- Home
- Entertainment
- బిగ్ బాస్ తెలుగు 8 లవర్స్ కి బ్యాడ్ న్యూస్, మేకర్స్ కి ఊహించని సమస్య... ఇకపై షో ఎంజాయ్ చేయలేమా?
బిగ్ బాస్ తెలుగు 8 లవర్స్ కి బ్యాడ్ న్యూస్, మేకర్స్ కి ఊహించని సమస్య... ఇకపై షో ఎంజాయ్ చేయలేమా?
బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రారంభం కానుంది. కొంత మేరకు కంటెస్టెంట్స్ ఎంపిక కూడా పూర్తి అయ్యింది. అయితే మేకర్స్ కి అనుకోని సమస్య ఎదురైందట. ప్రేక్షకులు ఒకప్పటి థ్రిల్ మిస్ అయ్యే ఛాన్స్ కలదు.

Bigg Boss Telugu
బిగ్ బాస్ సీజన్ 8కి రంగం సిద్ధం అవుతుంది. వరుసగా ఏడు సీజన్స్ సక్సెస్ ఫుల్ గా ఈ రియాలిటీ షో పూర్తి చేసుకుంది. 2017లో సీజన్ వన్ ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. ఫస్ట్ సీజన్లో టాప్ సెలెబ్స్ పాల్గొనడం విశేషం. దాదాపు అందరూ వెండితెర సెలెబ్స్ భాగమయ్యారు. శివ బాలాజీ, జ్యోతి, అర్చన, నవదీప్, సంపూర్ణేష్ బాబు, మొమైత్ ఖాన్, ధన్ రాజ్, సమీర్, సింగర్స్ కల్పన, మధుప్రియ... ఇలా అందరూ తెలిసిన ముఖాలే.
Bigg Boss Telugu
ఇక సీజన్ 2లో కూడా సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన సెలెబ్స్ కంటెస్టెంట్స్ గా ఎంపికయ్యారు. నాని హోస్టింగ్ చేసిన ఈ సీజన్లో కౌశల్, సింగర్ గీతా మాధురి, తనీష్, దీప్తి సునైన, కిరీటి, యాంకర్ శ్యామల, తేజస్వి మాదివాడ వంటి టాప్ సెలెబ్స్ కంటెస్టెంట్స్ గా పోటీ పడ్డారు. గీతా మాధురిని ఓడించి ఫైనల్ లో కౌశల్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.
Bigg Boss Telugu
సీజన్ 3కి కూడా బడా కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చారు. నటి హేమ, బాబా భాస్కర్, శ్రీముఖి, సింగర్ రాహుల్, నటి హిమజ, పునర్నవి, వరుణ్ సందేశ్-వితిక షేరు, అషురెడ్డి, అలీ రెజా, జర్నలిస్ట్ జాఫర్... బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టారు. కానీ సీజన్ 4 నుండి సీన్ మారిపోయింది. అందుకు కరోనా కారణం అయ్యింది.
Bigg Boss Telugu
2020లో కరోనా విజృంభించింది. ప్రపంచం స్తంభించిపోయింది. అయినప్పటికీ బిగ్ బాస్ షో ఆగలేదు. అయితే కఠిన నిబంధనలు పెట్టారు. ఎంపికైన కంటెస్టెంట్స్ కొన్ని వారాల పాటు కొరెంటైన్ చేయాలి. అనంతరం పరీక్షలు జరిపి కరోనా లేకుంటే బిగ్ బాస్ హౌస్లోకి పంపుతారు. ఈ నిబంధనలకు టాప్ సెలెబ్స్ ఒప్పుకోలేదు. బిగ్ బాస్ షోకి వచ్చేందుకు ఆసక్తి చూపలేదు.
సీజన్ 4లో ఒకరిద్దరు తప్పితే అందరూ పెద్దగా పరిచయం లేని కంటెస్టెంట్స్. అభిజీత్, మోనాల్ గజ్జర్, అమ్మ రాజశేఖర్, యాంకర్ లాస్య, కరాటే కళ్యాణి వంటి కొందరు మాత్రమే పేరున్న సెలెబ్స్ హౌస్లోకి వెళ్లారు. తర్వాత అరియనా, దివి, సోహెల్, అఖిల్ సార్థక్ లాంటి వారు ఫేమస్ అయ్యాడు. కాగా సీజన్స్ గడిచే కొద్దీ పేరున్న నటులు బిగ్ బాస్ హౌస్లోకి రావడం తగ్గిపోయింది.
Bigg Boss Telugu 7
బుల్లితెర, సోషల్ మీడియా స్టార్స్ తో లాగించేస్తున్నారు. కొద్దిరోజులు కొత్తగా ఉన్న ముఖాలు రెండు మూడు వారాల్లో ఫేమస్ అవుతున్నారు. అభిమానులు ఏర్పడుతున్నారు. షో నడిచిపోతుందని మేకర్స్ కూడా భావిస్తున్నారు. కానీ వెండితెర మీద పాప్యులర్ అయిన నటులు పాల్గొంటే వచ్చే కిక్కే వేరు.
Bigg Boss Telugu 7
అయితే బిగ్ బాస్ షోకి రావాలని ఆసక్తి చూపే సెలెబ్స్ సంఖ్య అంతకంతకు తగ్గిపోతుందని సమాచారం. కారణం ఈ షో వలన మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందనే సందేశం పరిశ్రమలోకి వెళ్ళింది. ప్రాక్టికల్ గా చూసిన అది నిజం అనిపిస్తుంది. వెండితెరపై వివిధ పాత్రల్లో నటులను చూసి వారి మీద ప్రేక్షకులు ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటారు. బిగ్ బాస్ హౌస్లో వాళ్ళ ప్రవర్తన చూశాకా ఒపీనియన్ మారిపోతుంది.
Bigg Boss Telugu
పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ గా ఈ షో సెలెబ్స్ ని ప్రొజెక్ట్ చేస్తుందనే వాదన ఉంది. బిగ్ బాస్ హౌస్లో సెలెబ్స్ బిహేవియర్ చూశాక ప్రేక్షకులు వారిని ఆదరించడం లేదట. అందుకే దర్శక నిర్మాతలు కూడా వారిని పక్కన పెట్టేస్తున్నారట. గత ఏడు సీజన్స్ టైటిల్స్ గెలిచిన విన్నర్స్ పరిస్థితి ఏమిటో ఆదరికీ తెలిసిందే. సీజన్ 7లో పాల్గొన్న శోభా శెట్టి అత్యంత నెగిటివిటి మూటగట్టుకుంది. ఆమెకు సీరియల్స్ లో ఆఫర్స్ రావడం లేదు.
Shobha shetty
డబ్బుల కోసం ఆశపడి బిగ్ బాస్ షోకి వెళితే.. అసలుకే మోసం వస్తుంది. లాంగ్ టర్మ్ కెరీర్ మీద దుష్ప్రభావం చూపుతుందని భావిస్తున్న పేరున్న నటులు బిగ్ బాస్ షోకి రామంటున్నారట. బుల్లితెర, సోషల్ మీడియా సెలెబ్స్ మాత్రమే బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్ చేసే అవకాశం కలదట. వెండితెర సెలెబ్స్ హౌస్ కి వచ్చేందుకు ససేమిరా అంటున్నారట.
బిగ్ బాస్ 8కి సెలెబ్స్ కొరత ఏర్పడిందట. ఈ క్రమంలో గతంలో మాదిరి ప్రేక్షకులు తమ ఫెవరేట్ నటుల గేమ్, ప్రవర్తన బిగ్ బాస్ హౌస్ లో చూసే ఛాన్స్ ఉండదని అంటున్నారు. ఇది నిజంగా నిరాశపరిచి అంశమే. కాగా సీజన్ 8లో బర్రెలక్క, నటి హేమ, కుమారీ ఆంటీ, బంచిక్ బబ్లు, సురేఖావాణి, కిరాక్ ఆర్పీ, బుల్లెట్ భాస్కర్, అమృత ప్రణయ్, రీతు చౌదరి, విష్ణుప్రియ, అంబటి రాయుడు, వేణు స్వామితో పాటు మరికొందరు కంటెస్టెంట్స్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.