MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Band Melam Movie Review: బ్యాండ్‌ మేళం మూవీ రివ్యూ, రేటింగ్‌.. `కోర్ట్` జంట నటించిన సినిమా ఎలా ఉందంటే ?

Band Melam Movie Review: బ్యాండ్‌ మేళం మూవీ రివ్యూ, రేటింగ్‌.. `కోర్ట్` జంట నటించిన సినిమా ఎలా ఉందంటే ?

కోర్ట్ మూవీ జంట హర్ష్‌ రోషన్‌, శ్రీదేవి కలిసి నటించిన మూవీ `బ్యాండ్‌ మేళం`. కోన వెంకట్‌ రూపొందించిన ఈ చిత్రం గురువారం విడుదలైంది. మరి మరోసారి `కోర్ట్` మ్యాజిక్‌ని రిపీట్‌ చేసిందా? సినిమా ఎలా ఉందంటే? 

4 Min read
Author : Aithagoni Raju
Published : Mar 26 2026, 08:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
బ్యాండ్‌ మేళం మూవీ రివ్యూ
Image Credit : X/@HarshRoshan7

బ్యాండ్‌ మేళం మూవీ రివ్యూ

`కోర్ట్` సినిమాతో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యారు హర్ష్‌ రోషన్‌, శ్రీదేవి జంట. వీరికి ఇండస్ట్రీలో మంచి క్రేజ్‌ ఏర్పడింది. `కోర్ట్` మూవీ హిట్‌ కావడంతో ఆ క్రేజ్‌ని క్యాష్‌ చేసుకోవడానికి చాలా మంది మేకర్స్ పోటీపడ్డారు. ఈ జంటతో సినిమాలు చేయాలని ప్లాన్‌ చేశారు. ఇందులో ముందు ఉన్నారు రైటర్‌, డైరెక్టర్‌, నిర్మాత కోన వెంకట్‌. ఒకప్పుడు ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రాలతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఇటీవల గ్యాప్‌ వచ్చింది. మళ్లీ ఇప్పుడు `కోర్ట్` జంట హర్ష్‌ రోషన్‌, శ్రీదేవితో `బ్యాండ్‌ మేళం` అనే చిత్రాన్ని తెరకెక్కించారు. దీనికి సతీష్‌ జవ్వాజీ దర్శకత్వం వహించారు. కోనా ఫిల్మ్ కార్పోరేషన్‌ బ్యానర్‌పై కోన వెంకట్‌ నిర్మించారు. కావ్య, శ్రావ్య నిర్మాతలు. ఈ సినిమా శ్రీరామ నవమి పండుగని పురస్కరించుకుని నేడు గురువారం(మార్చి 26)న విడుదలైంది. మరి `కోర్ట్` మ్యాజిక్‌ మరోసారి వర్కౌట్‌ అయ్యిందా? సినిమా ఎలా ఉందనేది చూస్తే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
బ్యాండ్‌ మేళం మూవీ కథ
Image Credit : X/@HarshRoshan7

బ్యాండ్‌ మేళం మూవీ కథ

తెలంగాణలోని బ్రహ్మాణపల్లి అనే విలేజ్‌లో యాదగిరి(హర్ష్‌ రోషన్‌), రాజీ(శ్రీదేవి) బావామరదలు. చిన్నప్పట్నుంచి కలిసి ఆడుకుంటారు. కలిసే పెరుగుతారు. అంతేకాదు పెద్దయ్యాక వీరికి పెళ్లి చేయాలని  పేరెంట్స్(గోపరాజు విజయ్‌, సాయికుమార్‌) అనుకుంటారు. కానీ యాదగిరికి చదువు అబ్బదు. మ్యూజిక్‌ అంటే ఇష్టం. రాజీ 10వ తరగతిలో జిల్లాలోనే ఫస్ట్ వస్తుంది. తాను చెప్పినా పాస్‌ కాకపోవడంతో గిరిపై రాజీ కోప్పడుతుంది. తాను ఫెయిల్‌ అవుతానని సవాల్‌ చేసినందుకు గిరి రాజీపై ఫైర్‌ అవుతారు. ఆ దెబ్బతో ఇద్దరి మధ్య గ్యాప్‌ వస్తుంది. పై చదువులకు రాజీ పట్నం వెళ్తుంది. గిరి ఊర్లో మ్యాజిక్‌, బ్యాండ్‌ అంటూ అల్లరి చిల్లరగా తిరుగుతాడు. ఓ సారి సాంగ్‌ చేసే ఆఫర్‌ వస్తుంది. అందుకోసం దొంగతనాలు చేసి మ్యూజిక్‌ బ్యాండ్‌ స్టూడియో పెట్టగా, అది మొదటి రోజే కాలిపోతుంది. దీంతో మళ్లీ రోడ్డున పడ్డ పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతలో తన మరదలు రాజీకి వాళ్ల నాన్న సాయన్న(సాయికుమార్‌) పెళ్లి ఫిక్స్ చేస్తాడు. కానీ పెళ్లి రోజే తాను ప్రేమించిన వాడితో లేచిపోతుంది. దీంతో గిరి పరిస్థితి ఏంటి? రాజీ ఎవరితో లేచిపోయింది? రాజీ లేచిపోవడం వెనుక ఉన్న డ్రామా ఏంటి? తన మరదలి కోసం గిరి ఏం చేశాడు? గిరి మ్యూజిక్‌ లో సక్సెస్‌ అయ్యాడా? ఈ కథ ఎలాంటి ముగింపు తీసుకుందనేది మిగిలిన సినిమా.

Related Articles

Related image1
900 Crore Club Movies: అత్యంత వేగంగా చేరిన 6 సినిమాలు.. పుష్ప 2ని టచ్‌ చేయలేకపోయిన ధురంధర్ 2
Related image2
Prabhas: దేవుడా మళ్లీ పోయిందా, ప్రభాస్‌ ఎమోషనల్‌.. కట్‌ చేస్తే చిరు, బాలయ్యకి చుక్కలు చూపించిన సినిమా
37
బ్యాండ్‌ మేళం మూవీ విశ్లేషణ
Image Credit : X/@HarshRoshan7

బ్యాండ్‌ మేళం మూవీ విశ్లేషణ

రైటర్‌ కోన వెంకట్‌ ఒకప్పుడు కామెడీ ఫ్యామిలీ డ్రామాలతో మెప్పించారు. అప్పట్లో ఈ సినిమాలు బాగా ఆడాయి. శ్రీనువైట్ల చిత్రాలకు రైటర్‌గా పనిచేసి, దర్శకుడి రేంజ్‌లో పాపులర్‌ అయ్యాడు. కానీ ఆ తర్వాత వాళ్ల ఫార్మూలా వర్కౌట్‌ కాలేదు. ఆ కథలు ఔట్‌డేటెడ్‌ అయ్యాయి. దీంతో గ్యాప్‌ తీసుకున్నారు. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ తన కథతో `బ్యాండ్‌ మేళం` మూవీ తీశారు. అయితే ఈ సినిమా చూశాక కోన వెంకట్‌ ఇంకా అప్‌ డేట్‌ కాలేదని అర్థమవుతుంది. అదే పాత స్టయిల్‌ కామెడీతో ఈ మూవీని రూపొందించారు. అయితే ఒకప్పుడు ఆంధ్రా నేపథ్యంలో ఉంటే, ఇప్పుడు తెలంగాణ నేపథ్యాన్ని యాడ్‌ చేశారు. తెలంగాణ నేపథ్యంలో వచ్చే చిత్రాలు ఆదరణ పొందుతున్న నేపథ్యంలో బ్యాక్‌ డ్రాప్‌ మార్చారు. అయితే అది కూడా బలవంతంగానే అనిపిస్తుంది. ఆ యాస పలికేవిధానం కొంత ఫోర్స్ గానే ఉంటుంది. జబర్దస్త్ మార్క్‌ కామెడీ సీన్లని రాసుకుని దీనికి లవ్‌ ట్రాక్‌ని, అందులో డ్రామాని యాడ్‌ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమాగా చూసినప్పుడు మొదట యాదగిరి, రాజీ ఫ్యామిలీ నేపథ్యాలను చూపించారు. యాదగిరి ఫ్యామిలీ తాతలు పెద్ద జమీందార్లు, దానాలు, ధర్మాలు చేసి ఆస్తులన్నీ పోగొట్టుకుంటారు. రాజీ నాన్న కమర్షియల్‌.. యాదగిరి నాన్న సాయంతో వ్యాపారంలో రాణించి బాగా ఎదుగుతాడు. ఆ తర్వాత గిరి ఫ్యామిలీని దూరం పెడతాడు. పెద్దాయ్యక టెన్త్ లో ఫెయిల్‌ అయ్యాడని గిరిని, రాజీ దూరం పెడుతుంది. ఇప్పటి వరకు ఫ్యామిలీ డ్రామాగా, గిరి, రాజీల స్నేహం, ప్రేమని ప్రతిబింబించారు. ఆ తర్వాత మూవీ కామెడీ డ్రామా వైపు టర్న్ తీసుకుంటుంది. ఈ బ్యాండ్‌ మేళం చేసే చిల్లర పనులతో ఊరందరితో తిట్లు తింటుంటారు. ఇది కొంత కామెడీగా ఉంటుంది. గిరి ఫ్రెండ్‌ లేచిపోయిన మరదలిని పెళ్లి చేసుకోవడం, ఆమె లేచిపోవడానికి తనే సపోర్ట్ చేయడం ఫన్నీగా ఉంది. పెళ్లి ట్రాక్‌ కూడా నవ్విస్తుంది. ఆ తర్వాత తన బ్యాండ్‌ సౌండ్‌ విని ఒక వృద్ధుడు చనిపోవడం, స్టూడియో కోసం దొంగతనాలు చేయడం కామెడీగా ఉంటుంది. అదే సమయంలో అది కొంత ఓవర్‌ గా అనిపిస్తుంది. ఇంటర్వెల్‌ రెగ్యూలర్‌గానే అనిపిస్తుంది. సెకండాఫ్‌లో అసలు కథ ఉంటుంది. తన మరదలు తనకి హ్యాండివ్వడం, వేరే వాడితో లేచిపోవడం, తర్వాత చోటు చేసుకున్న డ్రామా.. గిరి, రాజీ, వారి ఫ్యామిలీ మధ్య డ్రామా ఫర్వాలేదనిపించినా, ఊహించేలా ఉంటుంది. రాజీ ఇచ్చిన ట్విస్ట్ కూడా ఊహించేలా ఉంటుంది. అందులో కోన మార్క్ ఓల్డ్ డ్రామా కనిపిస్తుంది.

47
బ్యాండ్‌ మేళం మూవీ ప్లస్‌, మైనస్‌లు
Image Credit : X/@HarshRoshan7

బ్యాండ్‌ మేళం మూవీ ప్లస్‌, మైనస్‌లు

సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య సీన్లు కొన్ని బాగున్నాయి. కొంత నవ్వులు పూయిస్తాయి. అదే సమయంలో ఎమోషనల్‌గానూ ఉంటాయి. క్లైమాక్స్ లో వీరి లవ్‌ ఎమోషన్స్ కట్టిపడేస్తాయి.  కొన్ని సీన్లు బాగానే వర్కౌట్‌ అయ్యాయి. ఫ్యామిలీ సీన్లు ఫర్వాలేదనిపించాయి. కానీ కామెడీ డ్రామా ఓవర్‌గా అనిపిస్తుంది. చాలా వరకు అసహజంగా అనిపిస్తుంది. బలవంతపు కామెడీ ట్రాక్‌లు రోత పుట్టిస్తాయి. సెకండాఫ్‌లో డ్రామా కూడా ఓవర్‌గా ఉంటుంది. చాలా వరకు రొటీన్‌గా, ఊహించినట్టుగానే ఉంటూ తేలిపోయింది.  క్లైమాక్స్ కూడా సేమ్‌. ట్రెండింగ్‌లో ఉన్న పాట చివర్లో రావడం, అది అలా ఇచ్చి ఇలా పోవడం నిరాశ పరుస్తుంది. ప్రారంభం నుంచి ఊరించినట్టుగా ఉంటుంది. పైగా సినిమాలో ఒరిజినల్‌ సాంగ్స్ కంటే రీమిక్స్ సాంగ్సే బాగున్నాయి. చాలా వరకు వాటితోనే లాక్కొచ్చారు. దీంతో ఒరిజినాలిటీ మిస్‌ అయ్యింది. హీరోహీరోయిన్ల మధ్య లవ్‌ ట్రాక్‌లో ఫీల్‌ మిస్‌ అయ్యింది. ఎమోషన్స్ మిస్‌ అయ్యాయి. సౌండింగ్‌ కూడా కొంత ఇబ్బందిగా ఉంది. లౌడ్‌గా ఉంది. ఆర్టిస్ట్ ల యాక్టింగ్‌  కొన్ని చోట్ల ఓవర్‌గా అనిపిస్తుంది.

57
బ్యాండ్‌ మేళం మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?
Image Credit : X/@HarshRoshan7

బ్యాండ్‌ మేళం మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?

యాదగిరిగా హర్ష్‌ రోషన్‌ చాలా బాగా చేశాడు. పాత్రలో జీవించాడు. తనకు ఆ పాత్రకి యాప్ట్ గా నిలిచింది. అదే స్టయిల్‌లో రెచ్చిపోయి చేశాడు. తాను సీరియస్‌గా ఉంటూ చేసే కామెడీ నవ్విస్తుంది. తన ఫ్రెండ్స్ చేసే అల్లరి చిల్లర పనులు నవ్విస్తాయి. వాళ్లు చాలా సహజంగా చేశారు. కొన్ని చోట్ల ఓవర్‌గా అనిపించినా, కొత్త కుర్రాళ్లు అయినా అదరగొట్టారని చెప్పొచ్చు. రాజీగా శ్రీదేవి బాగానే చేసింది. కాకపోతే ఎక్స్ ప్రెషన్స్ పరంగా ఇంకా బాగా వర్కౌట్‌ చేయాలి. ఎమోషనల్‌ సీన్లలో తేలిపోయింది. సాయన్నగా సాయికుమార్‌ అదరగొట్టారు. కొంత కన్నింగ్‌ క్యారెక్టర్‌తో మెప్పించారు. తనలోని మార్పు కూడా ఆకట్టుకుంటుంది. హీరో తండ్రి పాత్రలో గోపరాజు విజయ్‌ బాగా చేశాడు. హీరో తల్లి, హీరోయిన్ తల్లి పాత్రలు చేసిన నటీమణులు కూడా మెప్పించారు. హీరో ఫ్రెండ్స్ గ్రూప్‌లో అమ్మాయి పాత్ర స్పెషల్‌గా నిలుస్తుంది. ఇన్నోసెంట్‌ సింగర్‌గా చాలా బాగా చేసింది. మిగిలిన పాత్రదారులు ఓకే అనిపించారు.

67
బ్యాండ్‌ మేళం మూవీలో టెక్నీషియన్ల పనితీరు
Image Credit : X/@HarshRoshan7

బ్యాండ్‌ మేళం మూవీలో టెక్నీషియన్ల పనితీరు

విజయ్‌ బుల్గానియన్‌ సంగీతం ఫర్వాలేదు. వైరల్‌ సాంగ్‌ అదిరిపోయింది. మిగిలిన పాటలు జస్ట్ ఓకే, పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే రీమిక్స్ సాంగ్స్ సినిమాలో హైలైట్‌గా నిలిచాయి. సతీష్‌ ముత్యాల కెమెరా అదిరిపోయింది. విజువల్స్ చాలా బాగున్నాయి. సినిమా చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది. లైటింగ్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. శివ ముప్పరాజు ఎడిటింగ్‌ ఓకే అనిపించింది. నిర్మాణ విలువలకు కొదవలేదు. రాజీపడకుండా నిర్మించారు. కథ ఓల్డ్ ఫార్మాట్‌లో ఉంది. దర్శకుడు సతీష్‌ జవ్వాజి తెరకెక్కించిన తీరు బాగానే ఉంది. కామెడీ ట్రాక్‌లో బాగానే రాసుకున్నారు, కానీ ఓవర్‌ గా అనిపిస్తుంది. రైటింగ్‌ సైడ్‌ ఇంకా బాగా వర్క్‌ చేయాల్సింది.

77
ఫైనల్‌ నోట్‌, రేటింగ్‌
Image Credit : X/@HarshRoshan7

ఫైనల్‌ నోట్‌, రేటింగ్‌

 నవ్వులు తక్కువ, గోల ఎక్కువ. కోన వెంకట్‌ మార్క్ ఓల్డ్ ఫార్మూలా లవ్‌ కామెడీ ఫ్యామిలీ డ్రామా. 

రేటింగ్‌ 2.25

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image3
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Related Stories
Recommended image1
900 Crore Club Movies: అత్యంత వేగంగా చేరిన 6 సినిమాలు.. పుష్ప 2ని టచ్‌ చేయలేకపోయిన ధురంధర్ 2
Recommended image2
Prabhas: దేవుడా మళ్లీ పోయిందా, ప్రభాస్‌ ఎమోషనల్‌.. కట్‌ చేస్తే చిరు, బాలయ్యకి చుక్కలు చూపించిన సినిమా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved