MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • నన్ను మోసం చేయలేదు, నా ఒక్కదాన్నే అంటిపెట్టుకున్నారు.. తమ రిలేషన్‌పై భార్య చెప్పిన మాట బయటపెట్టిన బాలకృష్ణ

నన్ను మోసం చేయలేదు, నా ఒక్కదాన్నే అంటిపెట్టుకున్నారు.. తమ రిలేషన్‌పై భార్య చెప్పిన మాట బయటపెట్టిన బాలకృష్ణ

బాలకృష్ణ ఎప్పుడూ తన భార్య ప్రస్తావన తీసుకురారు. మొదటిసారి ఆయన తన భార్యచెప్పిన మాట బయటపెట్టారు. తాను ఆమె ఒక్కదానితోనే ఉండిపోయినందుకు ఆమె సంతోషంగా ఫీలవుతున్నట్టు తెలిపారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 28 2025, 11:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
భార్య వసుంధర మాటలు బయటపెట్టిన బాలయ్య
Image Credit : youtube/@manastars

భార్య వసుంధర మాటలు బయటపెట్టిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం `అఖండ 2`లో నటించారు. బోయపాటి శ్రీను రూపొందించిన ఈ సినిమా డిసెంబర్‌ 5న విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో బాలయ్య మాట్లాడుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనతో తన భార్య వసుంధర దేవి చెప్పిన మాటలను వెల్లడించారు. తాను పాదరసం లాంటి వాడిని అని, ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తానని తెలిపారు.  `ఓ వైపు నటుడిగా, మరోవైపు హిందూపురం ఎమ్మెల్యేగా, ఇంకోవైపు బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రికి చైర్మెన్‌గా ఉంటున్నాను. ఒక్కదగ్గర ఉండను. కానీ ఒక విషయంలో మాత్రం ఒకే దగ్గర లాక్‌ అయిపోయాను. అదే నా భార్య విషయంలో. నా భార్య ఎప్పుడూ అంటుంది. హమ్మయ్య నన్ను ఈ విషయంలో మోసం చేయలేదు. నన్నే అంటిపెట్టుకుని ఉన్నారని అంటుంది` అని చెప్పి నవ్వులు చిందించారు బాలయ్య. ఇది విని వెనకాల బోయపాటి కూడా నవ్వడం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ధర్మాన్ని కాపాడేదే అఘోరాలు, స్వామిజీలు
Image Credit : youtube/@shreyasgroup

ధర్మాన్ని కాపాడేదే అఘోరాలు, స్వామిజీలు

`అఖండ ` సినిమా గురించి చెబుతూ, ఈ సినిమాలో సనాతన ధర్మం గురించి గొప్పగా చూపించాం. ఈ విషయాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా అభినందించారు. దేశాన్ని కాపాడటానికి సైనికులు ఎలా అయితే ఉంటారో, సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఈ అఘోరాలు, స్వామిజీలు ఉంటారని చెప్పేదే ఈ సినిమా. బోయపాటి ఈ విషయాన్ని సినిమాలో అద్భుతంగా చూపించారు. బాలయ్య సినిమా అంటే ఉగాది పంచడి లాంటిది. ఇందులో అన్ని రుచులుంటాయి. అదే సమయంలో మంచి పాట కూడా ఉంది. సంయుక్తతో ఉండే పాట ఐటెం సాంగ్‌ కాదు, అది ప్రత్యేక పరిస్థితుల్లో వస్తుంది. చాలా బాగా ఉంటుంది` అని చెప్పారు బాలయ్య.

Related Articles

Related image1
`పుష్ప 3` స్టార్ట్ అయ్యేది అప్పుడే.. సుకుమార్‌ ఆల్‌రెడీ ప్లాన్‌ రెడీ.. ఈ సారి వేరే లెవల్‌
Related image2
అఖండ 2 టీజర్‌ రివ్యూ.. రెండు కాదు, మూడు గెటప్స్ లో బాలయ్య ఆరాచకం, థియేటర్లు ఊగిపోవాల్సిందే
34
ఇండస్ట్రీకి బాలయ్య సూచన
Image Credit : youtube/@shreyasgroup

ఇండస్ట్రీకి బాలయ్య సూచన

ఇందులో అభిమానులపై ప్రశంసలు కురిపించారు బాలయ్య. `నేను విజయానికి పొంగిపోలేదు, అపజయానికి కుంగిపోను.  అభిమానులు నా విజయంలో నాతో ఉన్నారు. నా విజయాన్ని  సెలబ్రేట్‌ చేసుకున్నారు. అదే సమయంలో పరాజయాల్లోనూ నా వెంటే ఉన్నారు. అదీ నా అభిమానులంటే` అని చెప్పారు. ఈ సందర్భంగా సినిమాలు వేగంగా తీయాలని ఇండస్ట్రీకి సూచించారు. నేను, బోయపాటి కలిస్తే మూడే నిమిషాలు మాట్లాడుకుంటాం. అంతే సినిమా చేస్తాం, పెద్దగా చర్చలు ఉండవు. చెప్పిన టైమ్‌లో సినిమాని కంప్లీట్‌ చేస్తాం. సినిమా ఇండస్ట్రీ కూడా దీన్ని ఫాలో అవ్వాలి. వేగంగా సినిమాలు పూర్తి చేస్తే ఇండస్ట్రీ బాగుంటుంది.  మనిషికి ఇప్పుడు నిత్యావసరాల్లో సినిమా కూడా భాగమయ్యింది. అంతగా ఆడియెన్స్  సినిమాని ప్రేమిస్తున్నారు, అలాంటి సినిమా ఎలా ఉండాలనేది ఇండస్ట్రీ ఆలోచించాలి` అని తెలిపారు.  ఈ విషయంలో డెడికేషన్‌ చాలా ముఖ్యమని చెప్పారు బాలయ్య.

44
ఎన్బీకే 111 డైలాగ్‌ లీక్‌ చేసిన బాలయ్య
Image Credit : youtube/@shreyasgroup

ఎన్బీకే 111 డైలాగ్‌ లీక్‌ చేసిన బాలయ్య

ఈ సందర్భంగా తాను చేయబోతున్న `ఎన్బీకే111`లోని డైలాగ్‌ని లీక్‌ చేశారు. `చరిత్రలో చాలామంది ఉంటారు. చరిత్రని మరలా మరలా తిరిగి రాసి సృష్టించేవాడు ఒకడే ఉంటాడు. నేనే ఈ చరిత్ర, నాదే ఆ చరిత్ర` అని చెబుతూ అభిమానులను ఉర్రూతలూగించారు బాలయ్య. `మహా శివుడు శక్తి, ఆదిశక్తి సాక్షిగా గంగమ్మ తల్లి ఆశీర్వాదంతో చెబుతున్నాను. ఈ రుద్ర తాండవ విన్యాసం నాలో ఆవేశమై, ఆ త్రినేత్రుడి వీక్షణ దృష్టి నాలో నిక్షిప్తమై, ఆయన త్రిశూలం నా ఆయుధానికి శక్తి శూలమై.. ఎలా ఉండబోతుందో నా పాత్ర మీరు తెరపై చూస్తారు` అని చెప్పారు బాలయ్య. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Recommended image2
Ramba Oorvasi Menaka Review: రంభ ఊర్వశి మేనక మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లరి నరేష్‌ తన జోనర్‌లో హిట్‌ కొట్టాడా?
Recommended image3
Kalpana Rai: ఒళ్ళంతా నగలు, పుట్టుకతోనే కోటీశ్వరురాలు..వెంకీ, చిరు లతో సూపర్ హిట్స్, కానీ చివరికి ఆమె జీవితం
Related Stories
Recommended image1
`పుష్ప 3` స్టార్ట్ అయ్యేది అప్పుడే.. సుకుమార్‌ ఆల్‌రెడీ ప్లాన్‌ రెడీ.. ఈ సారి వేరే లెవల్‌
Recommended image2
అఖండ 2 టీజర్‌ రివ్యూ.. రెండు కాదు, మూడు గెటప్స్ లో బాలయ్య ఆరాచకం, థియేటర్లు ఊగిపోవాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved