చీరకట్టులో కడిగిన ముత్యంలా మెరిసిపోతున్న అషురెడ్డి.. జూ.సమంత దీపావళి లుక్ అదిరిపోయిందిగా
బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి ఫెస్టివల్ లుక్ తో మంత్రముగ్ధులను చేసింది. చీరకట్టులో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. బ్యూటీఫుల్ శారీలో చూపుతిప్పుకోకుండా చేసింది.
డబ్ స్మాష్ వీడియోలతో అషురెడ్డి (Ashu Reddy) క్రేజ్ దక్కించుకుంది. జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంది. ఈ బ్యూటీ చేసే పోస్టులకు అప్పటికీ.. ఇప్పటికీ నెటిజన్లు ఫిదా అవుతూనే ఉంటారు. నయా లుక్స్ తో ఎప్పటికప్పుడు అలరిస్తుంటుంది.
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)తో ఇంటర్వ్యూ తర్వాత అషురెడ్డి మరింత క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆర్జీవీ గ్లర్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఈ బ్యూటీకి పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’లోనూ అవకాశం దక్కింది.
బిగ్ బాస్ సీజన్ 3 మరియు సీజన్ 5తో ఈ ముద్దుగుమ్మ Bigg Boss Telugu హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రెండుసార్లు ఈ ముద్దుగుమ్మకు వచ్చిన అవకాశాన్ని సరిగా వినియోగించుకుంది. కానీ టైటిల్ మాత్రం గెలుచుకోలేకపోయింది. తన ఆటతో ఆకట్టుకుంది.
అషురెడ్డికి బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపైతే దక్కింది. అదే క్రేజ్ తో ప్రస్తుతం సినిమాలు, టీవీ షోల్లో సందడి చేస్తోంది. బుల్లితెరపై అప్పుడప్పుడు మెరుస్తూ టెలివిజన్ ప్రేక్షకులను అలరిస్తోంది. తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటోంది.
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో అషురెడ్డి ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతూ అట్రాక్ట్ చేస్తుంటుంది. మరోవైపునయా లుక్స్ లో మెరుస్తూ మైమరిపిస్తు వస్తోంది.
ఈ ముద్దుగుమ్మ పండుగలు, ప్రత్యేకమైన రోజుల్లో మాత్రం సంప్రదాయ లుక్ లో దర్శనమిస్తూ ఆకర్షించుకుంటోంది. తాజాగా దీపావళి లుక్ లో మంత్రముగ్ధులను చేసింది. బ్యూటీపుల్ శారీలో మరింత అందాన్ని సొంతం చేసుకుంది.
లేత గులాబీ చీరలో మెరిసిన అషురెడ్డి అదిరిపోయే ఫోజులిచ్చింది. బ్యూటీఫుల్ లుక్ తో పాటు క్యూట్ స్టిల్స్ తో కట్టిపడేసింది. చీరకట్టుకు తోడు ఆకర్షణీయమైన జ్యూయెల్లరీ ధరించి మరింత అందాన్ని పోగేసుకుంది. ఈ సందర్భంగా ఇంటిముంగిట దీపాలు వెలిగిస్తూ అచ్చు తెలుగుమ్మాయిలా ఆకట్టుకుంది.
అషురెడ్డి నిండుగా సంప్రదాయ దుస్తుల్లో కనిపించడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. ట్రెడిషనల్ లుక్ లో ఎంత బాగుందో అంటూ కామెంట్ల రూపంలో ఆకాశానికి ఎత్తుతున్నారు. లైక్స్ తో పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. ఇక అషురెడ్డి ప్రస్తుతం A Master Piece అనే చిత్రంలో నటిస్తోంది.