- Home
- Entertainment
- Prema Entha Madhuram: మాన్సీని కంపెనీ నుంచి గెంటేసిన ఆర్య.. వారసుడు రాబోతున్న సంతోషంలో కుటుంబం?
Prema Entha Madhuram: మాన్సీని కంపెనీ నుంచి గెంటేసిన ఆర్య.. వారసుడు రాబోతున్న సంతోషంలో కుటుంబం?
Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి కంటెంట్ తో రేసులో ముందుకి దూసుకుపోతుంది. కృతజ్ఞతలు చూపించుకోవడం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన ఒక స్త్రీ కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 15 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో తనకిచ్చిన నోటీసు చూసి షాక్ అవుతుంది మాన్సీ. నన్ను డైరెక్టర్ పదవి నుంచి తీసేస్తున్నారా? ఆఫీస్ నుంచి బయటికి పంపిస్తున్నారా అంటూ కేకలు వేస్తుంది. అలా చేయటానికి కారణం ఏంటో చెప్పమంటుంది. మన కంపెనీ బైలాస్ ప్రకారం కంపెనీకి వ్యతిరేకంగా పనిచేయకూడదు, కంపెనీ సీక్రెట్స్ బయట పెట్టకూడదు.
అలాగే కంపెనీకి నష్టం కలిగించే పనులు చేయకూడదు, మిగిలిన డైరెక్టర్స్ సంతకాలు ఫోర్జరీ చేయకూడదు. నువ్వు ఇవన్నీ చేశావు అందుకే నిన్ను కంపెనీ నుంచి బయటికి పంపిస్తున్నాను అంటాడు ఆర్య. అవన్నీ నిందలు నిజం అని నిరూపించండి అప్పుడు చూద్దాం అంటుంది మాన్సీ. అవి నిజాలని నీకు తెలుసు నా సంతకం దాదా సంతకం ఫోర్జరీ చేశావు.
ఇదే విషయం గా పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందో ఆలోచించుకో. ఇంటికి వెళ్తావో స్టేషన్ కి వెళ్తావో నువ్వే నిర్ణయించుకో అంటాడు నీరజ్. కోపంతో అక్కడినుంచి వెళ్ళిపోతూ నా ఇంట్లోకే కాదు నా ఆఫీసులోకి కూడా వచ్చావు నిన్ను వదిలి పెట్టేది లేదు అంటూ అంజలిని బెదిరిస్తుంది మాన్సీ. ఆమె బయటికి వెళ్ళిన తర్వాత అంజలికి కంపెనీ గురించిన డీటెయిల్స్ అన్ని చెప్పమని అను కి చెప్తాడు ఆర్య.
నేను అమెరికా నుంచి వచ్చేటప్పుడు ఏమి నాలెడ్జ్ లేదు అలాంటప్పుడు మీరు నాకు బాగా హెల్ప్ చేశారు. ఇప్పుడు అను తన పదవిని త్యాగం చేసింది మీ ఇద్దరినీ నా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోను అంటుంది అంజలి. మరోవైపు అపరిచితురాలు ఆర్య కి ఫోన్ చేసి ఏంటి నీకు ఇష్టం లేని వాళ్ళని కంపెనీలో నుంచి తీసేసి ఇష్టమైన వాళ్ళని పక్కన పెట్టుకున్నావంట.. నీ తెలివితేటలు కి నీ ధైర్యానికి నా హ్యాట్సాఫ్ అంటుంది.
నిన్ను రేసులో ఓడించడం కోసం చాలా కష్టపడవలసి వస్తుంది కానీ ఎప్పుడో ఒకరోజు కచ్చితంగా ఓడిస్తాను అంటుంది. అది జరగని పని అంటాడు ఆర్య. మరోవైపు మదన్ అంజలి కి ఫోన్ చేసి నువ్వు చేసిన పని ఏమీ బాగోలేదు ఆ కుటుంబానికి నీకు ఏమి సంబంధం లేదని చెప్పి బయటకు వచ్చేయ్ అంటాడు. నిన్న పెళ్లి చేసుకొని ఈరోజు డైవర్స్ ఇచ్చి వచ్చేయమని ఏ బ్రదర్ చెప్పడు అంటుంది అంజలి.
అంటే ఆ ఫ్యామిలీ తోనే కంటిన్యూ అవుతావా.. ఇలాంటి పనులు చేసి నువ్వు మన ఇంటి పరువు తీస్తున్నావు అంటాడు మదన్. కడుపుతో ఉన్న అను చేయి పట్టుకున్నప్పుడు నువ్వు అన్న ఆ పరువు ఏమైంది అంటూ నిలదీస్తుంది అంజలి. నేను ఇప్పుడు వర్ధన్ ఫ్యామిలీ మెంబర్ని అంటుంది. అదే నేను నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా విను ఆ ఫ్యామిలీని రోడ్డు మీదకి ఈడుస్తాను.
ఆర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని మదన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గా మారుస్తాను అంటాడు మదన్. పగటి కలలు కనొద్దు అంటూ ఫోన్ పెట్టేస్తుంది అంజలి. మరోవైపు ఆర్య దంపతులకు అంజలి నీరజ్ గ్రాండ్ వెల్కమ్ చెప్తారు. మీ చేతులతో మీ ఇంట్లో దీపం పెట్టవలసిన నిన్ను బయటికి పంపించేసి ఇంటిని చీకటిని చేసుకున్నాను అని బాధపడుతుంది శారదమ్మ. ఇంకొక 48 గంటల్లో ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడు అంటూ ఆనందపడతాడు నీరజ్. మీ కలలని మీ సామ్రాజ్యాన్ని ఇంకొక అడుగు ముందుకు తీసుకు వెళ్ళటానికి నెక్స్ట్ జనరేషన్ రాబోతుంది అంటూ అంజలి కూడా ఆనందపడుతుంది.
సరే అను రెస్ట్ తీసుకుందువుగానివి కదా అని భార్యని తీసుకొని తన గదికి వెళ్ళబోతాడు ఆర్య. ఒక్క నిమిషం ఆగండి అంటుంది మాన్సీ. ఇప్పుడు నేను ఈ ఇంట్లో ఎవరిని నా ఫ్యూచర్ ఏంటి వస్తూనే నాకు సవతిని అంటగట్టారు ఏ రాజ్యంలోని ఒక స్త్రీకి ఇలాంటి శిక్ష వేయలేదు అంటూ నిలదీస్తుంది. ఇప్పుడు నీకు ఏం కావాలి.. నీరజ్ కావాలా? ఈ ఫ్యామిలీ కావాలా? లేకపోతే వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కావాలా అంటూ నిలదీస్తాడు ఆర్య. ఒక్కసారి గా షాక్ అయిపోతుంది మాన్సీ. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.