- Home
- Entertainment
- Avika Gor : తన బాడీ అంటే అసహ్యమట.. కనీసం అద్దంలోనూ చూసుకోనంటూ అవికా గోర్ షాకింగ్ కామెంట్
Avika Gor : తన బాడీ అంటే అసహ్యమట.. కనీసం అద్దంలోనూ చూసుకోనంటూ అవికా గోర్ షాకింగ్ కామెంట్
`చిన్నారి పెళ్లి కూతురు`గా పాపులర్ అయిన అవికా గోర్ ఇప్పుడు హీరోయిన్‌గా రాణిస్తుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు తాజాగా తన బాడీ గురించి ఓషాకింగ్ విషయం వెల్లడించింది.

`ఉయ్యాల జంపలా` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది అవికా గోర్. తొలి చిత్రంతోనే తెలుగు ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేసింది. `లక్ష్మీ రావే మాఇంటికి`, `సినిమా చూపిస్తా మావ`, `ఎక్కడికి పోతావు చిన్నవాడా`, `రాజుగారి గది 3`చిత్రాలతో మెస్మరైజ్ చేసింది. హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అయితే అవికాకి సక్సెస్‌లు దూరం కావడంతోపాటు, ఆమె ఫిట్‌నెస్‌ని కూడా కోల్పోయింది. బరువెక్కి బొద్దుగా మారింది. దీంతో సినిమా అవకాశాలు తగ్గాయి. 2016 నుంచి 19 వరకు కేవలం రెండు సినిమాల్లోనే నటించింది. ఈ సమయంలోనే తాను చేసిన తప్పేంటో తెలుసుకుంది అవికా. తన బాడీని నిర్లక్ష్యం చేసింది. దీంతో లావెక్కింది. దీని కారణంగా సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టింది.
అయితే తన బాడీని నిర్లక్ష్యం చేయడం గురించి తాజాగా అవికాగోర్ స్పందించింది. తాను ఏం చేసిందో వెల్లడించింది. తన బాడీ అంటే తనకు అసహ్యమని, అస్సలు దాని గురించి పట్టించుకోలేదని చెప్పింది. తన బాడీపై తనకు నెగటివ్ ఇమేజ్ ఉండేదని, దీంతోనే నిర్లక్ష్యం చేశానని తెలిపింది. కేవలం నటన పరమైన నైపుణ్యాలను పెంచుకున్నట్టు చెప్పింది.
`నేను నా బాడీని కేర్ చేయలేదు. అసహ్యించుకున్నా. నేను తెరపై ఎలా కనిపిస్తానని ఎప్పుడూ బాధ పడలేదు. కేవలం నటనపైనే దృష్టి పెట్టా. నన్ను నేను అద్దంలో చూసుకోవాలనుకోలేదు. ఓ రకంగా నా బాడీని అసహ్యించుకున్నా. కాబట్టి నాకది చాలా ప్రతికూల భావన కలిగించింది. మరుసటి రోజు కాస్ట్యూమ్ కోసం ప్రయత్నించడం నాకు ఇప్పటికీ గుర్తుంది` అని తెలిపింది అవికా.
`నేను అన్ని విషయాల గురించి బాధపడలేదు. నేను ఉత్తమంగా కనిపించాలనుకోలేదు. నాకు ఉత్తమంగా కనిపించాలని అనిపించలేదు. చివర్లో నేను నా ప్రేక్షకులతో మాట్లాడాను. వారు ఎల్లప్పుడు నా యాక్టింగ్ గురించే మాట్లాడారు. కాబట్టి నా ప్రేక్షకులు నేను నటనలో మంచి పని చేస్తున్నాననే అనుభూతిని కలిగించారు. దీంతో నాకు వేరే దానిపై దృష్టి వెళ్లలేదు` అని తెలిపింది అవికాగోర్.
అయితే తన బరువు పెరిగిన విషయం తెలుసుకుని చాలా కష్టపడి వర్కౌట్ చేశానని, ఫుడ్‌ని కంట్రోల్‌లో పెట్టుకున్నానని నిత్యం జిమ్‌లో శ్రమించడం వల్ల ఇప్పుడీ రూపం వచ్చిందని గతంలో ఓ సందర్భంలో తెలిపింది అవికా గోర్.
ఇటీవల ఓటీటీ సినిమాలు `నెట్`, `బ్రో`లో మెరిసింది అవికాగోర్. ప్రస్తుతం నాగచైతన్య, రాశీఖన్నా నటిస్తున్న `థ్యాంక్యూ` చిత్రంలో ఓ హీరోయిన్‌గా కనిపించబోతుంది. మరోవైపు తాను హీరోయిన్‌గా `10వ క్లాస్ డైరీస్` చిత్రంలో నటిస్తుంది. ఇందులో శ్రీరామ్ హీరోగా నటిస్తుండగా, `గరుడవేగ` కెమెరామెన్ అంజి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల చిత్ర టీజర్ విడుదలై ఆకట్టుకుంటుంది.