ఇలాంటి వాళ్ళు హీరోలా, బిగ్ బాస్ నుంచి నాగార్జునని ఎలిమినేట్ చేయాలి.. విరుచుకుపడ్డ బాబు గోగినేని
ఇటీవల నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ని తెలంగాణ ప్రభుత్వం కూల్చివేసింది. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, హేతువాది బాబు గోగినేని సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
సెప్టెంబర్ 1 నుంచి బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ప్రారంభం అవుతుండగా నాగార్జున వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 3 నుంచి నాగార్జున హోస్ట్ గా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ని తెలంగాణ ప్రభుత్వం కూల్చివేసింది. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఎన్ కన్వెన్షన్ ని చెరువుని ఆక్రమించి అక్రమంగా నిర్మించారనే ఆరోపణలతో తెలంగాణ ప్రభుత్వం కూల్చివేసింది. దీనిపై నాగార్జున హైకోర్టుని ఆశ్రయించారు. అయితే దీనిపై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, హేతువాది బాబు గోగినేని సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నాగార్జునని దుమ్మెత్తి పోస్తూ బాబు గోగినేని అటాక్ చేశారు. అక్రమ కట్టడాలు నిర్మించేవారు హీరోలా అంటూ విరుచుకుపడ్డారు.
ఎలిమినేట్ హిమ్, బిగ్ బాస్! అక్రమ కట్టడాల దారుణమైన ఆరోపణలు ఎదుర్కుంటున్న తమ షో హోస్ట్ ను తెలుగు షో నిర్వహకులు తక్షణమే మార్చాలి. లేదూ హౌస్ మేట్స్, టీవీ వీక్షకులు ఓట్లు వేసి మరీ ఎలిమినేట్ చేయాలి. ఇట్లు బిగ్గర్ బాస్ బాబు గోగినేని అంటూ నాగార్జునని ఉద్దేశించి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
బాబు గోగినేని అంతటితో ఆగలేదు. ఎన్ కన్వెన్షన్ గురించి నాగార్జునపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ డిటైల్డ్ గా మరో పోస్ట్ చేశారు. కబ్జా కోరులు అంటూ తీవ్రమైన పదజాలం ఉపయోగించారు. బ్జా కోరులు, అక్రమ కట్టడాలు నిర్మించే వారు హీరోలు కాదు, వారిని విలన్లుగా చూడాలి చెరువు యొక్క భూమిని, అంటే ప్రజలందరి భూమిని, అంటే మనందరి భూమిని, నిర్లజ్జగా కబ్జా చేసి, లేదూ సొంత స్థలమైనా ఇంకెవరి స్థలమైనా, ఎటువంటి భయం లేకుండా అక్కడ అక్రమంగా కట్టడాలు నిర్మించి, వర్షపు నీరు ఎక్కడికీ పారకుండా చేసిన వారికి శిక్ష ఏమిటి అని ప్రశ్నించారు.
ఉన్న స్టూడియో స్థలాలు చాలవన్నట్టు ఒక కుటుంబ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించుకుని ఇలాంటి అక్రమ కట్టడాలు నిర్మించుకున్నారు. దీని నుంచి లక్షలాది రూపాయలు అద్దె వసూలు చేస్తున్నారు. అక్రమ కట్టడాన్ని కూల్చడమే కాదు, చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆ కన్వెన్షన్ యజమానులకు శిక్ష కూడా పడాలి. ఈ అక్రమ కట్టడం కు అనుమతులు ఇచ్చిన అధికారులకు శిక్ష పడాలి అని బాబు గోగినేని డిమాండ్ చేశారు.
అక్కడ నిర్మాణాల అద్దెకు 2010 నుండి ఇప్పటివరకు వసూలు చేసిన అద్దెలు ప్రజలకు చెందినవి కాబట్టి వాటిని మున్సిపల్ కార్పొరేషన్ తిరిగి వసూలు చేసుకోవాలి. అవి చెల్లించే వరకు ఆ యాజమాన్యం యొక్క ఆస్తులు జప్తి చేసుకోవాలి. పనిలో పనిగా బిగ్ బాస్ హోస్టుగా ఇంకెవరైనా మర్యాదస్తులను నియమించుకోవాలి అని బాబు గోగినేని అన్నారు. బాబు గోగినేని బిగ్ బాస్ 2 లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. అయితే ఆ సీజన్ కి హోస్ట్ నాగార్జున కాదు. నేచురల్ స్టార్ నాని బిగ్ బాస్ 2ని హోస్ట్ చేశారు.