- Home
- Entertainment
- విలన్‌గా బాలకృష్ణ, ముగ్గురు `కృష్ణ`లు కలిసి సాహసం.. సొంత డబ్బులు పెడితే టీ ఖర్చులు కూడా రాలే, ఆ మూవీ ఏంటో తెలుసా?
విలన్‌గా బాలకృష్ణ, ముగ్గురు `కృష్ణ`లు కలిసి సాహసం.. సొంత డబ్బులు పెడితే టీ ఖర్చులు కూడా రాలే, ఆ మూవీ ఏంటో తెలుసా?
నేడు బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న బాలయ్య సినిమాలకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ముగ్గురు `కృష్ణ`లు కలిసి చేస్తే టీ డబ్బులు కూడా రాలేదట.
- FB
- TW
- Linkdin
Follow Us
)
యాక్షన్ సినిమాలతో రాణిస్తున్న బాలకృష్ణ
బాలకృష్ణ తన కెరీర్లో చాలా సాహసాలు చేశారు. కమర్షియల్ హీరోగా యాక్షన్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిన బాలయ్య పౌరాణికాలతోనే కెరీర్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత ఫ్యామిలీ చిత్రాలు చేశారు. అట్నుంచి యాక్షన్ సినిమాల వైపు టర్న్ తీసుకున్నారు. తెలుగులో ఫ్యాక్షన్ చిత్రాలతో సక్సెస్ అయిన హీరోగా నిలిచారు. ఇప్పటికీ యాక్షన్ సినిమాలతోనే రాణిస్తున్నారు. తిరుగులేని స్టార్‌గా వెలుగుతున్నారు.
ముగ్గురు `కృష్ణ`లు కలిసి చేసిన చిత్రం `సుల్తాన్`
బాలకృష్ణ తన కెరీర్‌లో ఓ మూవీని బాగా నమ్మి చేశారు. అంతేకాదు నిర్మాణంలోనూ భాగమయ్యారు. ఓ రకంగా తాను సినిమాలో డబ్బులు పెట్టడం అదే ఫస్ట్. మరోవైపు ఇందులో ముగ్గురు `కృష్ణ`లు నటించారు. బాలకృష్ణతోపాటు సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా హీరోలుగా నటించారు. బాలయ్య రెండు పాత్రలు పోషించారు. ఆ సినిమానే `సుల్తాన్.
కృష్ణ, కృష్ణంరాజులతో బాలకృష్ణ చేసిన సాహసం `సల్తాన్`
`సమరసింహారెడ్డి` వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత బాలయ్య నుంచి వచ్చిన మూవీ ఇది. అందుకే బాలకృష్ణ ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ చిత్రానికి శరత్ దర్శకత్వం వహించారు. ఎంఆర్‌వీ ప్రసాద్ నిర్మాత. నిర్మాతనే ఈ చిత్రానికి కథ అందించారు. ఇందులో కృష్ణ పోలీస్ ఆఫీసర్‌గా, కృష్ణంరాజు సీబీఐ ఆఫీసర్‌గా, బాలయ్య సుల్తాన్‌గా, పోలీస్ ఆఫీసర్‌గా నటించారు.
బాలకృష్ణ సమర్పకులుగా మారిన చేసిన సినిమా
ఈ మూవీని బాలకృష్ణ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిర్మాణంలో రాజీపడలేదు. నిర్మాతకు ఇబ్బంది అయితే తానే సొంతంగా డబ్బులు పెట్టాడు. సమర్పకులుగా వ్యవహరించారు. ఓరకంగా బాలయ్య నిర్మాతగా మారిన తొలి చిత్రమిది అని చెప్పొచ్చు. బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా దీన్ని రూపొందించారు. అండమాన్ దీవుల్లో ముగ్గురు కృష్ణలపై ఓ సాంగ్‌ని కూడా చేశారు. సినిమాని వేరే రేంజ్‌లో రూపొందించారు.
తొలి ఆట నుండే `సుల్తాన్`కి డిజాస్టర్ టాక్
1999లో మే 27న ఈ చిత్రం విడుదలైంది. అందరిని నిరాశపరిచింది. ముఖ్యంగా బాలయ్య చాలా డిజప్పాయింట్ అయ్యారు. అయితే ఈమూవీ ఆడకపోవడానికి కారణం, మొదట అనుకున్న కథ వేరు.
కృష్ణ, కృష్ణంరాజులు ఎంట్రీతో కథలో మార్పులు చేశారు పరుచూరి బ్రదర్స్. దీంతో కథ డైల్యూట్ అయ్యింది. మరోవైపు క్లైమాక్స్ లో కృష్ణంరాజు చనిపోవడం ఫ్యాన్స్ కి రుచించలేదు. దీన్ని రెబల్ స్టార్ ఫ్యాన్స్ తీసుకోలేకపోయారు.
`సుల్తాన్` ఆడకపోవడానికి కారణాలివే
`సుల్తాన్` మూవీని బాలయ్య ఫ్యాన్స్ కూడా రిసీవ్ చేసుకోలేకపోయారు. కారణం ఆయన విలన్‌గా నటించడం. ఇందులో ఆయనది ద్విపాత్రాభినయం. ఒక పాత్రలో పోలీస్ ఆఫీసర్‌గా, మరో పాత్రలో విలన్ సుల్తాన్‌గా నటించారు. బాలయ్యని విలన్‌గా చూడలేకపోయారు ఫ్యాన్స్.
ఇదేకాదు, దీనికంటే ముందు `సమరసింహారెడ్డి` వంటి తుఫాన్ వచ్చింది. అది పెద్ద హిట్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి, కానీ సినిమా ఆ స్థాయిలో లేకపోవడంతో ఫ్యాన్స్, ఆడియెన్స్ డిజప్పాయింట్ అయ్యారు. దీంతో ఇది అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
బాలయ్య 11 గెటప్పుల్లో సర్‌ప్రైజ్
అయితే ఇందులో సర్‌ప్రైజ్ ఏంటంటే బాలయ్య ఏకంగా 11 గెటప్పుల్లో కనిపించడం. సుల్తాన్‌గా డిఫరెంట్ గెటప్పుల్లో కనిపించినా, ఫ్యాన్స్ పట్టించుకోలేదు. నేడు బాలకృష్ణ 65వ పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఇక ప్రస్తుతం బాలయ్య `అఖండ 2`లో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. సోమవారం విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాచేయబోతున్నారు బాలయ్య.