బాలయ్యతో చేసిన ఆ సినిమా నచ్చలేదు, స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్.. ఇంతకీ ఏమిటా చెత్త మూవీ?
ఓ స్టార్ లేడీ హీరో బాలకృష్ణతో చేసిన మూవీ నచ్చలేదని ఓపెన్ గా చెప్పింది. పరోక్షంగా అది ఒక చెత్త మూవీ అని తేల్చేసింది. ఇంతకీ ఏమిటా చిత్రం?
స్టార్ హీరో బాలయ్య సుదీర్ఘమైన సినీ ప్రస్థానం కలిగి ఉన్నారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా అనేక హిట్స్, బ్లాక్ బస్టర్ నమోదు చేశారు. బాలకృష్ణ కెరీర్ సక్సెస్ఫుల్ గా సాగుతుంది. అఖండ మూవీతో ఆయన హిట్ ట్రాక్ ఎక్కారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి హిట్ టాక్ తెచ్చుకోగా.. హ్యాట్రిక్ పూర్తి చేశాడు.
Balakrishna
ప్రస్తుతం ఆయన వాల్తేరు వీరయ్య ఫేమ్ దర్శకుడు బాబీతో డాకు మహారాజ్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. డాకు మహారాజ్ మూవీలోని బాలకృష్ణ లుక్, క్యారెక్టరైజేషన్ ఫ్యాన్స్ ని అలరించాయి. డాకు మహారాజ్ మంచి విజయం సాధిస్తుందని గట్టిగా నమ్ముతున్నారు.
Balakrishna
కాగా బాలకృష్ణ గతంలో చేసిన ఒక మూవీ నచ్చలేదని ఓ స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్ చేసింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు అనుష్క శెట్టి. ఈ కన్నడ భామ బాలకృష్ణతో ఒకే ఒక సినిమా చేసింది. అదే ఒక్క మగాడు. దర్శకుడు వైవిఎస్ చౌదరి ఒక్క మగాడు చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో అనుష్క, సిమ్రాన్, నిషా కొఠారి హీరోయిన్స్ గా నటించారు. బాలకృష్ణ ఫ్రీడమ్ ఫైటర్ రోల్ చేశారు.
Balakrishna
ఒక్క మగాడు మూవీ తనకు నచ్చలేదని అనుష్క అన్నారు. గతంలో అనుష్క జయప్రదం అనే టాక్ షోలో పాల్గొన్నారు. సీనియర్ నటి జయప్రద హోస్ట్ గా జయప్రదం ప్రసారమైంది. గెస్ట్ అనుష్కను జయప్రద కొన్ని ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. మీ కెరీర్లో నచ్చని సినిమా, బాగా నచ్చిన సినిమా ఏది? అని అడగ్గా... అనుష్క తడుముకోకుండా చెప్పింది. తనకు అరుంధతి, వేదం చాలా ఇష్టమైన చిత్రాలు అని చెప్పింది. ఇక ఒక్క మగాడు నచ్చని సినిమా అని తేల్చేసింది.
Anushka Shetty
అరుంధతి అనుష్క కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం. ఆ మూవీ అనుష్కకు ఎక్కడలేని కీర్తి తెచ్చిపెట్టింది. అదే సమయంలో దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన వేదం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో అనుష్క వేశ్య రోల్ చేయడం విశేషం. ఇక ఒక్క మగాడు డిజాస్టర్ మూవీ. భారతీయుడు మూవీ స్ఫూర్తిగా దర్శకుడు తెరకెక్కించిన ఈ మూవీ విమర్శల పాలైంది. అనుష్క కెరీర్ కి ఏ విధంగానూ ప్లస్ కాలేదు.
Vedam Movie
అందుకే అనుష్క ఒక్క మగాడు తన కెరీర్లో చెత్త మూవీ అని పరోక్షంగా వెల్లడించింది. బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో అనుష్క పాన్ ఇండియా ఫేమ్ రాబట్టింది. అయితే ఆమె ఆచితూచి సినిమాలు చేస్తుంది. అనుష్క గత చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ఈ రొమాంటిక్ లవ్ డ్రామా ఆకట్టుకుంది. ప్రస్తుతం దర్శకుడు క్రిష్ తో ఘాటీ మూవీ చేస్తుంది. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ. మరో రెండు చిత్రాలు అనుష్క చేస్తున్నట్లు సమాచారం.