నాపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. బలగం హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్.. ఆవేదన ..?
ఇలా ఫేమస్ అవుతుందో లేదో.. అలా పుకార్లు పుట్టుకొస్తున్నాయి కావ్య కల్యాణ్ రామ్ మీద. బలగం సినిమాతో బాగా ఫేమస్ అయిన ఈ హీరోయిన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అందరికి సుపరిచితమే.

Kavya Kalyanram
చైల్డ్ ఆర్టిస్టుగా వెండితెరకి పరిచయమయ్యింది కావ్య కళ్యాణ్ రామ్ .. ఆ తరువాత హీరోయిన్ గాను ఎంట్రీ ఇచ్చి.. ఒక్క సినిమాతో క్లిక్ అయ్యింది. కావ్య కల్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్టుగా.. గంగోత్రి .. ఠాగూర్.. అడవిరాముడు లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. మొదలైన సినిమాలలో నటించి మెప్పించింది.
Kavya Kalyanram
అయితే కావ్య కళ్యాణ్ రామ్ 'మాసూద' సినిమాతో హీరోయిన్ గా ..ఎంట్రీ ఇచ్చింది. అయితే 'మసూద' సినిమా హారర్ థ్రిల్లర్ కావడంతో, కావ్య పాత్రను గురించి ఎవరూ కూడా అంతగా పట్టించుకోలేదు. ఇక ఆ తరువాత వచ్చిన 'బలగం' సినిమా మాత్రం ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈసినిమాతో హీరోయిన్ మెటీరియల్ అని నిరూపించుకుంది కావ్య.
Kavya Kalyanram
ఇక ఇప్పుడు కావ్య కోసం వరుసగా అవకాశాలు గుమ్మం ముందుకు వచ్చిచేరుతున్నాయి. ఆమె లిస్ట్ లో ఓ నాలుగైదు సినిమాలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కావ్య హీరోయిన్ గా ఫేమస్ అవుతున్న క్రమంలో.. ఆమెపై రకరకాల రూమర్స్ వస్తున్నాయి. ఆ రూమర్స్ పై కావ్య రీసెంట్ గా స్పందించింది.
తనపై బాడీ షేమింగ్ కామెంట్స్ వచ్చినట్టు.. నువ్వు బాగా లావుగా ఉన్నావు.. హీరోయిన్ గా పినికిరావు అని.. డైరెక్టర్ లు ఆమెను నిరుత్సాహ పరిచినట్టు... ఆ విషయంలో కొంతమంది డైరెక్టర్స్ ధోరణి తనని చాలా బాధపెట్టిందని కావ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా రీసెంటుగా ఒక పుకారు షికారు చేసింది.
ఇలాంటి పుకార్లు రావడంతో.. తాజాగా ఈ విషయంపై స్పందించింది కావ్య కళ్యాణ్ రామ్. ఆమె స్పందిస్తూ .. తన విషయంలో ఏ డైరెక్టరూ ఎప్పుడూ అలా మాట్లాడలేదనీ, అసలు ఆ విషయాన్ని గురించి తాను ఎక్కడా ప్రస్తావించలేదని కావ్య చెప్పుకొచ్చింది. ఇలాంటి అనవసరమైన ప్రచారాలు మానుకోవడం మంచిదంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చింది.