బాహుబలి 2 రికార్డు పుష్ప 2 బ్రేక్ చేస్తుందా? ఇంకెన్ని కోట్లు కావాలంటే?
ఏకంగా బాహుబలి 2 రికార్డు పై కన్నేశాడు అల్లు అర్జున్. పుష్ప 2 తో అత్యధిక వసూళ్ల రికార్డును బద్దలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
పుష్ప 2 సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. విడుదలకు ముందే పుష్ప 2 ప్రభంజనం మొదలైంది. రూ. 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సరికొత్త రికార్డు నమోదు చేసింది. థియేట్రికల్ రైట్స్ రూ. 600 కోట్లకు పైగా అమ్ముడుపోయాయి. థియేటర్స్ లోకి రాకముందే పుష్ప 2 మూవీ నిర్మాతలకు లాభాలు పంచింది. ఇక ప్రాఫిట్స్ లో షేర్ తీసుకున్న అల్లు అర్జున్... రూ. 300 కోట్ల వరకు రెమ్యూనరేషన్ రూపంలో ఆర్జించాడని టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.
కాగా మరో మూడు వందల కోట్ల వసూళ్లు రాబడితే పుష్ప 2 ఏకంగా బాహుబలి 2 రికార్డుని సైతం అధిగమిస్తుంది. 2017లో విడుదలైన బాహుబలి 2 వరల్డ్ వైడ్ రూ. 1810 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. పుష్ప 2 విడుదలై 15 రోజులు అవుతుంది. ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 1500 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. హిందీ వెర్షన్ రూ. 600 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడేస్ పుష్ప 2 చిత్ర వసూళ్లను పెంచే సూచనలు కలవు.
అలాగే బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 చిత్రానికి పెద్దగా పోటీలేదు. బచ్చల మల్లి, ముఫాసా, యూ ఐ చిత్రాలకు అంతగా హైప్ లేదు. పాజిటివ్ టాక్ వస్తే మాత్రమే ఆ చిత్రాలను ప్రేక్షకులు పట్టించుకుంటారు. బాలీవుడ్ లో కూడా అదే పరిస్థితి నెలకొంది. డిసెంబర్ 25న విడుదలయ్యే బేబీ జాన్ మాత్రమే చెప్పుకోదగ్గ రిలీజ్. నార్త్ లో పుష్ప 2 మూవీ వసూళ్లు నిలకడగా ఉన్నాయి.
Bahubali 2
కాబట్టి పుష్ప 2 ఎనిమిదేళ్ల క్రితం బాహుబలి 2 నెలకొల్పిన అత్యధిక వసూళ్ల రికార్డు బ్రేక్ చేయడం సాధ్యమే అంటున్నారు. కాగా దంగల్ మూవీ రూ. 2000 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ వసూళ్లతో అగ్రస్థానంలో ఉంది. డొమెస్టిక్ గా బాహుబలి 2, పుష్ప 2 మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. బాహుబలి 2 హిందీ వెర్షన్ రికార్డును పుష్ప 2 పదకొండు రోజుల్లో దాటేసింది. నార్త్ లో కొన్ని ఏరియాల్లో పుష్ప 2 థియేటర్స్ ఎదుట హౌస్ ఫుల్ బోర్డ్స్, క్యూ లైన్లు కనిపిస్తున్నాయి.
Pushpa 2
మూడో వీకెండ్ లో కూడా పుష్ప 2 వసూళ్ళు నిలకడగా ఉన్న నేపథ్యంలో.. డిజిటల్ స్ట్రీమింగ్ ఆలస్యం అవుతుందని ప్రేక్షకులు భావించారు. కాగా థియేట్రికల్ రన్ తో సంబంధం లేకుండా పుష్ప 2 డిజిటల్ స్ట్రీమింగ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయట. పుష్ప 2 డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ రికార్డు ధరకు సొంతం చేసుకుంది. జనవరి 9 లేదా 10వ తేదీన పుష్ప 2 ఓటీటీలో విడుదల చేస్తున్నారంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.
హిందీ వెర్షన్ ఆలస్యం కావచ్చు. సౌత్ లాంగ్వేజెస్ లో అందుబాటులోకి తెస్తారు అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ క్రేజీ సీక్వెల్... డిసెంబర్ 5న విడుదలైంది.