ప్రభాస్ `ఫౌజీ` స్టోరీలో కొత్త ట్విస్ట్ .. వర్కౌట్ అయితే రెండువేల కోట్లు రాసిపెట్టుకోండి
ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. `ది రాజా సాబ్` చిత్రీకరణ చివర్లో ఉంది. మరోటి `ఫౌజీ`. ఈ మూవీ బ్యాక్ డ్రాప్‌కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అయ్యింది.
ప్రభాస్ ఏక కాలంలో నాలుగైదు సినిమాలను లైన్‌లో పెట్టారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న `ది రాజా సాబ్` చిత్రంలో నటిస్తున్నారు. ఇది రొమాంటిక్ హర్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుంది. మారుతి మార్క్ కమర్షియల్ ఎలిమెంట్లు, కామెడీ ఉండబోతుందట.
రెగ్యూలర్ పాటలు కూడా ఉండబోతున్నాయి. ప్రభాస్ మార్క్ యాక్షన్ జోడిస్తున్నారు. అడిషనల్గా హర్రర్ ఎలిమెంట్లు ఉండబోతున్నాయి. ఈ మూవీ చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఏప్రిల్ 10 విడుదల చేయబోతున్నారు. కానీ వాయిదా పడే ఛాన్స్ ఉందని సమాచారం.
దీంతోపాటు ప్రభాస్.. హనురాఘవపూడి దర్శకత్వంలో `ఫౌజీ`( వినిపిస్తున్న టైటిల్) చేస్తున్నారు. ఇది ఆర్మీ బ్యాక్ డ్రాప్‌లో సాగే లవ్ స్టోరీ అని తెలుస్తుంది. బార్డర్ వద్ద చేసే పోరాటం కూడా ఉండబోతుందట. యాక్షన్‌ని మెయిన్‌గా చేసుకుని సినిమా సాగుతుందని తెలుస్తుంది. ప్రభాస్ సైనికుడిగా కనిపించబోతున్నారు. ఆ మధ్య ఈ మూవీ ప్రారంభమైంది. అయితే షూటింగ్ స్టార్ట్ అయ్యిందా? లేదా అనేది క్లారిటీ లేదు.
read more: టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్.. అన్ని భాషల్లో ఫస్ట్ 100కోట్ల సినిమాలేంటో తెలుసా?
ఈ నేపథ్యంలో దీనిపై స్పందించారు రైటర్ కృష్ణకాంత్. ఆయన పాటల రచయితగా మంచి పేరు సంపాదించుకున్నారు. తాజాగా `ఫౌజీ` సినిమా గురించి ఓపెన్ అయ్యారు. ఈ మూవీకి `ఫౌజీ` అనే టైటిల్ ఫిక్స్ అయినట్టు చెప్పకనే చెప్పేశారు. ప్రస్తుతం పాటలపై వర్క్ జరుగుతుందట.
రెండు పాటలకు సంబంధించిన వర్క్ జరుగుతుందట. గతంలో హను రాఘవపూడి లవ్ స్టోరీస్‌పైనే ఫోకస్ పెట్టారు. కానీ ఈ సారి యాక్షన్, డ్రామా కూడా ఉండబోతుందట.
ఇక్కడే డార్లింగ్ ఫ్యాన్స్ హై ఇచ్చే ఎలిమెంట్లు రివీల్ చేశారు. హాలీవుడ్ స్థాయిలో సినిమా ఉండబోతుందట. యాక్షన్, డ్రామా హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని తెలిపారు. అదేసమయంలో ఈ మూవీ పీరియాడికల్ ఫిల్మ్ అనే టాక్ వినిపించింది.
అయితే ఇది 1940 బ్యాక్ డ్రాప్‌లో సాగే కథ అట. స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో సాగుతుందని, దేశభక్తి అంశాలుంటాయట. అవే సినిమాకి మెయిన్ హైలైట్ అని తెలిపారు కృష్ణకాంత్. సింపుల్‌గా ఈ మూవీపై భారీ హైప్ ఇచ్చారు రైటర్.
రైటర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే, పీరియాడికల్ ఎలిమెంట్లు, యాక్షన్ ఎలిమెంట్లు, డ్రామా, ముఖ్యంగా దేశభక్తి ఎలిమెంట్లు వర్కౌట్ అయితే సినిమా వేరే రేంజ్‌లో ఉంటుందని చెప్పొచ్చు. రెండువేల కోట్ల కలెక్షన్లు పక్కా అని, రాసిపెట్టుకోండి, మరో ఇండియన్ సినిమాని షేక్ చేసే మూవీ రాబోతుందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నాయి.
హను రాఘవపూడి ఎమోషన్స్ ని పట్టుకోవడంలో దిట్ట. అదే ఆయన బలం. ఇలాంటి బ్యాక్ డ్రాప్‌కి సరైన ఎమోషన్స్ పడితే సినిమా నిజంగానే వేరే లెవల్ అని చెప్పొచ్చు. మరి ఏ స్థాయిలో డీల్ చేస్తారో చూడాలి. ఇందులో డార్లింగ్ కి జోడీగా సోషల్ మీడియా సంచలనం ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీని వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారట.
read more: సంక్రాంతికి ప్రభాస్ కొత్త సినిమా ప్రకటన?, దర్శకుడు ఎవరో తెలిస్తే పూనకాలే!