Avika Gor: చీరకట్టులో హాట్ గా మారిపోయిన అవికా.. మెస్మరైజ్ చేస్తున్న ఫోటోస్
చిన్నారి పెళ్లికూతురు టీవీ సీరియల్ తో తెలుగువారిలో గుర్తింపు పొందింది అవికా గోర్. కాస్త వయసొచ్చాక హీరోయిన్ గా మారిపోయింది.

చిన్నారి పెళ్లికూతురు టీవీ సీరియల్ తో తెలుగువారిలో గుర్తింపు పొందింది అవికా గోర్. కాస్త వయసొచ్చాక హీరోయిన్ గా మారిపోయింది. ఉయ్యాలా జంపాల చిత్రంలో రాజ్ తరుణ్ తో కలసి చేసిన సందడి అంతా ఇంతా కాదు.
ఆ తర్వాత సినిమా చూపిస్తమావ , ఎక్కడికిపోతావు చిన్నవాడా లాంటి సూపర్ హిట్ చిత్రాలు అవికా గోర్ ఖాతాలో పడిపోయాయి. కానీ ఇటీవల అవికా గోర్ కి సరైన విజయం లేదు. ప్రస్తుతం అవికా కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. ఆ మూవీస్ పై అవికా చాలానే హోప్స్ పెట్టుకుని ఉంది.
ఈ చిన్నారి పెళ్లి కూతురు వెండితెరపై గ్లామర్ ఒలకబోసింది చాలా తక్కువ. హద్దుల్లోనే ఉంటూ క్యూట్ లుక్స్, నటనతో మెప్పిస్తూ వస్తోంది. ఇక రాజుగారి గది 3లో హర్రర్ రోల్ లో కూడా మెప్పించింది.
ఇప్పుడిప్పుడే అవికా గ్లామర్ పై ఫోకస్ పెట్టింది. వెండితెరపై గ్లామర్ గా కనిపించడం ఎంత అవసరమో గుర్తించింది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో వరుసగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ నెటిజన్లని ఊరిస్తోంది.
తాజాగా అవికా గోర్ చీరకట్టులో షేర్ చేసిన ఫొటోస్ మెస్మరైజ్ చేస్తున్నాయి. చీరకట్టులో అవికా అందం రెట్టింపైనట్లు అనిపిస్తోంది. ఎల్లో శారీలో అవికా వయ్యారంగా ఇచ్చిన ఫోజులు కుర్రాళ్ళ హృదయాలు దోచుకునేలా ఉన్నాయి.
శారీలో అవికా వయ్యారంగా తన బ్యాక్ అందాలు చూపిస్తోంది. అవికా ప్రస్తుతం నాగ చైతన్య 'థ్యాంక్యూ' మూవీలో నటిస్తోంది. అలాగే మరికొన్ని సినిమాలు చేస్తోంది.