- Home
- Entertainment
- Chiru-NBK Fans War: చిరంజీవి గర్వకారణమైతే ఎన్టీఆర్ ఏంటీ?.. మెగాస్టార్‌పై రెచ్చిపోతున్న బాలయ్య ఫ్యాన్స్..
Chiru-NBK Fans War: చిరంజీవి గర్వకారణమైతే ఎన్టీఆర్ ఏంటీ?.. మెగాస్టార్‌పై రెచ్చిపోతున్న బాలయ్య ఫ్యాన్స్..
మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ మధ్య మరోసారి అగ్గి రాజుకుంది. ఆ మధ్య `ఆర్‌ఆర్‌ఆర్` విషయంలో గట్టిగా ఫైట్ చేసుకున్నారు. ఇప్పుడు చిరంజీవి, బాలకృష్ణ అభిమానులు ట్విట్టర్‌లో రెచ్చిపోతున్నారు. మాటల యుద్ధానికి తెరలేపారు.

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ తరచూ జరుగుతుంది. ఒక హీరోపై మరో హీరో అభిమానులు విమర్శలు గుప్పిస్తుంటే, దానికి కౌంటర్లిస్తూ ఆ హీరో అభిమానులు రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి(Chiranjeevi), నటసింహాం నందమూరి బాలకృష్ణ(Balakrishna) అభిమానుల వంతు వచ్చింది. ఇద్దరిలో ఎవరు బెస్ట్ మాస్ హీరో అనే ప్రశ్నకి ఇద్దరు హీరోల అభిమానులు రెచ్చిపోతున్నారు. ఇంటర్నెట్‌లో పెద్ద వార్‌కి తెరలేపారు. Mega Nandamuri Fans War.
జనరల్‌గా ఇండస్ట్రీకి చిరంజీవి, బాలయ్యకి మధ్య సరైన రిలేషన్ ఉండదని, ఇద్దరికి పడదనే వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. వీరిద్దరి మధ్య చాలా సందర్భాల్లో బాక్సాఫీస్ ఫైట్ కూడా ఉంటుంది. ఇద్దరి సినిమాలు ఒకేరోజు విడుదలైన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ టైమ్ నుంచే ఇద్దరి హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ ప్రారంభమైంది. తరచూ ఆ వార్ జరుగుతూనే ఉంటుంది. చిరు రీఎంట్రీ ఇచ్చినప్పుడు `ఖైదీ నెం. 150`, బాలయ్య నటించిన `గౌతమిపుత్ర శాతకర్ణి` సినిమాలో సంక్రాంతికి విడుదలై పోటీ పడ్డాయి. అప్పుడు కూడా ఫ్యాన్స్ మధ్య వార్ జరిగింది. ఇప్పుడు మరోసారి ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. Mega Nandamuri Fans War.
చిరంజీవి నటించిన `ఆచార్య` శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తుంది. కానీ తొలి రోజు దాదాపు రూ.40కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు సమాచారం. ఫస్ట్ డే కలెక్షన్లు ఫర్వాలేదు. ఇకపై ఎలా ఉంటాయనేది ముఖ్యం. సినిమా ఫ్లాఫ్ అంటూ ప్రచారం జరుగుతుంది. సినిమాలో చిరంజీవి నటనపై కూడా విమర్శలొస్తున్నాయి. డాన్సుల్లో, బాడీలో ఈజ్, గ్రేస్ తగ్గిందంటున్నారు. బాలయ్య ఫ్యాన్స్ ఇదే అదనుగా భావించి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. Mega Nandamuri Fans War.
ఓ నెటిజన్ చిరంజీవి(ఆచార్య)(Acharya), బాలకృష్ణ(అఖండ)(Akhnda) ఇద్దరి ఎవరు `బెస్ట్ మాస్ యాక్టరో` చెప్పండంటూ పోస్ట్ పెట్టగా, ఒకరిపై ఒకరు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. పోలికలతో మరింత అగ్గిరాజేస్తున్నారు. చిరంజీవికి హిట్, ఫ్లాఫ్‌లతో సంబంధం లేదని, ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకి గర్వకారణమని మెగా ఫ్యాన్స్ అంటుంటే, మరి సీనియర్ ఎన్టీఆర్ ఏంటన్నట్టు అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. మరోవైపు అభిమానాన్ని తాకట్టు పెట్టేవారితో బాలయ్యకి పోటీ ఏంటి అంటూ నందమూరి ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. చిరంజీవితో పోలిక అంటేనే బాలయ్య నథింగ్ అని మెగా ఫ్యాన్స్ దూకుడుపెంచారు.
ఎప్పటికీ బెస్ట్ మాస్ హీరో చిరంజీవి అని, ఒక్క సినిమాకి నెగటివ్ రివ్యూలు ఆయన స్టార్‌డమ్‌పై ఎలాంటి ప్రభావాన్నిచూపబోవని చెబుతున్నారు. ఎన్బీకేది ఫేక్ స్టార్‌డమ్ అని, ఆయన డబ్బులు పెట్టి సినిమాలు ఆడిపించుకుంటారని ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు మెగా ఫ్యాన్స్. మొన్న రామ్‌చరణ్‌పై పడి ఏడ్చారు, ఇప్పుడు చిరంజీవిపై పడ్డారు. వీరికి ఇదే పని తప్ప మరేది లేదంటూ గట్టిగా కౌంటర్లిస్తున్నారు. `ఆచార్య`లో చిరంజీవి గ్రాఫిక్స్ ని చూపించి ఆడుకుంటున్నారు బాలయ్య అభిమానులు. ఇలా ఎవరూ తగ్గడం లేదు. కామెంట్లకి కౌంటర్లిస్తూ నెట్టింట దుమారం రేపుతున్నారు. ఫ్యాన్స్ వార్ ఇప్పుడు సామాజిక మాధ్యమాలను ఊపేస్తుంది.
ఇదిలా ఉంటే వాళ్లు వాళ్లు బాగానే ఉన్నారు. సినిమాలు చూసేవాళ్లు చూస్తున్నారు మధ్యలో వీరి గొడవేంటి? అంటూ కౌంటర్లిస్తున్నారు. ఇలా పిచ్చివాదనలు పోయి టైమ్ వేసుకోకుండా ఏదైనా మంచి పనులు చేయండి అంటూ ఉచిత సలహాలిస్తున్నారు. అంతేకాదు తెలుగు సినిమా పాన్ ఇండియా లెవల్‌లో సత్తా చాటుతుంది. ఈ విషయంలో హీరోలు ఒకరికొకరు ఆదర్శంగా నిలుస్తుంది. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ టైమ్‌లో మీ గోలేంటి? అంటూ ఇద్దరు హీరోల అభిమానులకు ఘాటుగానే కౌంటర్లిస్తున్నారు న్యూట్రల్ నెటిజన్లు.
చిరంజీవి నటించి `ఆచార్య` చిత్రంలో రామ్‌చరణ్ కీలక పాత్రలో నటించారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరోవైపు బాలయ్య చివరగా `అఖండ` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చారు. డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ అయ్యింది. బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.