సినిమా రిలీజ్ అయ్యాక సాంగ్ షూటింగ్, ఫలితం చూశాక కూడా అంటే బాలకృష్ణకే సాధ్యం, రాజమౌళి నుంచి ఇది ఊహించలేం
బాలకృష్ణ సినిమాలంటే లార్జన్ దెన్ లైఫ్ లా ఉంటాయి. అయితే ఆయన సినిమాల షూటింగ్‌లు కూడా అలానే ఉంటాయట. రాజమౌళి బండారం బయటపెట్టేశాడు.
photo credit-aha unstoppable 4
బాలకృష్ణ లార్జర్ దెన్ లైఫ్ సినిమాలకు పెట్టింది పేరు. ఆయన సినిమాలు చాలా వరకు రియాలిటీకి దూరంగా ఉంటాయి. అదే సమయంలో థియేటర్‌లో వాహ్ ఫీలింగ్‌ని కలిగిస్తాయి. అదే బాలయ్య సక్సెస్‌కి కారణమని చెప్పొచ్చు. ఆయన సినిమాలు విజయాలు సాధించడం వెనుక కారణం కూడా అదే. డైలాగ్‌లు గానీ, యాక్షన్ సీన్లు గానీ వేరే లెవల్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కేవలం అది నందమూరి నటసింహానికే సాధ్యమని చెప్పొచ్చు.
అంతేకాదు ఒక క్రేజీ పని కూడా బాలయ్యనే చేసి చూపించారు. సినిమా రిలీజ్ అయ్యాక, ఒక పాటని చిత్రీకరించి ఆ తర్వాత యాడ్ చేయడం విశేషం. అయితే ఫలితం నెగటివ్‌గా వచ్చాక కూడా ఆ డేర్ చేశారంటే అది బాలయ్యకి ఒక్కరికే సాధ్యమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వినడానికి ఇది విచిత్రంగా ఉన్నా, ఇదే నిజం. రాజమౌళి సాక్షిగా ఇది జరిగింది. ఎందుకంటే ఆయనే ఈ విషయాన్ని బయటపెట్టారు. మరి ఆ సినిమా ఏంటి? ఆ కథేంటనేది చూస్తే..
బాలకృష్ణ ఫ్యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. ఆయన వరుసగా చాలా సినిమాలు ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో చేసి విజయాలు అందుకున్నారు. ఒకటి రెండు సినిమాల ఫలితాలు తేడా కొట్టినా, మేజర్‌గా ఆయన మూవీస్ బాక్సాఫీసు వద్ద సక్సెస్ అయ్యాయి. కాసుల వర్షం కురిపించాయి. ఏడాదికిపైగా థియేటర్లలో ప్రదర్శించబడ్డాయి.
అందులో భాగంగా వచ్చిన మూవీనే `చెన్నకేశవ రెడ్డి`. వి వి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ రాశారు. బెల్లంకొండ సురేష్ నిర్మించారు. ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్ చేయగా, టబు, శ్రియా హీరోయిన్లుగా చేశారు. 2002లో విడుదలైన ఈ మూవీ డిజప్పాయింట్ చేసింది.
అయితే సినిమాని సెప్టెంబర్ 25న విడుదల చేశారు. దసరాకి 15రోజుల ముందు రిలీజ్ అయ్యింది. అయితే ఈ డేట్‌నే రావాలని చెప్పి, గాబరా గాబరాగా సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేశారు. ఓ సాంగ్ షూటింగ్ కూడా చేయలేదు. ఆ తర్వాత రిలీజ్ అయ్యాక దాన్ని యాడ్ చేద్దాం. ముందైతే సినిమాని రిలీజ్ చేయాలనుకుని విడుదల చేశారు.
సినిమాకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. చాలా వరకు నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. దీంతో అంతా డిజప్పాయింట్‌గా ఉన్నారు. రిలీజ్ అయ్యాక పెట్టాల్సిన సాంగ్‌ని షూట్ చేస్తున్నారు. కానీ అంతా డల్‌గా వర్క్ చేస్తున్నారు. దర్శకుడు, నిర్మాతలు, ఇతర టెక్నీషియన్లు అంతా కాస్త డిజప్పాయింట్‌లో ఉన్నారు.
ఈ విషయం గమనించిన బాలయ్య.. వినాయక్ వద్దకు వెళ్లి ఒక్కటే చెప్పాడు. సినిమా కోసం మనం బెస్ట్ ఇచ్చాం. మీరు ప్రాణం పెట్టి చేశారు. మీ వర్క్ నాకు బాగా నచ్చింది. నేను బాగా ఎంజాయ్ చేశాను. ఫలితం గురించి పట్టించుకోకండి, అది మన చేతుల్లో లేదు, చేయాల్సిన కార్యం పూర్తి చేద్దామని దర్శకుడితోపాటు టీమ్ అందరిలోనూ జోష్ నింపాడట.
అలా ఆ సాంగ్‌ని పూర్తి చేసి ఎట్టకేలకు సినిమాలో తర్వాత యాడ్ చేశారట. అది బాలయ్య పవర్ అని వెల్లడించారు రాజమౌళి. ఆయన గురించి చాలా గొప్పగా చెప్పడం విశేషం. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ `గౌతమీపుత్ర శాతకర్ణ` చిత్రంలో నటించారు. ఈ మూవీ మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా ప్రమోషన్స్ టైమ్‌లో రాజమౌళి, క్రిష్ ముచ్చటించారు. వారి కన్వర్జేషన్‌లో బాలయ్య గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు రాజమౌళి.
read more: బాలయ్య ముందు అన్న సూర్య ఇజ్జత్ తీసిన కార్తి.. జ్యోతిక రహస్యాలు తమ్ముడితో చెబుతాడా?