌మెంట్ కోసం పేరెంట్స్ అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందట. అప్పట్లోనే దాదాపు 11 లక్షల వరకు ఖర్చు చేశారు. బంధువులు, ఫ్రెండ్స్ ఇలా అందరి వద్ద అప్పులు తెచ్చి ట్రీట్ మెంట్ చేయించారట. కానీ ఎలాంటి ప్రయోజనం లేదు.ఆమె నుంచి ఒక్క మాట కూడా రాలేదు కదా, కనీసం సౌండ్ చేయలేని పరిస్థితి. ఎంతో శ్రమించిన, లక్షలు ఖర్చు చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఆ సమయంలో వారి బాధ, కన్నీళ్లు వర్ణణాతీతం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
అయితే అభినయకి మాటలు రాకపోయినా, వినలేకపోయినా ఆమెలో అద్భుతమైన హవాబావాలున్నాయి. తన భావాలను ముఖ కవలికలతో ఎక్స్ ప్రెస్ చేసేది. దీంతో ఆ ప్రతిభనే ఆమెకి కలిసొచ్చింది. నటనపై ఇష్టాన్నిపెంచింది. నటిగా మార్చింది. హీరోయిన్లకి ఏమాత్రం తగ్గని అందం అభినయం సొంతం. ఆమె హవాభావాలు అంతే బాగా పలికించడంతో సినిమాలో నటించే అవకాశం వచ్చింది.సినిమాలో మూగ అమ్మాయి కావాల్సి వస్తే అభినయని తీసుకున్నారట. ఏడో తరగతిలో అభినయకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశం వచ్చింది.
`నాడోడిగల్` అనే సినిమా కోసం ముంబై యాక్టర్ ను సెలెక్ట్ చేసుకున్నారు దర్శకుడు సముద్రఖని. ఆవిడకు తమిళ్ మాట్లాడటం కష్టం కావడంతో ఆ సినిమా నేను చేయను అని వెళ్ళిపోయింది. దీంతో మండిపోయిన దర్శకుడు ఎలాగైనా సరే అసలు కమ్యూనికేషన్ తెలియని హీరోయిన్ ను తీసుకువచ్చి సినిమాలో నటింపజేయాలని అనుకున్నారు. దీంతో అప్పటికప్పుడు సినిమాల్లోకి అభినయను తీసుకువచ్చి వెండితెరకు పరిచయం చేశాడు. అలా `నాడోడిగల్` చిత్రంతో ఆమె నటిగా తెరంగేట్రం చేసింది. ఇందులో హీరోలకు చెల్లిగా నటిస్తుంది.
ఈ సినిమా తమిళంలో పెద్ద హిట్ కావడంతో తెలుగులో `శంభో శివ శంభో` చిత్రంతో రీమేక్ చేశారు సముద్రఖని, రవితేజ, అల్లరి నరేష్ నటించారు. వారికి సిస్టర్‌గా అభినయ నటించింది. దీంతోపాటు కన్నడలోనూ రీమేక్ చేయగా, అందులోనూ అభినయ నటించింది. ఇలా ఒకే సినిమాతో మూడు భాషల్లోకి ఎంట్రీ ఇచ్చింది అభినయ. దీనికి రెండు అవార్డులు అందుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది.
తెలుగులో `నేనింతే`, `కింగ్`, `దమ్ము`, `ఢమరుకం`, `జీనియస్`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, `మహంకాళి`, `ధృవ`, `రాజుగారిగది 2`, `సీతారామం` చిత్రాల్లో నటించింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ సినిమాలు చేస్తూ రాణిస్తుంది. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది. ఇదిలా ఉంటే ఆ మధ్య అభినయని విశాల్ పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో నిజం లేదని తెలిపింది అభినయ.