అవతార్ 3: అగ్ని తో జేమ్స్ కామెరూన్ మ్యాజిక్
జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన 'అవతార్ 3' ఈ సంవత్సరం డిసెంబర్ 19 న విడుదల కానుంది. ఈ చిత్రం పంచభూతాల్లో ఒకటైన అగ్నికి సంబంధించిన కాన్సెప్ట్ తో రూపొందించబడింది మరియు గత రెండు చిత్రాల కంటే నిడివి ఎక్కువగా ఉంటుంది.
Avatar 3 , James Cameron, hollywood
జేమ్స్ కామెరూన్ (James Cameron) తెరకెక్కించిన విజువల్ వండర్ ‘అవతార్’. దీని రెండు పార్ట్ లుగా వచ్చి భారీ ప్రేక్షకాదరణను పొంది రూ.కోట్లు వసూలు చేశాయి. తాజాగా దీని మూడో భాగంపై అప్‌డేట్ వచ్చేసింది. ‘అవతార్- ఫైర్ అండ్ యాష్’ (avatar 3) పేరుతో దీన్ని తెరకెక్కించారు. మరోసారి పండోర గ్రహానికి వెళ్లడానికి సిద్ధం చేసారు. ఈ ఏడాది డిసెంబర్ 19న ఇది విడుదల కానున్నట్లు తెలిపారు.
Avatar 3
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 భాషల్లో విడుదలైన ఆ సీక్వెల్ బాక్సాఫీసు కలెక్షన్లను కొల్లగొట్టింది. ఆ ఫ్రాంచైజీలో రానున్న మూడో భాగాన్ని పంచభూతాల్లో ఒకటైన అగ్నికి సంబంధించిన కాన్సెప్ట్‌తో రూపొందించారు. ‘అవతార్- ఫైర్ అండ్ యాష్’ (avatar 3) పేరుతో రానున్న ఈ సినిమాపై జేమ్స్ కామెరూన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. గత రెండు చిత్రాలతో పోలిస్తే దీని నిడివి కూడా రెట్టింపు ఉంటుందన్నారు.
జేమ్స్ కామెరూన్ మాట్లాడుతూ... ‘‘ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ చిత్రం ఉంటుంది. తెరపై ఈ విజువల్ వండర్‌ను చూసిన తర్వాత ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోతారు. గతంలోని రెండు చిత్రాల్లో చూపిన వాటిని ఎక్కడా రిపీట్ కాకుండా చూసుకుంటున్నాం. వాటికి బదులుగా కొన్ని ధైర్యమైన ఛాయిస్ లతో మీ ముందుకు వస్తాను.
ఇలా ధైర్యం చేసి కొన్నింటిని సృష్టించకపోతే ప్రతిఒక్కరి సమయాన్ని, డబ్బును వృథా చేసినవాడిని అవుతాను. రెండు భాగాల్లో లేని అద్భుతాలను అవతార్ మూడో పార్ట్‌లో చూస్తారు. మీ అంచనాలకు మించిన లైవ్-యాక్షన్‌ని ఇందులో చూస్తారు. మరో కొత్త ప్రపంచం భిన్నమైన కథనం, విభిన్నమైన పాత్రలు ఇందులో కనిపిస్తాయి. ఈసారి పాత్రలపై ఎక్కువ దృష్టి పెడుతున్నాం’’ అని చెప్పారు.
డైరక్టర్ దీని గురించి మాట్లాడుతూ.. ‘ఈసారి పాత్రలపై ఎక్కువ దృష్టిపెడుతున్నాము. మంచి కథనంతో భారీ విజువల్స్‌తో అలరించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మీ అంచనాలకు మించిన లైవ్-యాక్షన్‌ని ఇందులో చూస్తారు. మరో కొత్త ప్రపంచాన్ని భిన్నమైన కథనం, విభిన్నమైన పాత్రలు ఇందులో కనిపిస్తాయి. ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’లో కనిపించిన కేట్ విన్స్‌లెట్ చేసిన రోనాల్ పాత్రను అవతార్ 3లో మరింత పొడిగించాము. అందుకోసం ఆమె చాలా కష్టపడి శిక్షణ తీసుకుంది’ అని చెప్పారు.
‘అవతార్’ మూడో భాగాన్ని పంచ భూతాల్లో ఒకటైన అగ్నికి సంబంధించిన కాన్సెప్ట్‌తో రూపొందించనున్నారు. 2025 డిసెంబరు 19న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. అవతార్ ఫ్రాంచైజీలో రానున్న ‘అవతార్ 4’ 2029లో, చివరిగా రానున్న ‘అవతార్ 5’ డిసెంబరు 2031లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.