MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాలకృష్ణ, నాగార్జున కలిసి నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా?.. ఫ్యాన్స్ పండగ చేసుకునే ఘట్టం ఎలా సాధ్యమైంది?

బాలకృష్ణ, నాగార్జున కలిసి నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా?.. ఫ్యాన్స్ పండగ చేసుకునే ఘట్టం ఎలా సాధ్యమైంది?

నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జునలకు మధ్య  గ్యాప్‌ ఉంది. ఇద్దరి మధ్య విభేదాలున్నాయనే మాట వినిపిస్తుంది. అదేంటో తెలియదు, కానీ ఈఇద్దరు కలిసి ఓ సినిమాలో మెరిశారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 22 2024, 09:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నందమూరి బాలకృష్ణ, నాగార్జున మధ్య గ్యాప్ ఉందని అంతా అంటుంటారు. ఈ ఇద్దరు కలవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఆ గ్యాప్‌ పెరిగిపోతూనే ఉంది. మరి దానికి కారణం ఏంటనేది ఎవరికీ తెలియని, అర్థం కానీ విషయం. ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అయితే నిజంగానే ఇద్దరి మధ్య గ్యాప్‌ ఉందా అనేది కూడా ఓ ప్రశ్ననే.  
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఏదేమైనా ప్రచారంలో ఉన్న మాట మాత్రం బాలయ్యకి, నాగ్‌కి పడదు అనేది. అది కొనసాగుతూనే ఉంది. వీరిద్దరు ఎప్పుడూ ఫ్రీగా కలవకపోవడం కూడా ఆ ప్రచారానికి బలం చేకూరినట్టవుతుంది. బాలయ్య తనతోటి హీరో చిరంజీవితో అడపాదడపా కలుస్తూనే ఉంటారు. అలాగే వెంకీతో ఎవరికీ ఏ గొడవ లేదు. కానీ బాలయ్య, నాగ్‌ మధ్యనే ఆ గ్యాప్‌ ఉండిపోయింది. 
 

36

అయితే ఈ ఇద్దరు కలిసి నటించాలని చాలా సార్లు అనుకున్నారట. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్‌ బాగా ఉన్నప్పుడు ప్లాన్‌ చేశారట. కానీ కుదరలేదు. ఏఎన్నార్‌ అంటే బాలయ్యకి ఇష్టం. చిన్నాన్నగా భావిస్తారు. ఆ రిలేషన్‌తోనే నాగ్‌తోనూ కలిసి నటించాలనుకున్నారు. కానీ కుదరలేదు. అయితే ఒక సినిమాలో మాత్రం ఈ ఇద్దరు మెరిశారు. ఇండస్ట్రీని అలరించారు. ఫ్యాన్స్ పండగ చేసుకునేలా చేశారు. మరి ఆ మూవీ ఏంటనేది చూస్తే.. 
 

46

`త్రిమూర్తులు` సినిమాలో బాలకృష్ణ, నాగార్జున కలిసి కనిపించడం విశేషం. కాకపోతే జస్ట్ గెస్ట్ రోల్స్ చేశారు. ఇది వెంకటేష్‌ హీరోగా రూపొందిన మూవీ. అర్జున్‌, రాజేంద్రప్రసాద్‌ మిగతా హీరోలు. కె మురళీ మోహనరావు దర్శకత్వం వహించారు. 1987లో ఈ మూవీ విడుదలైంది. ఇందులో ఇండస్ట్రీకి చెందిన అగ్ర హీరోలంతా, హీరోయిన్లంతా కలిసి కనిపించారు. ఓ సీన్‌ కోసం ఇండస్ట్రీని దించారు దర్శకుడు. అలా చిరంజీవి, బాలయ్య, నాగార్జునతోపాటు కృష్ణంరాజు, కృష్ణ, శోభన్‌బాబు, విజయశాంతి, చంద్రమోహన్‌, మురళీ మోహన్‌, పరుచూరి బ్రదర్స్, గొల్లపూడి, పద్మనాభం, రాధ, భాను ప్రియ, రాధికతోపాటు శారద, జయమాలిని, అనురాధ, వై విజయ వంటి వారు గెస్ట్ లుగా మెరిశారు. 
 

56

అంతేకాదు ఇందులో అప్పటి టాప్‌ హీరోలు చిరంజీవి, బాలయ్య, నాగ్‌, వెంకీలు కలిసి కనిపించడం కూడా విశేషం. ఇదొక కనువిందు చేసే అరుదైన సందర్భం. ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కానీ ఈ మూవీ ఆడలేదు. ఇండస్ట్రీలో సగానికిపైగా యాక్టర్స్ ఇందులో కనిపించినా, సినిమా ఆడకపోవడం గమనార్హం. కథ, కథనాలు తెలుగు ఆడియెన్స్ కి ఎక్కలేదు. దీంతో జస్ట్ బిలో యావరేజ్‌ మూవీగా నిలిచింది.  ఇలా ఇప్పుడు శత్రువులుగా కనిపిస్తున్న బాలయ్య, నాగ్‌ 37ఏళ్ల క్రితమే కలిసి కనిపించడం విశేషం. 
 

66

ఇక ప్రస్తుతం బాలకృష్ణ.. బాబీ దర్శకత్వంలో `ఎన్బీకే109` చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో `బీబీ 4` చేయబోతున్నారు. త్వరలోనే ఇది ప్రారంభం కానుంది. మరోవైపు నాగార్జున సోలోగా తన నెక్ట్స్ మూవీ ఇంకా ప్రకటించలేదు. కానీ `కుబేర`లో ధనుష్‌తో నటిస్తున్నారు. అలాగే `కూలీ`లో రజనీకాంత్‌తో కలిసి మల్టీస్టారర్‌ చేస్తున్నారట. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: దీపను దారుణంగా అవమానించిన జ్యో- దీప, CEO పోటీ నుంచి తప్పుకుంటుందా?
Recommended image2
Jr NTR House: జూనియర్ ఎన్టీఆర్ ఇంద్రభవనం గురించి తెలుసా.. 25 కోట్లతో డ్రీమ్ హౌస్ నిర్మించుకున్న యంగ్ టైగర్
Recommended image3
Kurchi Thatha: తీవ్ర విషాదం, సోషల్ మీడియా సంచలనం కుర్చీ తాత మృతి.. కన్నీరు మున్నీరవుతున్న వైజాగ్ సత్య
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved