MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Balakrishna Health: బాలకృష్ణ మోకాలి గాయం తీవ్రత ఎంత.. తేల్చేసిన వైద్యులు, లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఇదే

Balakrishna Health: బాలకృష్ణ మోకాలి గాయం తీవ్రత ఎంత.. తేల్చేసిన వైద్యులు, లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఇదే

ఎన్బీకే 111 షూటింగ్ లో ప్రమాదం జరగడంతో నందమూరి బాలకృష్ణ మోకాలికి తీవ్రమైన గాయం అయింది. ఏఐజీ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. వైద్యులు తాజాగా హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 22 2026, 06:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నందమూరి బాలకృష్ణ
Image Credit : our own

నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండవ చిత్రం ఎన్బీకే 111(వర్కింగ్ టైటిల్). రాజమండ్రిలో ఈ చిత్ర షూటింగ్ లో ప్రమాదవశాత్తూ బాలయ్యకి గాయాలయ్యాయి. దీనితో రాజమండ్రిలో ప్రాధమిక చికిత్స అందించి ఆ తర్వాత హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలకృష్ణకి చికిత్స కొనసాగుతోంది. ఎడమ మోకాలికి తీవ్రమైన గాయం అయినట్లు తెలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
లేటెస్ట్ హెల్త్ అప్డేట్, మోకాలిలో గడ్డకట్టిన రక్తం
Image Credit : aha

లేటెస్ట్ హెల్త్ అప్డేట్, మోకాలిలో గడ్డకట్టిన రక్తం

దీనితో తాజాగా ఏఐజీ ఆసుపత్రి బృందం బాలకృష్ణ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. బాలయ్య మోకాలి గాయానికి సంబంధించి కీలక విషయాలని తెలియజేశారు. ఏఐజీ ఆసుపత్రి రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్ లో సమాచారం ఇలా ఉంది. ' శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి రాజమండ్రిలో సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో ఎడమ మోకాలికి గాయమైంది.స్థానిక ఆసుపత్రిలో ఆయనకు ప్రాథమిక వైద్యం అందించిన అనంతరం, తదుపరి చికిత్స, నిర్ధారణ పరీక్షల కోసం హైదరాబాద్‌లోని AIG ఆసుపత్రికి ఎయిర్‌లిఫ్ట్ ద్వారా తరలించారు. ప్రాథమిక పరీక్షల్లో ఎడమ మోకాలి చుట్టూ ఉన్న కణజాలంలో రక్తం గడ్డకట్టడం, వాపు ఉన్నట్లు తేలింది. మోకాలి కండరం పట్టేయడం లేదా చీలిక జరిగి ఉండవచ్చు.

Related Articles

Related image1
Mahesh Babu Flops: కృష్ణ, నమ్రతకి కూడా ఇష్టం లేదు.. మహేష్ బాబు కెరీర్ లో రాడ్డు లాంటి 5 సినిమాలు
Related image2
Kaylee Hottle: కారు ప్రమాదంలో 18 ఏళ్ళ యువనటి మృతి, ఆ లోపంతో ఇంత సాధించిందా.. తెలిస్తే కన్నీళ్లు ఆగవు
34
అన్ని పరీక్షలు పూర్తయ్యాకే..
Image Credit : Asianet News

అన్ని పరీక్షలు పూర్తయ్యాకే..

ప్రస్తుతం ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం పర్యవేక్షణలో ఆయనకు విస్తృత వైద్య పరిక్షలు జరుగుతున్నాయి. ఆయన గత వైద్య చరిత్ర ఆధారంగా, అత్యంత సురక్షితమైన చికిత్సను నిర్ణయించడానికి వివిధ విభాగాల నిపుణుల బృందం ఆయన ఆరోగ్యాన్ని సమీక్షిస్తోంది.శ్రీ బాలకృష్ణ గారి ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉంది. వైద్యులు ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత పూర్తిస్థాయి చికిత్స ప్రణాళికను ఖరారు చేస్తారు' అని ఏఐజీ ఆసుపత్రి ప్రకటించింది. బాలకృష్ణ మోకాలికి శస్త్ర చికిత్స అవసరం అంటూ ప్రచారం జరిగింది. కానీ ఆ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ లో నిర్ధారించలేదు. అన్ని పరీక్షలు పూర్తయ్యాకే ఎలాంటి చికిత్స అవసరం అనేది నిర్ణయిస్తారు.

44
ఎప్పటిలాగే బాలయ్య ఎనెర్జిటిక్ గా తిరిగిరావాలి
Image Credit : Film Scene

ఎప్పటిలాగే బాలయ్య ఎనెర్జిటిక్ గా తిరిగిరావాలి

ఐదేళ్ల క్రితం బాలకృష్ణకి షోల్డర్ సర్జరీ జరిగింది. కుడి భుజానికి గాయం, తీవ్రమైన నొప్పి కారణంగా బాలయ్య 2021లో సర్జరీ చేయించుకున్నారు. దాని నుంచి త్వరగా కోలుకుని ఎప్పటిలాగే యాక్టివ్ గా సినిమా షూటింగ్స్ లో పాల్గొన్నారు. ఇప్పుడు కూడా బాలయ్య మోకాలి గాయం నుంచి త్వరగా కోలుకుని మునుపటి లాగే ఎనెర్జిటిక్ గా తిరిగి రావాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
Jeevitha:భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నా భార్య ఏమీ అనకూడదు.. జీవిత రాజశేఖర్ షాకింగ్ కామెంట్స్
Recommended image2
AA23: అల్లు అర్జున్ కోసం అట్లర్ ప్లాప్ హీరోయిన్, ఆందోళనలో ఐకాన్ స్టార్ అభిమానులు, నిజమెంత?
Recommended image3
Kaylee Hottle: కారు ప్రమాదంలో 18 ఏళ్ళ యువనటి మృతి, ఆ లోపంతో ఇంత సాధించిందా.. తెలిస్తే కన్నీళ్లు ఆగవు
Related Stories
Recommended image1
Mahesh Babu Flops: కృష్ణ, నమ్రతకి కూడా ఇష్టం లేదు.. మహేష్ బాబు కెరీర్ లో రాడ్డు లాంటి 5 సినిమాలు
Recommended image2
Kaylee Hottle: కారు ప్రమాదంలో 18 ఏళ్ళ యువనటి మృతి, ఆ లోపంతో ఇంత సాధించిందా.. తెలిస్తే కన్నీళ్లు ఆగవు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved