- Home
- Entertainment
- బాలయ్యనా మజాకా.. తొలి యాడ్ కోసం కోట్లల్లో పారితోషికం.. కానీ అంతలోనే పెద్ద ట్విస్ట్ ?
బాలయ్యనా మజాకా.. తొలి యాడ్ కోసం కోట్లల్లో పారితోషికం.. కానీ అంతలోనే పెద్ద ట్విస్ట్ ?
బాలకృష్ణ పారితోషికం విషయంలో ఎప్పుడూ వార్తల్లో నిలిచింది లేదు. కానీ ఇప్పుడు రెమ్యూనరేషన్ విషయంలో హాట్ టాపిక్ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన చేసిన తొలి యాడ్‌కి బాలయ్య తీసుకున్న పారితోషికం వార్తల్లో నిలుస్తుంది.

బాలయ్య నటుడిగా వెండితెరపై విశ్వరూపం చూపిస్తారు. అయితే ఇప్పుడు బుల్లితెరపై కూడా రచ్చ చేస్తున్నారు. డిజిటల్ రంగంలో విస్తరించడంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లు విస్తరిస్తున్నాయి. దీంతో బాలయ్య కూడా తనని తాను ఓపెన్ అవుతున్నారు. ఇటీవల ఆయన `అన్‌స్టాపబుల్` టాక్ షోతో విశ్వరూపం చూపించారు. `ఆహా`ఓటీటీలో ప్రసారమయ్యే ఈ షోలో హోస్ట్ గా అదరగొడుతున్నారు. ఇది ఇండియన్ టీవీ షోస్‌ల రికార్డ్ లను బ్రేక్ చేస్తుండటం విశేషం.
ఇప్పుడు ఫస్ట్ టైమ్ ఆయన యాడ్ కూడా చేస్తున్నారు. కెరీర్‌లో మొదటిసారి బాలకృష్ణ యాడ్ చేశారు. రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్ కంపెనీ సాయిప్రియా గ్రూప్ ఆఫ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా చేశారు బాలకృష్ణ. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ `116 పారమౌంట్` ప్రాజెక్ట్ కి ఆయన యాడ్ చేశారు. సినిమా స్థాయిలో దీన్ని ప్రమోట్ చేశారు. ప్రస్తుతం ఈ యాడ్ ఆకట్టుకుంటూ ట్రెండింగ్‌లో ఉంది.
ఇదిలా ఉంటే ఈ యాడ్ కోసం బాలకృష్ణ భారీగానే తీసుకున్నారని సమాచారం. ఊహించిన పారితోషికం అందుకున్నారని తెలుస్తుంది. ఏకంగా ఈ ఒక్క యాడ్ కోసం బాలయ్య ఏకంగా రూ.15కోట్లు పారితోషికంగా అందుకున్నారనే సమాచారం వినిపిస్తుంది. అంతేకాదు ఇందులో పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ యాడ్ మనీ ఒక్క రూపాయి కూడా ఆయన తన సొంతానికి తీసుకోలేదట.
ఈ యాడ్ చేసినందుకు బాలకృష్ణకి రూ.13కోట్లు సాయిప్రియా గ్రూప్ సంస్థ పారితోషికంగా ఇచ్చిందట. ఈ మొత్తాన్ని ఆయన తన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా ప్రకటించారు. తొలి యాడ్ మనిని ఆయన సేవకు ఉపయోగించడంతో బాలయ్య నిర్ణయం అందరి హృదయాలను దోచుకుంది. దీంతో ఈ విషయం గమనించిన సంస్థ ఇంకా రెండు కోట్లు కలిపి ఆ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఇచ్చిందట. ఇలా మొత్తంగా రూ.15కోట్లు బాలయ్య తన ఆసుపత్రికి విరాళంగా ఇవ్వడం విశేషం. ఈ విషయాన్ని ప్రముఖ యాంకర్ దేవి నాగవళ్లి సోషల్ మీడియా ద్వారా వెల్లడించగా, ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. దీంతో సర్వత్రా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
ఇక కెరీర్ పరంగా బాలకృష్ణ `వీరసింహారెడ్డి` చిత్రంలో నటిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. మరోవైపు `అన్‌స్టాపబుల్‌విత్ ఎన్బీకే2` షోకి బాలయ్య హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఇది టాక్ షోలోనే దుమ్మురేపుతుంది.