- Home
- Entertainment
- జాతకం ప్రకారం విజయ్ దేవరకొండ జీవితంలో ఏం జరుగుతోంది? పెళ్లి, కెరీర్ ప్రాబ్లమ్ కాబోతోందా?
జాతకం ప్రకారం విజయ్ దేవరకొండ జీవితంలో ఏం జరుగుతోంది? పెళ్లి, కెరీర్ ప్రాబ్లమ్ కాబోతోందా?
విజయ్ దేవరకొండ ఎప్పుడు హిట్ కొట్టబోతున్నాడు, ఆయన పెళ్లి సంగతి ఏంటి? కెరీర్ ఎలా ఉండబోతోంది. రౌడీ హీరో జాతకం బాగోలేదా?. ఫేమస్ సినిమా జ్యోతిష్యుడు చెప్పిన నిజం ఏంటి?

సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఒక రకంగా చెప్పాలంటే, అర్జున్ రెడ్డి, గీత గోవిందం తరువాత ఆరేంజ్ లో విజయ్ కు సక్సెస్ లభించలేదు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా విజయ్ కు కలిసిరావడంలేదు. పాన్ ఇండియా ఇమేజ్ కోసం లైగర్ సినిమాతో భారీ అంచనాలతో వచ్చి బోల్తా పడ్డాడు రౌడీ హీరో. ఆతరువాత మాస్ ఇమేజ్ కలిసిరావడం లేదు అని క్లాస్ కు షిప్ట్ అయ్యాడు. గీత గోవిందం టైప్ లోనే ఫ్యామిలీ స్టార్, ఖుషి సినిమాలు చేశాడు. కాని ఆ రెండు సినిమాల యావరేజ్ గానే మిగిలిపోయాయి. ఖుషి సినిమా మాత్రం కాస్త పర్వాలేదు అనిపించింది. కానీ విజయ్ దేవరకొండ ఇమేజ్ కు తగ్గ హిట్ మాత్రం లభించలేదు. దాంతో డిఫరెంట్ జానర్స్ ను ట్రై చేసుకుంటూ వెళ్తున్నాడు రౌడీ హీరో.
KNOW
రీసెంట్ గా ఆయన కింగ్ డమ్ సినిమాతో మరోసారి విశ్వరూపం చూపించాడు. అర్జున్ రెడ్డి రేంజ్ లో ఈ సినిమాపై హైప్ ను పెంచారు. ఈసినిమాతో మరోసారి విజయ్ ఫామ్ లోకి వస్తాడని అనుకున్నారు. కాని ఆశలు తిరలేదు. ఈసినిమా విజయ్ కెరీర్ కు ఏమాత్రం ఉపయోగపడలేదు. అన్ని అంచనాల మధ్య రిలీజ్ అయినా.. యావరేజ్ టాక్ కూడా సొంతం చేసుకోలేకపోయింది కింగ్ డమ్. దాంతో విజయ్ కెరీర్ పై ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. రౌడీ హీరో నుంచి బ్లక్ బస్టర్ హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
మరోవైపు విజయ్ దేవరకొండ రష్మిక మధ్య సమ్ థింగ్ అంటూ ఎప్పటి నుంచో సోషల్ మీడియా కోడై కూస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇద్దరు ఖండించలేదు, అలా అని ఒప్పుకోలేదు. కాని కలిసి తిరుగుతున్నట్టు సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు మాత్రం రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే విజయ్ రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్త కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం నేషనల్ క్రష్ గా రష్మిక వరుస హిట్లతో దూసుకుపతోంది. కానీ విజయ్ మాత్రం సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఈక్రమంలోనే విజయ్ జాతకానికి సబంధించిన పాత వార్త ఒకటి వైరల్ అవుతోంది.
సినిమా జ్యోతీష్యుడిగా పేరున్న వేణు స్వామి విజయ్ దేవరకొండ జాతకం గురించి చెసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ జాగతకం బాలేదు. ఆయన కెరీర్ ఇబ్బందుల్లో పడుతుంది. పెళ్లి విషయంలో కూడా సమస్యలు ఫేస్ చేస్తారు అని అన్నారు. మరి పరిహారం చేయిస్తారా అని అడిగితే. అసలు వాళ్లు పట్టించుకుంటేనేగా. నేనంటే పెద్దగా లెక్క చేయరు. ఏదైనా పరిహారం చేయించుకోవాలి అని వాళ్లకు ఉండాలి, మనం ఏం చేస్తాం అని వేణు స్వామి వ్యాఖ్యానించారు. అంతే కాదు మరికొందరు హీరోల పరిస్థితి కూడా బాలేదని ఆయన అన్నారు.
వేణు స్వామికి సినిమా జ్యోతీష్యుడిగా మంచి పేరు ఉంది. కాంట్రవర్సీలు, కేసులు కూడా ఫేస్ చేశారు ఆయన. సెలబ్రిటీల జీవితం గురించి జాతకం చెప్పడంతో ఎన్నో సంచలనాలకు ఆయన కారణం అయ్యారు. సమంత నాగచైతన్య విడాకులు, సినిమా సెలబ్రిటీల మరణాలపై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడంతో పాటు వివాదం కూడా అయ్యాయి.
ఇక విజయ్ పెళ్లి విషయం ఇంత వరకూ తెలియదు కాని, కెరీర్ మాత్రం సక్సెలు లేక ఇబ్బందుల్లో పడింది. ప్రస్తుతం ఆయన టాక్సావాల డైరెక్టర్ రాహుల్ తో ఓ మూవీ చేస్తున్నారు. ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ వార్త నిజం అయితే వీరి కాంబినేషన్ లో ముచ్చటగా ఇదిమూడో సినిమా అవుతుంది. మరి ఈసారైన విజయ్ దేవరకొండ హిట్ కొడతాడా? లేక కెరీర్ ఇబ్బందుల్లో పడ్డట్టేనా? నెక్ట్స్ ఏం జరగబోతోంది అనేది చూడాలి.