ప్రభాస్ ఫ్యాన్స్ కు బాహుబలి టీమ్ డబుల్ ట్రీట్, ఏం చేయబోతున్నారో తెలుసా?
తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన సినిమా బాహుబలి రిలీజ్ అయ్యి పదేళ్లు అవుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించిన ఈ పాన్ ఇండియా సినిమాను రీరిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది.

తెలుగు సినిమాను ప్రపంచ వ్యాప్తం చేసిన సినిమా బాహుబలి. ఈ సినిమాతో టాలీవుడ్ జాతకం మార్చేసిన డైరెక్టర్ రాజమౌళి. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి ఫ్రాంచైజ్ రెండు భాగాలుగా విడుదలై, ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమాలు రెండు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో మైలురాయిగా నిలిచాయి.
బాహుబలి సినిమా తరువాత టాలీవుడ్ పేరు మారు మోగిపోయింది. ఆతరువాత ఎన్ని పాన్ ఇండియా సినిమాలు వచ్చినా.. బాహుబలి పేరు మాత్రం అలా నిలిచిపోయింది. ఈ సినిమాల క్రేజ్ ఇప్పటికీ ఏంత తగ్గలేదు. ప్రస్తుతం రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తుండగా, బాహుబలి సినిమాల రీరిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో తాజాగా, ఈ బాహుబలి సినిమాలను అక్టోబర్ 2025లో థియేటర్లలో రీ రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ సినిమా ద్వారా భారీ ట్రీట్ ను ప్లాన్ చేశారు టీమ్. బాహుబలి ప్రత్యేకంగా, రెండు భాగాలను కలిపిన ట్రిమ్డ్ వెర్షన్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నిర్ణయం సినిమాను కొత్తగా అనుభవించాలనుకునే ప్రేక్షకులకు మరింత స్టఫ్ ను రెడీ చేస్తున్నారు బాహుబలి టీమ్.
ఈ రీరిలీజ్ ద్వారా, బాహుబలి ఫ్రాంచైజ్‌కు సంబంధించిన ప్రత్యేకతలు, విజువల్ ఎఫెక్ట్స్, కథా నిర్మాణం మరింత స్పష్టంగా ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి. మేకర్స్ ఈ ప్రత్యేక వెర్షన్‌ను థియేటర్లలో విడుదల చేయడం ద్వారా, బాహుబలి సినిమాలపై ఉన్న అభిమానాన్ని మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
బాహుబలి సినిమాల రీ రిలీజ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించబడతాయి. అందువల్ల, ఈ ప్రత్యేక వెర్షన్‌ను థియేటర్లలో చూడాలని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ట్రిమ్డ్ వర్షన్ బాహుబలి రిలీజ్ అయితే కలెక్షన్స్ పరంగా కూడా మరో రికార్డ్ బ్రేక్ అవ్వడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.