- Home
- Entertainment
- బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న బాహుబలి ది ఎపిక్.. వారంలో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న బాహుబలి ది ఎపిక్.. వారంలో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
భారీ అంచనాల మధ్య రీ-రిలీజైన బాహుబలి ది ఎపిక్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. వారం రోజుల్లో ప్రభాస్ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లు ఎన్నో తెలుసా?

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న బాహుబలి ది ఎపిక్
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాహుబలి అంతటి ప్రభావాన్ని చూపిన మరో సినిమా లేదు. సౌత్ సినిమాకు పాన్-ఇండియా మార్కెట్ డోర్స్ ను తెరిచింది ఈ మూవీ. సినిమా అంటే మాదే అని విర్రవీగుతున్న బాలీవుడ్, అక్కడి మేకర్స్ అతి విశ్వాసానికి గట్టి దెబ్బ కొట్టింది. ఇక రిలీజ్ అయ్యి పదేళ్లవుతున్నా.. రీ-రిలీజై రికార్డులు సృష్టిస్తోంది.
రెండు సినిమాలు కలిపి..
బాహుబలి రెండు భాగాలను కలిపి, రాజమౌళి పర్యవేక్షణలో రీ-ఎడిట్ చేసి 'బాహుబలి: ది ఎపిక్'గా రిలీజ్ చేశారు. నిడివి 3 గంటల 45 నిమిషాలు ఉన్నా, పాజిటివ్ రివ్యూలతో సినిమాకు మంచి ఆదరణ లభించింది. వరుసగా రెండు మూడు రోజులు థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి.
బాహుబలి వారం రోజుల కలెక్షన్స్
సాక్నిల్క్ రిపోర్ట్ ప్రకారం, ఇండియాలో 29.65 కోట్లు, విదేశాల్లో 11.75 కోట్లు వసూలు చేసింది బాహుబలి రీరిలీజ్ వెర్షన్ మూవీ. ప్రపంచవ్యాప్తంగా వారం రోజులకు గాను బాహుబలి ది ఎపిక్ మూవీ 45 కోట్లతో.. అత్యధిక వసూళ్లు సాధించిన రీ రిలీజ్ సినిమాగా నిలిచింది.
రికార్డు దిశగా ప్రభాస్ సినిమా
ఇండియాలో రీ రిలీజ్ సినిమాల్లో 'సనమ్ తేరీ కసమ్' .39 కోట్లు, ‘తుంబాడ్’ 37.5 కోట్లతో ముందు ఉండగా.. ఈ సినిమాల రికార్డులను ఈ వారాంతంలో బాహుబలి బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఇక ఇప్పటికీ బాహుబలి ది ఎపిక్ మూవీ థియేటర్లలో బాగా రన్ అవుతోంది.