సన్యాసినిగా మారిన ఆర్జీవి హీరోయిన్, కాషాయం కట్టిన ఒకప్పటి హాట్ బ్యూటీ...
ఒకప్పుడు వెండితెరపై వెలుగు వెలిగిన హీరోయిన్.. హాట్ హాట్ అందాలతో.. ఉర్రూతలూగించిన నటి. తన గ్లామర్ తో కుర్రకారకు చెమటలు పట్టించినబ్యూటీ.. ప్రస్తుతం సన్యాసినిగా మారి ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతుంది. అంత స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఎందుకు ఇలా మారింది...? కారణం ఏంటి ఎందుకు అలా మారిందీ.. ? ఇంతకీ ఎవరామె..
ఎంత గొప్ప జీవితం అయినా.. ఎంత డబ్బు పేరు సంపాదించినా.. ఏనిమిషానికి ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. మనం తీసుకునే నిర్ణయాలను బట్టే లైఫ్ ఆధార పడి ఉంటుంది. ముఖ్యంగా సిసిమా వాళ్ల జీవితంలో.. ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. వారి నిర్ణయాలు కూడా అంతే డిఫరెంట్ గా ఉంటాయి. ఎదురయ్యే సమస్యలు.. ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. బాలీవుడ్ లో గ్లామర్ క్వీన్ గా ఉన్న ఓ బ్యూటీ.. ఇలానే తన కలర్ ఫుల్ లైఫ్ ను త్యంగం చేసింది. సన్యాసి జీవితం గడుపుతోంది.
బాలీవుడ్ లో రాంగోపాల్ వర్మ అంటే ఓ ప్రత్యేక మైన శైలి ఉంటుంది. ఆయన సినిమాలు అంటే ఎలా ఉంటాయో అందరికి తెలుసు. హార్రర్ సినిమాలు, హాట్ హాట్ మూవీస్ తీయ్యడలో తనకు తానే సాటి అనిపించుకన్నాడు వర్మ. అలాంటిది వర్మ సినిమాల్లో.. హీరోయిన్లు ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన హీరోయిన్లలో ఆడియన్స్ ను భయపెటట్టిన తార బర్జా మదన్. ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన భూత్ మూవీలో దెయ్యం పట్టిన అమ్మాయిగా నటించి ఆడియన్స్ ను భయపెట్టింది బ్యూటీ.
దెయ్యంగా భూత్ మూవీలో బర్ఖా మదన్ నటన చూసి థియేటర్లో ప్రేక్షకులు గజ గజ వణికిపోయారంటే ... ఆమె ఏ రేంజ్ లో నటించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ సినిమా చూసిన వారికి పగలు కూడా కల్లోకి వచ్చి భయపెట్టేలా ఉంటుంది బర్జా మదన్ నటన. భయపటెట్టడమే కాదు... ఆతరువాతి సినిమాల్లో తన అందంతో మత్ర ముగ్ధులను చేసింది బ్యూటీ.
బర్ఖా పంజాబీ కుటుంబలో జన్మించింది.. సినిమాల్లోకి రాకముందు మోడల్ గా సత్తా చాటింది. ఐశ్వర్య రాయ్. సుస్మితా సేన్ లాంటి వారితో పోటీ పడి మరీ అందాల పోటీల్లో పాల్గొంది. 1994 లో మిస్ ఇండియాగో పోటీ చేసింది. కాని అప్పుడు కిరీటం సుస్మితా సేన్ ను వరించగా.. రన్నరప్ గా ఐశ్వర్య రాయ్ నిలిచింది. ఇక బర్ఖా మదన్ మిస్ టూరిజం ఇండియాగా నిలిచింది.
మోడల్ గా రాణించి బర్జా మదన్.. ఆతరువాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టి వరుస సినిమాలు చేసింది. అక్షయ్ కుమార్, రవీనా టాండన్ నటించిన ఖిలాడియోన్ కా ఖిలాడిలో నటించింది బర్ఖా మదన్. ఆ తర్వాత వరుస ఆఫర్లు సాధించింది. ఇండో-డచ్ చిత్రం డ్రైవింగ్ మిస్ పామెన్‌తో విదేశీ చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది బ్యూటీ. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే... అటు తన మాతృ భాష పంజాపీలో కూడా సినిమాలు చేసింది బ్యూటీ.
నటిగానే కాకుండా నిర్మాత కూడా తన సత్తా చాటింది. గోల్డెన్ గేట్ LLC పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. సోచ్, సుర్ఖాబ్ అనే రెండు సినిమాలు నిర్మించింది బ్యూటీ. అంతే కాదు బుల్లి తెరపై దాదాపు 20 టీవీ షోలు చేసి రికార్డ్ సాధించింది బ్యూటీ. అందుకే ఆమెకు వెండితెరపై కంటే కూడా బుల్లి బుల్లితెరపైనే ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
సినిమా ఇండస్ట్రీలో ఇంతలా వెలుగు వెలిగిన బర్ఖా మదన్... ఆతరువాత షాకింగ్ నిర్ణయం తీసుకుంది. హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆతరువాత సన్యసం తీసుకుంది. బౌద్ద మతం వైపు ఆకర్శితురాలై.. బౌధ్ధ మతం స్వీకరించింది. బర్ఖా మదన్ కి మొదటి నుంచి బౌద్దం అన్నా.. దలైలామా అంటే ఎంతో ఇష్టం.. సినిమాల్లో నటిస్తూనే.. బౌద్ధమతాన్ని ఫాలోఅయ్యింది. దలైలామా అడుగుజాడల్లో నడవాలని చాలా కాలం ఆలోచించిన ఆమె.. 2012 లో బుద్దీజం స్వీకరించింది.
ఈ క్రమంలోనే బర్జా మదన్ లామా జోపా రిన్ పోచే పర్యవేక్షణలో సన్యాసం స్వీకరించింది. ప్రస్తుతం ఆమెను గ్యాల్టెన్ సామ్టెన్ గా పిలుస్తారు. బుద్దీజం స్వీకరించిన తర్వాత తన మనసు ప్రశాంతంగా ఉందని.. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన, సరైన నిర్ణయంగా భావిస్తున్నానని ఎన్నో సార్లు చెప్పుకోచ్చింది ఆమె. ప్రస్తుతం తన సోషల్ మీడియాలో కూడా బౌద్దానికి సబంధించి పోస్ట్ లతో సందడి చేస్తోంది.