- Home
- Entertainment
- BiggBoss Telugu OTT: అరియానా, అషురెడ్డి, నటరాజ్ మాస్టర్, ముమైత్ ఖాన్.. ఓటీటీ బిగ్‌బాస్ షోలో పాత వారు రచ్చ
BiggBoss Telugu OTT: అరియానా, అషురెడ్డి, నటరాజ్ మాస్టర్, ముమైత్ ఖాన్.. ఓటీటీ బిగ్‌బాస్ షోలో పాత వారు రచ్చ
తెలుగు టీవీ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ ఆరవ సీజన్ శనివారం గ్రాండ్‌గా ప్రారంభమైంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ షో ప్రసారమవుతుంది. ఈ సీజన్‌లో గత బిగ్‌బాస్ సీజన్లలో పాల్గొన్న వారు సందడి చేయబోతుండటం విశేషం.

బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ(Bigg Boss Telugu OTT)లో సగం మంది పాత కంటెస్టెంట్లు సందడి చేయబోతున్నారు. వారిలో అరియానా, అషురెడ్డి, ముమైత్ ఖాన్, మహేష్ విట్టా, నటరాజ్ మాస్టర్ ఉన్నారు. ప్రస్తుతం వీరు గ్రాండ్ ఎంట్రీతో ఆడియెన్స్ ని కనువిందు చేస్తున్నారు. వీరంతా వారియర్స్ టీమ్ గా హౌజ్‌లోకి వస్తుండటం విశేషం. అయితే ఈ సారి బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్లని రెండు టీమ్‌లుగా విభజించారు. వీరిలో పాతవారిని వారియర్స్ గా, కొత్త వారిని ఛాలెంజర్స్ గా విభజించారు.
వారియర్స్ టీమ్ నుంచి `బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ`లోకి మొదటి కంటెస్టెంట్ గా అషురెడ్డి(Ashu Redy) ఎంట్రీ ఇచ్చారు. తనదైన ఆటాపాటతో, గ్లామరస్‌తో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వడం విశేషం.
బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ ఆరవ సీజన్‌కి సంబంధించి రెండో కంటెస్టెంట్‌గా మహేష్ విట్టా ఎంట్రీ ఇచ్చారు. తనదైన కమెడీతో ఎంటర్‌టైన్ చేసే మహేష్ ఈసారి కూడా వినోదం పంచబోతున్నారు.
మూడవ కంటెస్టెంట్‌గా ఐటెమ్ సాంగ్‌లకు ఫేమస్ అయిన ముమైత్ ఖాన్(Mumaith Khan) ఎంట్రీ ఇవ్వడం విశేషం. మాస్ ఎంట్రీతో రచ్చ చేసింది. ఆమె లుక్ ఆకట్టుకుంటుంది.
ఇక ఏడో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో టాప్ 5లో నిలిచిన అరియానా(Ariyana Glory) ఏడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. హాట్ లుక్‌లో కేకపెట్టిస్తుంది.
ఎనిమిదో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ ఐదో సీజర్‌లో హంగామా చేసిన నటరాజ్ మాస్టర్ రావడం విశేషం. ఆయన మాస్ ఎంట్రీతో అదరగొట్టారు. ఊహించినట్టే నటరాజ్ మాస్టర్ ఎంట్రీ ఇవ్వడం విశేషం.
హాట్ బ్యూటీ తేజస్విని మదివాడ సైతం ఈ షోలో సందడి చేసింది. ఆమె 12వ కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ తెలుగు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. గ్లామరస్ లుక్‌లో ఆద్యంతం కనువిందు చేస్తుంది తేజస్విని.
బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో ఫైర్ బ్రాండ్‌గా నిలిచిన సరయు మరోసారి బిగ్‌బాస్ షోలో సందడి చేసింది. ఆమె బిగ్ బాస్ తెలుగు ఓటీటీ హౌజ్‌లో 13వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. తనదైన గ్రాండ్ ఎంట్రీతో అదరగొట్టింది.
ఇక బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో మోస్ట్ లవింగ్ అమ్మాయిగా నిలిచిన హమిద మరోసారి బిగ్‌బాస్ షోలో సందడి చేయబోతుంది. ఆమె బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ హౌజ్‌లోకి 16వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. మరోసారి హౌజ్‌లో ప్రేమ పాఠాలు చెప్పేందుకు వచ్చింది.
ఇక బిగ్‌బాస్ నాల్గవ సీజన్‌లో రన్నరప్‌గానిలిచిన అఖిల్ బిగ్‌బాస్ తెలుగు 6వ ఓటీటీ సీజన్‌లో మెరిశారు. ఈ సీజన్ లోకంటెస్టెంట్‌గా సందడి చేయడానికి వచ్చారు. `ఢీ` షోలో మెరుస్తున్న ఆయన ఇప్పుడు ఓటీటీ బిగ్‌బాస్‌లోకి రావడం విశేషం. 17వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి అదరగొట్టారు.
నాగార్జున హోస్ట్ గా రన్ అయ్యే ఈ షో 24 గంటలు ప్రసారం కానుంది. ఎలాంటి ఫిల్టర్ లేకుండా ప్రసారం చేయబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు రెండు టీమ్‌లుగా కొత్తవారు, పాత వారు కలిసి చేసే రచ్చ, ఫైటింగ్, డేటింగ్‌లో ఏ రేంజ్‌లో ఉంటాయనేది ఆసక్తి నెలకొంది. ఇది దాదాపు ఎనబై రోజులపాటు రన్ అవుతుం