బ్యాన్ అయిన బాలకృష్ణ ఫస్ట్ సినిమా.. కారణం ఏంటో తెలుసా..?
నందమూరినట వారసత్వాన్ని నిలబెట్టాడు బాలయ్య బాబు.. ఇప్పటికీ వరుస హిట్ సినిమాలో దూసుకుపోతున్నాడు. అయితేఈ రేంజ్ లో స్టార్ డమ్ సాధించిన బాలకృష్ణ.. ఫస్ట్ మూవీ బ్యాన్ అయ్యిందని మీకు తెలుసా..? కారణం ఏంటంటే..?

హీరోగా బాలయ్య బాబు క్రేజ్ గురించి తెలిసిందే. అయితే బాలకృష్ణ ఇండస్ట్రీకిపరిచయం అయ్యింది మాత్రం బాలనటుడిగానే. అయితే బాలయ్య నటించి మొదటి సినిమానే బ్యాన్ అయ్యిందట. ఈ విషయం ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజం. హీరోగా టాలీవుడ్ ను ఏలిన బాలయ్య ఫస్ట్ సినిమా ఏంటి.. ? ఎందుకు బ్యాన్అయ్యింది.,,?
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు గారు బాలనటుడిగా బాలయ్య ను పరిచయం చేశారు. అంతే కాదు బాలకృష్ణను హీరోగా పరిచయం చేసింది కూడా రామారావుగారే. అయితే బాలకృష్ణ బాల నటుడిగా నటించిన మొదటి సినిమా తాతమ్మ కల. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రాల్లో తాతమ్మ కలకు ఉన్న ప్రత్యేకత వేరు. ఈ సినిమా ముగింపును రెండుసార్లు మార్చి రెండు సార్లు విడుదల చేయడం జరిగింది.
అంతే కాదు ఈసినిమా రిలీజ్ టైమ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో.. ఈమూవీని బ్యాన్ చేశారట. ఈసినిమాలో ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా పాయింట్లు ఉండటం...అలాగే భూ సంస్కరణలను కూడా ఎన్టీఆర్ వ్యతిరేకించి ఈ చిత్రంలో ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. తాతమ్మ కథ చిత్రంపై అసెంబ్లీలో వాడీ వేడి చర్చ జరిగింది. ఫలితంగా ఈ చిత్రాన్ని రెండు నెలలు నిషేదించింది ప్రభుత్వం.
ఆ సమయంలో ఎన్టీఆర్ వివరణ ఇస్తూ.. భూ సంస్కరణలు, కుటుంబ నియంత్రణకు నేను వ్యతిరేకిని కాను. కష్టపడి పని చేయాలని సినిమాలో చెప్పాను. దేశంలో అందరూ కష్టపడి పని చేస్తే కుటుంబ నియంత్రణ, భూసంస్కరణలు అనవసరం అని అభిప్రాయపడ్డారు ఎన్టీఆర్.అయితే ఇక్కడ వింత ఏంటంటే.. ప్రభుత్వం బ్యాన్ చేసిన ఈసినిమాకు.. ఆతరువాత ఉత్తమ కథగా నంది అవార్డు రావడం మరొక విశేషం.
ఎన్టీఆర్, భానుమతి వంటి తారాగాణంతో కలిసి తొలిసారి బాలకృష్ణ నటించిన సినిమా తాతమ్మ కల. ఈసినిమాలో బాలయ్య బాబు సరిగ్గా చేయకపోతే ఎన్టీఆర్ గట్టిగా గద్దించారట కూడా. అప్పుడు భానుమతికలిపించుకుని.. రామారావు గారు పిల్లాడు చక్కగా నటించాడు. అనవసరంగా భయపెట్టకండి అని చెప్పి దీవించారట. అనుకున్నట్టుగానే బాలయ్య నేటికి సినిమా రంగంలో రారాజుగా రాణిస్తూనే ఉన్నాడు.
తాతమ్మ కల చిత్రంలో నలుగురు కొడుకులు, ఒక కూతురు ఉండగా.. అయితే హరికృష్ణ, బాలకృష్ణ ఆయనకు కొడుకులుగా నటించారు. కుటుంబ నియంత్రణను వ్యతిరేకిస్తూ.. భానుమతి పాత్రతో కొన్ని డైలాగ్‌లు చెప్పించారు ఎన్టీఆర్.తాతమ్మ కల చిత్రం 50 రోజులు నడిచిన తరువాత చిత్ర ప్రదర్శనను నిలిపివేసి కొన్ని మార్పులతో 1975 జనవరి 08న మరల విడుదల చేశారు. ఈ సినిమాను తొలుత బ్లాక్ అండ్ వైట్‌లో తీసినా ఆ తరువాత రెండోసారి కలర్ సినిమాగా రిలీజ్ చేశారు.