- Home
- Entertainment
- Bandla Ganesh Out From Mega Compound: మెగా కాంపౌండ్ నుంచి బండ్ల గణేష్ అవుట్... కొంప ముంచిన ఫోన్ కాల్...
Bandla Ganesh Out From Mega Compound: మెగా కాంపౌండ్ నుంచి బండ్ల గణేష్ అవుట్... కొంప ముంచిన ఫోన్ కాల్...
మెగా ఫ్యామిలీకి ముఖ్యంగా పవర్ స్టార పవన్ కళ్యాణ్ కు వీర విధేయుడు.. పరమ భక్తుడు బడ్ల గణేష్. ఆయన ఇక నుంచి మెగా కౌంపౌండ్ నుంచి ఔట్ అయినట్టు తెలుస్తోంది.

బడ్ల గణేష్.. ఇండస్ట్రీలో తెలివితో ఎదిగిన ఆర్టిస్ట్. పవర్ స్టార్ అభిమానిగా ఇండస్ట్రీలోకి వచ్చి.. ఎప్పుడో అమ్మా నాన్న తమిళమ్మాయి సినిమాలో ఓ చిన్న జూనియర్ ఆర్టిస్ గ్ గా కనిపించన స్థాయి నుంచి .. స్టార్ ప్రొడ్యూసర్ గా.. ఎదిగి తన అభిమాన స్టార్ హీరో పవన్ గబ్బర్ సింగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు బగ్ల గణేష్. అటువంటిది ఇప్పుడు పవర్ స్టార్ కు ఆయన దూరం అయిపోతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా వైర్ అయిన ఓ ఫోన్ కాల్ ఆడియో ఆయన కొంప ముంచినట్టు సమాచారం.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వీరాభిమానుల్లో బండ్ల గణేష్ ఒకరు. పవన్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక అంటే బండ్ల గణేష్ స్పీచ్ సమ్‌థింగ్ స్పెషల్ అన్నట్టు ఉంటుంది. గబ్బర్ సింగ్ నుంచి వకీల్ సాబ్ వరకూ ఆయన తన స్పీచ్‌లతో చెలరేగిపోయారు. అభిమానులకు పూనకాలు తెప్పించేలా మాట్లాడారు. ఈశ్వరా... పవనేశ్వరా అంటూ బండ్ల గణేష్ అప్పట్లో స్పీచ్ గట్టిగా వైరల్ అయ్యింది. ఇక భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బండ్ల గణేష్ ఏం మాట్లాడతారా అని అందరూ ఎదురు చూశారు. కాని బడ్ల ప్రీరిలీజ్ లో కనిపించలేదు.
బంట్ల గణేష్ త్రివిక్రమ్ గురించి మాట్లాడినట్టు రిలీజ్ అయిన ఓ ఆడియో వ బండ్లను మెగా కాంపౌండ్ కు దూరం చేసినట్టు తెలుస్తోంది. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకకు త్రివిక్రమ్ నన్ను రాకుండా చేస్తున్నాడు. నేను వస్తే త్రివిక్రమ్ డామినేట్ అయిపోతాడని ఆయనకు భయం. త్రివిక్రమ్ వైసీపీ వాళ్ళతో కలిసి ఏదో ప్లాన్ చేశాడట. అందుకే భీమ్లా నాయక్ వేడుకకు నేను రావడం త్రివిక్రమ్ కి ఇష్టం లేదని బండ్ల గణేష్ ఓ వ్యక్తితో ఫోన్ లో మాట్లాడాడు. ఈ క్రమంలో త్రివిక్రమ్ ని ఆడు.. వీడు అంటూ కొంచెం వివాదాస్పద పదాలు వాడారు. ఆ వాయిస్ బండ్ల గణేష్ వాయిస్ కి చాలా దగ్గరగా ఉంది. దీంతో ఇది నిజంగా బండ్ల గణేష్ సంభాషణే అని నెటిజెన్స్ ఫిక్స్ అయ్యారు.
కాగా లీకైన ఈ ఆడియో టేప్ వివాదంపై నటుడు, నిర్మాత బండ్ల స్వయంగా స్పందించారు. వైరల్ అవుతున్న ఆ ఆడియో టేపులో ఉన్న వాయిస్ తనది కాదన్నారు. ఎవరో ఇరికించడానికి కుట్రపూరితంగా క్రియేట్ చేశారని వెల్లడించారు. అయితే ఇదే స్టేట్మెంట్ అధికారికంగా ఇవ్వడానికి బండ్ల గణేష్ నిరాకరించారు. దీంతో ఆ కాల్ మాట్లాడింది బండ్ల గణేశేనా లేక వేరెవరైనా? అనే విషయంలో క్లారిటీ రాలేదు.
అయితే ప్రిరిలీజ్ డేట్ ఫిక్స్ అయినప్పట నుంచీ.. ఈసారి బడ్ల గణేష్ ఉంటాడా లేదా అంటూ ఫ్యాన్స్ ను చి సోషల్ మీడియాలో కామెంట్లు వినిపించాయి. అనుకున్నట్లుగానే ఈ ఈవెంట్ లో బండ్లగణేష్ జడ కనిపించలేదు. త్రివిక్రమ్ ఇష్యూ వల్లే బండ్ల గణేష్ కు మెగా కాంపౌండ్ ఉద్యావసన పలికినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే పవర్ స్టార్ తో ఒక సినిమా కన్ ఫార్మ్ చేసుకున్నాడు బండ్ల.. పవర్ స్టార్ కు నిర్మాతగా గబ్బర్ సింగ్ లాంటి మెమెరబుల్ హిట్ అందించాడు బండ్ల గణేష్. ఈ సారి అంతకు మించి సినిమా చేయాలని అన్ని ప్లాన్లు చేసుకున్నాడు. కాని ఈలోపు ఈ ఆడియో కలకలంతో.. వీరి కాంబో మూవ ఉంటుందో లేదో అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
Bheemla nayak
Bheemla nayak
Image: Official film poster
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా హీరోలుగా సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కిన భీమ్లానాయక్ మూవీలో హీరోయిన్లుగా నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ నటించారు. సముద్రఖని,మురళీ శర్మ లాంటి సీనియర్లు నటించిన భీమ్లా నాయక్ మూవీకి స్క్రీన్ ప్లే.. డైలాగ్స్ ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు.
Bheemla nayak
మొదటి నుంచి పవర్ స్టార్ ప్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న భీమ్లా నాయక్ సినిమాను ఫిబ్రవరి 25న.. ప్రపంచ వ్యాప్తంగా.. దాదాపు 3 వేల థియేటర్లు.. 10 వేలకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణాలో ఈమూవీ 5 షోలకు అనుమతి లభించింది. రెండు వారాల పాటు రోజుకు 5 షోలు వేసుకోవడానికి అనుమతి లభించింది.
భీమ్లా నాయక్ నుంచి వచ్చిన అప్ డేట్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పోస్టర్స్.. ఫస్ట్ గ్లింప్స్, టీజర్స్, ట్రైలర్ వరకూ అన్నింటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్ ఈ వీడియోస్ ను కోట్ల వ్యూస్ తో సూపర్ హిట్ చేశారు. సినిమాను సెన్సేషన్ చేయడానికి ఎదురు చూస్తున్నారు. ప్రపంచ వ్యాస్తంగా పవర్ స్టార్ అభిమానులతో పాటు రానా దగ్గుబాటి అభిమానులు కూడా భీమ్లా నాయక్ కోసం ఎదురు చూస్తన్నారు.