`అఖండ 2` తర్వాత నేనేంటో చూపిస్తా.. బాలకృష్ణ ఊరమాస్ కామెంట్స్.. నన్ను చూసి నాకే పొగరు
బాలకృష్ణ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందన్నారు. `అఖండ` తర్వాత తానేంటో చూస్తారని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు బాలయ్య.
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా మూవీ `డాకు మహారాజ్`. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశీ రౌతేలా హీరోయిన్లుగా నటించారు. బాబీ డియోల్ విలన్‌గా చేశాడు. సితార ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మించారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది. తాజాగా శుక్రవారం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ని నిర్వహించారు. ఇందులో బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బాలకృష్ణ `అఖండ` నుంచి ఓటమి లేకుండా రాణిస్తున్నారు. `అఖండ` సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన `వీరసింహారెడ్డి` కూడా పెద్ద హిట్ అయ్యింది. దీంతోపాటు `భగవంత్ కేసరి` సినిమాతో మరో హిట్ అందుకున్నారు. ఇలా హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. ఇప్పుడు
ఈ సంక్రాంతికి `డాకు మహారాజ్` చిత్రంతో వస్తున్నారు. ఈ మూవీ కూడా హిట్ పక్కా అని తెలిపారు బాలయ్య. ఇకపై తానేంటో చూస్తారని వెల్లడించారు. ఈ సినిమా `అఖండ 2` తర్వాత అసలు బాలయ్య ఏంటో చూస్తారని తెలిపారు.
read more: సోనూ సూద్ `ఫతే` మూవీ రివ్యూ, రేటింగ్
also read: వారసుడిని రంగంలోకి దింపబోతున్న పవన్ కళ్యాణ్, అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడంటే..?
`అఖండ2` తర్వాత నేనేంటో చూపిస్తారు. బాలయ్య అంటే ఏంటో చూస్తారు. ఆ తర్వాత తాను చేయబోయే సినిమాలు, తన ప్రస్తానం ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఇక నా రెండో ఇన్సింగ్స్ చూస్తారు. జనరల్‌గా రెండో ఇన్సింగ్స్ అంటే కెరీర్ డౌన్‌లో ఉంటే, స్టార్ డమ తగ్గిప్పుడో రెండో ఇన్నింగ్స్ అంటారు. నాకు అది కాదు, చూపిస్తు మున్ముందే నేనేంటో.
`అఖండ 2` తర్వాత నా ప్రస్థానం ఏంటో చూస్తారు. నేను అన్నాను ఇంతకు ముందు ఏం చూసి ఇతకి ఇంత అహాంకారం అనుకుంటారని, కానీ నన్ను చూసి నాకే పదునైన పొగరు అని. ఈ విషయంలో నాన్నగారే నాకు ఇన్‌స్పిరేషన్. అలాగే ప్రేక్షక దేవుళ్లు, వాళ్లిస్తున్న ప్రోత్సాహం. మంచి సినిమాలు ఇవ్వాలని ప్రోత్సహిస్తున్న అభిమానులకు రుణపడి ఉంటాను.
నేను సినిమా నటుడుగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా చేస్తున్న సేవలుగా, హిందూపూర్ ఎమ్మెల్యేగా చేస్తున్న సేవలను స్ఫూర్తిగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేస్తున్న నా అభిమానులకు ధన్యవాదాలు. మీరంతా నా అభిమానులైనందుకు గర్వంగా ఉందన్నారు బాలయ్య.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై స్పందిస్తూ, తిరుమల తొక్కిసలాట ఘటన నన్ను ఎంతో కలిచివేసింది. ఆ ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. బాధాకర ఘటన చోటు చేసుకోవడంతో అనంతపురంలో తలపెట్టిన వేడుకను రద్దు చేయడం జరిగింది. నా అభిమానులు క్రమశిక్షణ కలిగిన సైనికులు. అందుకే వారు మా నిర్ణయాన్ని స్వాగతించారు` అని తెలిపారు బాలయ్య.
`డాకు మహారాజ్` గురించి చెబుతూ, నాన్నగారిలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ వచ్చాను. ప్రపంచంలో ఎవరూ చేయని పాత్రలను చేశాను. జానపదాలు, పౌరాణికాలు, సంఘీకాలు, సైన్స్ ఫిక్షన్ `ఆదిత్య 369`, `భైరవ ద్వీపం` లాంటి విభిన్నమైనపాత్రలు పోషించాను. వీటితోపాటు `అఖండ`, `వీరసింహారెడ్డి`, `భగవంత్ కేసరి` సినిమాలో నేను పోషించిన పాత్రలు ప్రేక్షకులను అలరించాయి.
ఇప్పుడు `డాకు మహారాజ్` కూడా అలరిస్తుంది. ఆడియెన్స్ ఏం కోరుకుంటారో, అలాంటి సినిమాలే చేయాలని కోరుకుంటాను.`ఆదిత్య 369` లో నేను పోషించిన కృష్ణదేవరాయ పాత్ర ప్రేక్షకులను ఎలా మెప్పించిందో.. అలాంటి పాత్ర పెట్టాలని అనుకున్నాం. నా సినిమాలో ఒక్కో సమస్యను చూపిస్తాను. ఏదో ఒక సందేశం ఇవ్వాలనుకుంటాను. ఇక ఇందులో తెలుగువాళ్ల గొప్పతనం ఏంటి అనేది చెప్పడం జరిగింది` అని తెలిపారు బాలయ్య.
read more: ప్రభాస్ `ఫౌజీ` స్టోరీలో కొత్త ట్విస్ట్ .. వర్కౌట్ అయితే రెండువేల కోట్లు రాసిపెట్టుకోండి
also read: ఫస్ట్ 100కోట్ల సినిమాలు.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మలయాళంలో ఇవే తోపు