MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Balakrishna: జగన్ కి జై కొట్టిన బాలయ్య... టికెట్స్ ధరలు అందుబాటులో ఉండాలంటూ ఏకాభిప్రాయం!

Balakrishna: జగన్ కి జై కొట్టిన బాలయ్య... టికెట్స్ ధరలు అందుబాటులో ఉండాలంటూ ఏకాభిప్రాయం!

ఊహించని విధంగా బాలకృష్ణ ప్రత్యర్థి సీఎం జగన్ కి జై కొట్టాడు. ఆయన అభిప్రాయంతో ఏకీభవించారు. తారకరామ థియేటర్ ఓపెనింగ్ ఈవెంట్లో బాలయ్య చేసిన వ్యాఖ్యలు కీలకమయ్యాయి.  

3 Min read
Sambi Reddy
Published : Dec 14 2022, 04:32 PM IST| Updated : Dec 14 2022, 04:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Balakrishna

Balakrishna

టికెట్స్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వంపై టాలీవుడ్ పెద్ద యుద్ధమే చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో సినిమా మనుగడ, థియేటర్స్ ఉనికి కష్టమని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ లాంటి వారు నేరుగా విమర్శలు చేశారు. చిరంజీవి లాంటి పెద్దలు చర్చలకు వెళ్లారు. సీఎం జగన్ తో భేటీ అయ్యారు. అటు ప్రేక్షకులకు ఇటు నిర్మాతలకు మేలు చేసే విధంగా రేట్లు పునరుద్ధరిస్తూ ఏపీ ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసింది. తెలంగాణ పరిశ్రమ కోరినట్లు పెద్ద ఎత్తున టికెట్స్ ధరలు పెంచడం జరిగింది. టికెట్స్ ధరలు ప్రేక్షకులపై ఎంతటి ప్రభావం చూపుతాయో తర్వాత తెలిసింది. వెయ్యి రూపాయలు పెడితే ఏడాది మొత్తం కుటుంబ సభ్యులకు సినిమాలు చూపించే ఓటీటీ ఉండగా... తలకు ఐదు వందలు ఖర్చు పెట్టి థియేటర్లో సినిమా ఎవరు చూస్తారు చెప్పండి. అదే జరిగింది. పెరిగిన టికెట్ ధరలు థియేటర్స్  ట్రాఫిక్ ని తీవ్రంగా దెబ్బతీశాయి. టికెట్స్ ధరలు పెంచండని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన నిర్మాతలు... అనుమతించిన రేట్ల కంటే తగ్గించి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా నందమూరి బాలకృష్ణ సైతం టికెట్స్ ధరలు అందుబాటులో ఉంటేనే శ్రేయస్కరమన్న అభిప్రాయం వెల్లడించారు.

26
Balakrishna

Balakrishna

కాచిగూడలోని 'తారకరామ'(Tarakarama) థియేటర్ వైభవంగా పునః ప్రారంభించారు నటసింహ నందమూరి బాలకృష్ణ. లెజెండరీ ఫిలిం పర్సనాలిటీ నారాయణ్ కె దాస్ నారంగ్, ఆయన కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పై ఉన్న అభిమానంతో  'ఏషియన్ తారకరామ' థియేటర్ని పునరుద్ధరించారు. ఈ రోజు 'ఏషియన్ తారకరామ' థియేటర్ పునః ప్రారంభ కార్యక్రమం నందమూరి బాలకృష్ణ గారు, ప్రొడ్యూసర్ శిరీష్ గారి చేతులు మీదగా గ్రాండ్ గా జరిగింది.
 

36
Balakrishna

Balakrishna


అనంతరం నందమూరి బాలకృష్ణ(Balakrishna) మాట్లాడుతూ.. నాకు ధన్యమైన జన్మనిచ్చి, నన్ను మీ అందరి గుండెల్లో శాశ్వతంగా పెద్దాయన ప్రతిరూపంగా నిలిపిన దైవాంశ సంభూతుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నా కన్నతండ్రి, నా గురువు, దైవం, ఆ కారణజన్ముడికి ఈ శత జయంతి సందర్భంగా ఆయనకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. తారకరామ థియేటర్ కి ఎంతో గొప్ప చరిత్ర వుంది. నాన్నగారు ఏది చేసిన చరిత్రలో నిలిచిపోయేటట్లు చేస్తారు. అది ఆయన దూరద్రుష్టి. ఆయన నటిస్తుంటే జానపదాలు జావళీలు పాడాయి. పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి. సాంఘికాలు సామజవరగమనా పాడాయి. కళామతల్లి కళకళలాడింది. నటనకు జీవం పోసిన నటధీశాలుడు నందమూరి తారకరామారావు గారు.  తెలుగువారి స్ఫూర్తి ప్రదాత తారకరామారావు గారు. చిత్ర పరిశ్రమ మద్రాస్ లో వున్నప్పుడు ఇక్కడ  ఎన్టీఆర్ ఎస్టేట్ ప్రారంభించి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ప్రస్థానం మొదలుపెట్టారు. ఇక్కడ ఎన్టీఆర్ ఎస్టేట్ కూడా ఒక పర్యటక స్థలంగా వుండేది. అలాగే ఈ తారకరామ థియేటర్ వుండేది. ఈ థియేటర్ కి ఒక చరిత్ర వుంది. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మా అమ్మగారి జ్ఞాపకార్ధం కట్టిన ఓ దేవాలయం. తారకరామ థియేటర్ కూడా అమ్మ నాన్నగారి పేర్లు కలిసివచ్చేటట్లు కట్టిన దేవాలయం.  
 

46
Balakrishna

Balakrishna


1978లో 'అక్బర్ సలీం అనర్కాలి'తో ఈ థియేటర్ ని ప్రారంభించడం జరిగింది. తర్వాత 95లో కొన్ని అనివార్యకారణాల వలన మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ఇది మూడోసారి. ఈ థియేటర్ కి గొప్ప చరిత్ర వుంది. డాన్ సినిమా ఇక్కడ 525రోజులు ఆడింది. అలాగే నా సినిమాలు 'మంగమ్మగారి మనవడు', 'ముద్దుల మావయ్య', 'ముద్దుల కృష్ణయ్య', 'అనసూయమ్మగారి అల్లుడు'.. ఇలా అన్నీ సినిమాలు అద్భుతంగా ఆడాయి. అలాగే మా అబ్బాయి మోక్షజ్ఞ తారకరామ తేజ పేరు కూడా ఈ థియేటర్ లోనే నాన్న గారు నామకరణం చేశారు. 
 

56
Balakrishna

Balakrishna

నారాయణ్ కె దాస్ నారంగ్ గారికి నాన్నగారి సన్నిహిత సంబంధాలు ఉండేవి. వాళ్ళ అబ్బాయి సునీల్ నారంగ్ ఆ పరంపరని ముందుకు తీసుకువెళ్తున్నారు. మేమంతా ఒక కుటుంబ సభ్యులం. వారి పర్యవేక్షణలో ఈ థియేటర్ నడపడం చాలా సంతోషంగా వుంది. ఈ అనుబంధం ఇలానే కొనసాగించాలి. సునీల్ నారంగ్ గారు అందరి అందుబాటు ధరలో టికెట్ రేట్లుని చెప్పారు. ఇది ఇండస్ట్రీకి చాలా ఆరోగ్యకరమైనది. ఎంతమంది ఎన్నిసార్లు థియేటర్ కి వచ్చి సినిమా చుస్తారనేది ఒక ప్రశ్న. ఓటీటీ రూపంలో సినిమా ఇండస్ట్రీకి ఒక కాంపిటీషన్ వుంది. అందరం కలసి మంచి సినిమాలని అందించాలి. ప్రేక్షకులు తప్పకుండా థియేటర్స్ కి వస్తారు. థియేటర్లో పొందే ఆనందం వేరు. మంచి సినిమాలు తీయడం మన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రత్యేకత. పాన్ ఇండియా స్థాయికి మన తెలుగు చిత్ర పరిశ్రమ ఎదిగింది. మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లు చలన చిత్ర పరిశ్రమ వర్ధిల్లి ముందుకు సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను'' అన్నారు  
 

66
Balakrishna

Balakrishna

సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. మహనీయుడు ఎన్టీఆర్ గారి పేరు మీద ఈ థియేటర్ వుంది. బాలకృష్ణ గారు ఇక్కడికి విచ్చేసి థియేటర్ ని ప్రారంభించడం చాలా సంతోషంగా వుంది. ఈ థియేటర్ కి ఎంతో గొప్ప చరిత్ర వుంది. ఇక్కడ మళ్ళీ సిల్వర్ జూబ్లీలు పడతాయి. సరికొత్త టెక్నాలజీతో థియేటర్ ని అద్భుతంగా నిర్మించాం. 600 సీటింగ్ తో హాల్లో పూర్తి రిక్లైనర్ సీట్లు ఏర్పాటు చేశాం. రేట్లు కూడా రీజనబుల్ గా పెట్టాం. మా నాన్నగారు, ఎన్టీఆర్ గారు చాలా మంచి స్నేహితులు. నందమూరి కుటుంబంతో మా అనుబంధం చాలా గొప్పది. భవిష్యత్తులో కూడా ఇలానే వుండాలని కోరుకుంటున్నాను. బాలయ్య గారికి మరోసారి కృతజ్ఞతలు'' తెలిపారు. ఈ కార్యక్రమంలో నందమూరి మోహన్ కృష్ణ, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న, శిరీష్, సదానంద్ గౌడ్, భరత్ నారంగ్, డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..
Recommended image2
Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్
Recommended image3
Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved