- Home
- Entertainment
- అఖండ 2 టీజర్ రివ్యూ.. రెండు కాదు, మూడు గెటప్స్ లో బాలయ్య ఆరాచకం, థియేటర్లు ఊగిపోవాల్సిందే
అఖండ 2 టీజర్ రివ్యూ.. రెండు కాదు, మూడు గెటప్స్ లో బాలయ్య ఆరాచకం, థియేటర్లు ఊగిపోవాల్సిందే
Akhanda 2 Teaser Review: బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న `అఖండ 2 తాండవం` మూవీ నుంచి అదిరిపోయే టీజర్‌ని విడుదల చేసింది టీమ్. ఈ టీజర్ ఎలా ఉందో చూద్దాం.

`అఖండ 2`పై అంచనాలు పెంచిన ట్రైలర్
బాలకృష్ణ హీరోగా నటించిన `అఖండ 2` చిత్రం మరో వారం రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇందులో సంయుక్త హీరోయిన్‌గా నటించగా, ఆది పినిశెట్టి విలన్‌గా చేశారు. పూర్ణ కీలక పాత్రలో నటించింది. బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ నుంచి రెండు గ్లింప్స్ లు, ఓ ట్రైలర్ విడుదలైంది. అవి సినిమాపై బజ్‌ని పెంచాయి. బాలయ్య తన మార్క్ డైలాగ్‌లో అదరగొట్టారు. అఘోర పాత్రలో విశ్వరూపం చూపించారు. ముఖ్యంగా యాక్షన్ తో వాహ్ అనిపించారు. అదే సమయంలో హిందుత్వం గురించి, సనాతన హైందవ ధర్మం గురించి గొప్పగా చెప్పారు.
`అఖండ 2` నుంచి మరో టీజర్ ఔట్
ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి మరో సర్‌ప్రైజ్ వచ్చింది. `అఖండ 2 తాండవం` టీజర్‌ని విడుదల చేశారు. మాసివ్ తాండవం పేరుతో హై ఓల్టేజ్ యాక్షన్ కంటెంట్‌తో ఈ టీజర్‌ని విడుదల చేయడం విశేషం. మార్కెట్ వర్గాల్లో, మరోవైపు ఆడియెన్స్ లోనూ సినిమాపై బజ్ పెంచేందుకు టీమ్ ఈ టీజర్‌ని విడుదల చేసింది. ఇది ఆద్యంతం ఆకట్టుకుంటోంది. నందమూరి అభిమానులకి పూనకాలు తెప్పిస్తోంది. మాస్ డైలాగులు, అంతకు మించిన ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్స్ తో దుమ్ములేపారు.
బాలయ్య మూడో లుక్, ఆది పినిశెట్టి విధ్వంసం
టీజర్‌లో ఏం చూపించారంటే.. `భారత్‌ని కొట్టాలంటే అక్కడి మూలాలను అడ్డం పెట్టుకొనే కొట్టాల`ని విలన్ చెప్పడంతో త్రిశూలం పట్టుకుని శివయ్య(అఖండలోని) లుక్‌లో బాలయ్య ఎంట్రీ ఇచ్చారు. ఆయన త్రిశూలం తిప్పిన తీరు వాహ్ అనేలా ఉంది. అనంతరం హిమాలయాల్లో.. ధైర్యంగా ఉండాలని ఇంగ్లీష్‌లో బాలయ్య మాటలు ఉత్సాహాన్ని నింపేలా ఉన్నాయి. ఇందులో బాలయ్య అఘోర లుక్‌లో కనిపించారు. అనంతరం నాన్న అంటూ హర్షాలితోపాటు సాధారణ నాయకుడి లుక్‌లో బాలయ్య కనిపించారు. అనంతరం మాయలు, మంత్రాలు చేస్తూ ఆదిపినిశెట్టి ఎంట్రీ ఇచ్చారు. ఆయన చేసిన మంత్రానికి కార్డ్ ధ్వంసం అవుతుంది. అక్కడ విలయతాండవం జరుగుతుంది.
మూడు గెటప్స్ లో బాలయ్య విశ్వరూపం
అఘోర లుక్‌లో కనిపించిన బాలయ్య `కొండల్లో తొండల్ని తిని బతికే మీరెక్కడ, ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడ` అని చెప్పి, అఘోరగా, శివుడిగా డిఫరెంట్ లుక్స్ లో బాలయ్య త్రిశూలం ఉపయోగించిన తీరు చూస్తే పూనకాలు రావాల్సిందే. అనంతరం గద పట్టుకుని బాలయ్య చేసిన యాక్షన్ గూస్ బంమ్స్ తెప్పించింది. ఆ సమయంలో ఆకాశంలో హనుమంతుడిని చూపించిన తీరు అదిరిపోయింది. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా ఈ టీజర్ ఉంది. ఆద్యంతం కట్టిపడేస్తుంది. ఇందులో బాలయ్య మూడు గెటప్స్ లో కనిపించడం అదిరిపోయింది. మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడా అనే క్యూరియాసిటీని పెంచుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.
డిసెంబర్ 5న అఖండ 2 పాన్ ఇండియా రిలీజ్
బాలకృష్ణ కూతురు తేజస్విని సమర్పణలో 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. బాలయ్య నుంచి వస్తోన్న తొలి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. తాజాగా శుక్రవారం హైదరాబాద్‌లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు.

