బలగం బ్యూటీ బోల్డ్ కామెంట్స్.. దేనికైనా రెడీ అంటున్న కావ్య కళ్యాణ్...
తన కెరీర్ గురించి బోల్డ్ కామెంట్స్ చేసింది బలగం హీరోయిన్ కావ్య కళ్యాణ్. డబ్బిస్తే చాలు.. దేనికైనా రెడీ అంటోంది బ్యూటీ. ఇంతకీ ఆమె ఏమంటుందంటే..?

టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించింది కావ్య కళ్యాణ్. స్టార్ హీరోల సినిమాల్లో బాలనటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా గంగోత్రీ, ఠాగూర్, బన్ని లాంటిసినిమాల్లో కనిపించిన కావ్య.. ఆతరువాత వెండితెరకు గ్యాప్ ఇచ్చింది. ఇక ఆమధ్య హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కావ్య కల్యాణ్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది.
2022లో వచ్చిన ఉస్తాద్ సినిమాతో హీరోయిన్‌గా మారింది బాలనటి. మసూద, బలగం, తాజాగా పరేషాన్ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాల్లో లీడ్ రోల్స్ చేశారు.మరీ ముఖ్యంగా బలగం సినిమాతో కావ్యకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా రెండు తెలుగురాష్ట్రాలను కదిలించింది. దాంతో కావ్య కూడా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీబిజీ అయిపోయింది కావ్య. అయితే ప్రస్తుతం వరుస ఆఫర్లు వస్తుండటంతో.. ఆమె కమర్షియల్ హీరోయిన్ గా చేయడానికి రెడీ అయిపోయింది. ఈ క్రమంలో ఆమె చేసిన కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమాల్లో తాను నటించే విషయంలో చాలా బోల్డ్ కామెంట్స్ చేసింది బలగం బ్యూటీ..
Kavya Kalyanram
కావ్య మాట్లాడుతూ.. డబ్బులు ఎక్కువ ఇస్తే చాలు ఎలాంటి సీన్లలో నటించడానికైనా తాను సిద్ధంగా ఉన్నట్ట ఆమె స్పష్టం చేశారు. తాజాగా, కావ్య మీడియాతో మాట్లాడుతూ.. మంచి నటిగా నిరూపించుకోవాలంటే అన్ని రకాల సీన్లలో నటించాలని ఆమె అన్నారు. అలా నటించగలిగినప్పుడే సంపూర్ణ నటిగా తనకు గుర్తింపు వస్తుందని కావ్య అన్నారు.
ఇండస్ట్రీలో లిప్‌లాక్ సీన్స్, బెడ్ సీన్ల కోసం హీరోయిన్లు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని.. తాను కూడా మంచి కథ ఉంటే అలాంటి సీన్లలో నటించడానికి వెనకాడనన్నారు. అయితే పెద్ద హీరోయిన్ల మాదిరి అలాంటి సీన్లలో నటించడానికి మాత్రం ఎక్కువ డబ్బు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ బోల్డ్ కామెంట్లపై సోషల్ మీడియాలో ఒకరకంగా రచ్చ మొదలైంది. నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కావ్య హద్దులు దాటి మాట్లాడుతోందని కొందరు అంటుంటే.. ఆమె చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని మరికొంత మంది సపోర్టు చేస్తున్నారు.