MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ashu Reddy: అష్షు రెడ్డి ఎంగేజ్మెంట్ లో బిగ్ ట్విస్ట్.. తెరమీదకు బిగ్ బాస్ టైటిల్ విన్నర్, విషయం ఏంటంటే?

Ashu Reddy: అష్షు రెడ్డి ఎంగేజ్మెంట్ లో బిగ్ ట్విస్ట్.. తెరమీదకు బిగ్ బాస్ టైటిల్ విన్నర్, విషయం ఏంటంటే?

ఈమధ్య కాలంలో వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన అష్షు రెడ్డి.. ఎంగేజ్మెంట్ ఫోటో షేర్ చేసి మరో షాక్ ఇచ్చింది. ఇక తాజాగా అంతకు మించిన బిగ్ ట్విస్ట్ తో ఎంగేజ్మెంట్ సీన్ కు ఎండ్ కార్డ్ వేసింది బ్యూటీ. ఇంతకీ విషయం ఏంటంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 10 2026, 08:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా అష్షు రెడ్డి..
Image Credit : Instagram

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా అష్షు రెడ్డి..

సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉన్న సెలబ్రిటీలలో అషు రెడ్డి ఒకరు. ప్రస్తుతం ఆమె కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచింది. గతంలో ప్రేమ వార్తలతో వైరల్ అయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు చీటింగ్ కేసుతో ఇబ్బందులు పడుతోంది. 

ధర్మేంద్ర ఎన్నారై తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అషు రెడ్డి రూ.9 కోట్ల వరకు తీసుకుందని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కొన్ని ఆధారాలను కూడా ఆయన సమర్పించాడు.ఇప్పుడు ఆ కేసు కంటీన్యూ అవుతోంది. అష్షూ రెడ్డి కెరీర్ పై ఇది ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నేనేతప్పు చేయలేదు..
Image Credit : instagram.com/ashu_uuu

నేనేతప్పు చేయలేదు..

ఇక ధర్మేంద్ర వ్యవహారంపై అషు రెడ్డి వెర్షన్ వేరే ఉంది. నిజానిజాలు తెలుసుకోకుండా తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. అంతేకాకుండా, పోలీసులు నమోదు చేసిన కేసును రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. అయితే హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అష్షురెడ్డి అప్ డేట్స్ కోసం జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్న టైమ్ లో ఆమె సడెన్ గా ఓ షాక్ ఇచ్చింది.

Related Articles

Related image1
Allu Arjun: లేడీ డైరెక్టర్ ను ఇంటికి పిలిచి మరీ తిట్టిన అల్లు అర్జున్, కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు?
Related image2
ప్రభాస్ నుంచి అల్లు అర్జున్ వరకు, బాక్సాఫీస్‌ను శాసించే 50 ఏళ్లలోపు టాప్ హీరోలు ఎవరంటే?
35
వరుడి చేయి పట్టుకుని అషు రెడ్డి
Image Credit : instagram.com/ashu_uuu/

వరుడి చేయి పట్టుకుని అషు రెడ్డి

అషు రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె చేతికి ఎంగేజ్మెంట్ రింగ్ ఉంది. దాంతో పాటు వరుడి చేయి పట్టుకుని మరో ఫోటో కూడా కనిపించడంతో, అషు రెడ్డికి నిశ్చితార్థం జరిగిందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. పలువురు నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. కొంత మంది బాగా విమర్శించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎలా ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది అని విమర్శించారు. ఇంతకీ ఆ వరుడు ఎవరు అని ఆరా తీయ్యడం స్టార్ట్ చేశారు.

45
బిగ్ బాస్ విన్నర్ తో అష్షు రెడ్డి..
Image Credit : instagram.com/ashu_uuu/

బిగ్ బాస్ విన్నర్ తో అష్షు రెడ్డి..

ఇక తాజాగా అషు రెడ్డి మరో వీడియోను షేర్ చేస్తూ ఆ సస్పెన్స్‌కు తెరదించింది. ఆ వీడియోలో ప్రముఖ సీరియల్ నటుడు, బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ నిఖిల్ కనిపించాడు. దీంతో నిజంగానే అషు రెడ్డి నిఖిల్‌తో నిశ్చితార్థం చేసుకుందని అందరూ భావించారు. కానీ అక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. 

ఆ వీడియో గురించి అషు రెడ్డి మాట్లాడుతూ, “నిన్న నేను అప్లోడ్ చేసిన ఫోటోలను చూసి చాలా మంది నాకు ఎంగేజ్‌మెంట్ అయిందని అనుకున్నారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. ఇది జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న విక్రమ్ ఆన్ డ్యూటీ వెబ్ సిరీస్ షూటింగ్‌లోని ఒక మేకింగ్ వీడియో మాత్రమే” అని తెలిపింది.

55
కంటికి కనిపించేవన్ని నిజం కావు..
Image Credit : instagram.com/ashu_uuu/

కంటికి కనిపించేవన్ని నిజం కావు..

అంతేకాకుండా, “కంటికి కనిపించేవి అన్నీ నిజం కావు” అంటూ సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారాలను ఉద్దేశిస్తూ తెలివిగా తాను ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పే ప్రయత్నం చేసింది అష్షు రెడ్డి. ఈ విషయంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది ఇంకా ఎక్కువగా విమర్శిస్తుంటే.. మరికొంత మంది మాత్రం అష్షుకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Nainika: రియల్ ఎస్టేట్ యాడ్ అన్నారు, కానీ దాని కోసం నాకు రేటు ఫిక్స్ చేశారు.. బిగ్ బాస్ నైనికా సంచలనం
Recommended image2
దళపతి విజయ్ కొడుకు మొదటి సినిమా, జాసన్ సంజయ్ సిగ్మా రిలీజ్ ఎప్పుడు?
Recommended image3
Faria Abdullah: ఎరుపు చీరలో మెరుపులు మెరిపిస్తున్న ఫరియా అబ్దుల్లా
Related Stories
Recommended image1
Allu Arjun: లేడీ డైరెక్టర్ ను ఇంటికి పిలిచి మరీ తిట్టిన అల్లు అర్జున్, కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు?
Recommended image2
ప్రభాస్ నుంచి అల్లు అర్జున్ వరకు, బాక్సాఫీస్‌ను శాసించే 50 ఏళ్లలోపు టాప్ హీరోలు ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved