- Home
- Entertainment
- హీరోయిన్ కావాలంటే కాంప్రమైజ్ కావాల్సిందేనా... సీనియర్ హీరోయిన్స్ కి బాలయ్య షాకింగ్ ప్రశ్న, మరి ఆన్సర్?
హీరోయిన్ కావాలంటే కాంప్రమైజ్ కావాల్సిందేనా... సీనియర్ హీరోయిన్స్ కి బాలయ్య షాకింగ్ ప్రశ్న, మరి ఆన్సర్?
అన్ స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ గెస్ట్స్ గా సీనియర్ హీరోయిన్స్ జయప్రద, జయసుధ వచ్చారు. వీరితో నటి తరం తార రాశి ఖన్నా జాయిన్ అయ్యారు. అయితే వీరిని బాలకృష్ణ అడిగిన ఒక బోల్డ్ క్వశ్చన్ అడిగారు....

Balakrishna Unstoppable show
బాలకృష్ణ(Balakrishna) సారథ్యంలో అన్ స్టాపబుల్ షో విజయపథంలో దూసుకుపోతుంది. క్రేజీ గెస్ట్స్ ని తన షోకి ఇవ్వైట్ చేస్తున్న బాలకృష్ణ ఆసక్తికర చర్చకు తెరలేపుతున్నారు. సరదా సంభాషణలతో పలు కాంట్రవర్సీ టాపిక్స్ తెరపైకి తెస్తున్నాడు. తాజా ఎపిసోడ్ కోసం సీనియర్ హీరోయిన్స్ జయసుధ, జయప్రద వచ్చారు. వీరితో రాశి ఖన్నా జాయిన్ అయ్యారు.
Balakrishna Unstoppable show
రాశి ఖన్నా(Raasi Khanna)ను బాలకృష్ణ నువ్వు నటించిన హీరోలలో నీ క్రష్ ఎవరని అడిగారు. దానికి విజయ్ దేవరకొండ అని సమాధానం చెప్పింది రాశి. విజయ్ దేవరకొండ-రాశి కాంబినేషన్ లో వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ-రాశి మధ్య శృంగార సన్నివేశాలు బోల్డ్ గా ఉంటాయి.
Balakrishna Unstoppable show
అలనాటి తారలను సైతం ఆయన కొన్ని క్రేజీ ప్రశ్నలు అడిగారు. నేను ప్రశ్న అడుగుతాను. మీరు ఎస్ ఆర్ నో బోర్డు చూపిస్తే సరిపోతుందని చెప్పిన బాలయ్య... హీరోయిన్ కావాలంటే పరిశ్రమలో కాంప్రమైజ్ కావాలా? అని అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి రాశి, జయసుధ, జయప్రద సంశయించారు.
Balakrishna Unstoppable show
కాంప్రమైజ్ అంటే అనేక అర్థాలు వస్తాయి. నచ్చకపోయినా పొట్టిబట్టలు వేసుకోవడం, శృంగార సన్నివేశాల్లో నటించడం, సాహసాలు చేయడంతో పాటు కమిట్మెంట్ వంటి క్యాస్టింగ్ కౌచ్ కూడా వస్తుంది. అందుకే ఆ ప్రశ్నకు ఎలా స్పందించాలో వారికి అర్థం కాలేదు.
Balakrishna Unstoppable show
వారు ఏం సమాధానం చెప్పినా పరిశ్రమలో రాణించాలంటే ప్రతి ఒక్కరు కాంప్రమైజ్ కావాలి. అది ఏ స్థాయిలో అనేది వారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. స్టార్ హీరోయిన్ గా ఎదిగే వరకు కాంప్రమైజ్ కాక తప్పదు. మనకంటూ ఒక గుర్తింపు, డిమాండ్ వచ్చాక స్వేచ్ఛ ఉంటుంది. అప్పుడు పొట్టి బట్టలు వేసుకోను, అభ్యంతరకరమైన సన్నివేశాల్లో నటించను లాంటి పరిమితులు విధించవచ్చు.
Balakrishna Unstoppable show
ఇక 70-80లలో సౌత్ ఇండియాను ఏలిన జయసుధ, జయప్రదలు పాల్గొన్న అన్ స్టాపబుల్(Unstoppable) ఎపిసోడ్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ వంటి టాప్ స్టార్స్ తో ఈ తారలు పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు.