- Home
- Entertainment
- Akhanda 2 OTT Release : అఖండ 2 ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? బాలయ్య సినిమా ఎక్కడ చూడొచ్చంటే?
Akhanda 2 OTT Release : అఖండ 2 ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? బాలయ్య సినిమా ఎక్కడ చూడొచ్చంటే?
Akhanda 2 OTT: నందమూరి నటసింహం బాలయ్య నట విశ్వరూపం చూపించిన సినిమా అఖండ2. ఎన్నో అవాంతరాలు దాటుకుని థియేటర్ లో రిలీజ్ అయిన ఈసినిమా, ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఇంతకీ ఈ మూవీని ఎప్పుడు.. ఎక్కడ చూడొచ్చంటే?

బాలయ్య నటవిశ్వరూపం..
నందమూరి బాలకృష్ణ హీరోగా, మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి తెరకెక్కించిన సినిమా అఖండ 2 తాండవం. బాలయ్య బోయపాటి కాంబినేషన్ కు మంచి డిమాండ్ ఉంది. వీరిద్దరు సినిమా చేస్తే అది హిట్ అవుతుందన్న నమ్మకం కూడా ఉంటుంది. మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరొందిన బోయపాటి.. ఇతర హీరోలతో సినిమా చేస్తే గ్యారెంటీ ఉంటుందో లేదో తెలియదు కానీ.. బాలకృష్ణతో సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన నాలుగో సినిమా ఇది. ఇక సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించిన అఖండ2 డిసెంబర్ 12న థియేటర్లలోకి వచ్చి పర్వాలేదనిపించింది.
బాలకృష్ణ సినిమాపై రకరకాల రివ్యూలు..
డిసెంబర్ 5నే రిలీజ్ కావలసిన ఈసినిమాకు కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. దాంతో వాటిని దాటుకుని.. పాన్ ఇండియా స్థాయిలో అఖండ 2 తాండవం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమాపై ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇది బాలయ్య అభిమానులకు మాత్రమే నచ్చుతుంది.. సగటు ప్రేక్షకుడికి నచ్చదన్న కామెంట్లు వినిపించాయి. కానీ రాను రాను ఈసినిమాపై టాక్ మారుతూ వచ్చింది. బాలకృష్ణ నటన, బోయపాటి ప్రెజెంటేషన్, ఆధ్యాత్మిక అంశాలు పలువురు ప్రేక్షకులను ఆకర్షించాయి.
అఖండ2 సినిమా కలెక్షన్లు..
మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ అఖండ 2 తాండవం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పరంగా పర్వాలేదు అనిపించింది. రిలీజ్ అయిన 22 రోజులకుగానూ ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా సుమారు 121కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 95కోట్ల వసూళ్లని రాబట్టింది. ఇతర స్టేట్స్ లో ఏడు కోట్లు , ఓవర్సీస్ లో 5 కోట్లు రాబట్టింది. ఈ లెక్కన ఈ మూవీ దాదాపు ఇప్పటి వరకూ..70కోట్ల షేర్‌ని రాబట్టింది.
అఖండ2 ఓటీటీ రిలీజ్ ఎప్పుడు ఎక్కడ?
ఇక తాజాగా అఖండ 2 ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ముందు నుంచి అనుకున్నట్టుగానే.. జనవరి 9 నుంచి అఖండ 2 తాండవం సినిమాను నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలో వస్తుందని సమాచారం. ఇక ఓటీటీ లో ఈ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అఖండ 2 స్టార్ కాస్ట్ ?
అఖండ 2 సినిమాలో బాలకృష్ణ అఘోరాగా అద్భుతమైన నటన చూపించాడు. పవర్ ఫుల్ యాక్టింగ్ , యాక్షన్ సీన్స్ తో దడదడలాడించాడు. బాలయ్యకు తోడు తమన్ సంగీతం.. అభిమానులు పూనకాలతో ఊగిపోయేలా చేసింది. ఈ సీక్వెల్‌లో విలన్ గా ఆది పినిశెట్టి అతీంద్రియ శక్తులున్న ఒక రహస్యమైన వ్యక్తిగా నటించి మెప్పించాడు. అఖండ 2 సినిమాలో సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్రా, కబీర్ దుహాన్ సింగ్, శాశ్వత ఛటర్జీ లాంటి స్టార్స్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించారు.
డబుల్ హ్యాట్రిక్ దిశగా బాలయ్య..
65 ఏళ్ల వయసులో కూడా బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఇప్పటికే హాట్రిక్ హిట్ కొట్టిన బాలయ్య..అఖండ2తో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇంకొక్క హిట్ సినిమా పడితే బాలకృష్ణ డబుల్ హ్యాట్రిక్ సక్సెస్ ను సాధించవచ్చు. త్వరలో మలినేని గోపీచంద్ తో తెరకెక్కించబోయే సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఈ సినిమాలో బాలయ్య యోధుడిలా కనిపించబోతునట్టు తెలుస్తోంది. నయనతార హీరోయిన్ గా నటిస్తుందని టాక్.

