MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Prema Entha Madhuram: కన్న కూతురిని ముద్దు చేస్తున్న ఆర్య.. అనుకున్నది సాధించిన మాన్సీ!

Prema Entha Madhuram: కన్న కూతురిని ముద్దు చేస్తున్న ఆర్య.. అనుకున్నది సాధించిన మాన్సీ!

Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటూ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. భార్యాబిడ్డలు దూరం అవ్వటానికి కారణం తెలియక సతమతమవుతున్న ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 30 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

Navya G | Published : May 30 2023, 07:21 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

 ఎపిసోడ్ ప్రారంభంలో ఆర్య కుటుంబ సభ్యుల పేరు మీద పూజ చేస్తూ ఉంటారు పంతులుగారు. నాకు ఎన్ని కష్టాలు పెట్టినా ధైర్యంతో ఎదుర్కొన్నాను కానీ నిన్ను ఎప్పుడూ ఏ కోరిక కోరలేదు. ఇప్పుడు కోరుకుంటున్నాను దయచేసి అనుని పిల్లల్ని నా దగ్గరికి చేర్చు తల్లి అని దండం పెట్టుకుంటాడు ఆర్య. అదే సమయంలో అనుకూడా అమ్మవారికి దండం పెట్టుకుంటుంది.
 

27
Asianet Image

నన్ను పిల్లల్ని వదిలి ఉండలేరని తెలుసు అయినా మీకు దూరంగా ఉండవలసిన వస్తుంది అంటే అదంతా నా కర్మ. మీకు దూరంగా ఉన్నా పర్వాలేదు కానీ మీరు ప్రాణాలతో ఉండటమే నాకు కావాలి అనుకుంటుంది అను. అను, ఆర్యలు కలవాలని నీరజ్ వాళ్లందరూ కోరుకుంటారు. ఒక్క మాన్సీ మాత్రం వీళ్లు బ్రో ఇన్ లా,  అను కలవాలని గట్టిగా కోరుకుంటున్నాట్లు గా ఉన్నారు కానీ అది ఎప్పటికీ జరగదు.అను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి రాదు అనుకుంటుంది.
 

37
Asianet Image

అంతలోనే పంతులుగారు అభిషేక కలశాన్ని తీసుకొచ్చి దీన్ని తాకి మీ మనసులో కోరిక కోరుకోండి నెరవేరుతుంది అంటారు. పంతులుగారు చెప్పినట్లే చేస్తాడు ఆర్య. మరోవైపు పూజ పూర్తయిన తర్వాత కాసేపు కూర్చుంటుంది అను. ముసలమ్మ మాత్రం మా చిన్నమ్మ కూతురు ఇక్కడే ఉంది కలిసి వస్తాను పాపని నాతో తీసుకువెళ్తాను అంటుంది. సరే అంటుంది అను. ముసలమ్మ తన బంధువుతో మాట్లాడి జరిగిందంతా ఆమెకి చెప్తుంది.
 

47
Asianet Image

 ఇప్పుడు ఈ పిల్లలతోనే నాకు కాలక్షేపం అంటుంది. ఇంతలో ఆర్య కి ఫోన్ వస్తుంది గుడిలో సిగ్నల్ లేకపోవడంతో బయటకు వచ్చి మాట్లాడుతాడు. నా భార్య పిల్లలు జాడ దొరకలేదా అలా అంటే ఎలా.. మీకు నా బాధ అర్థం అవుతుందా అవసరమైతే కేసు డిటెక్టివ్లకి అప్పగించండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలో చేతికి ఏదో తగలడంతో చేతి వైపు చూస్తాడు ఆర్య. అక్కడ ఒక పాప చేతి వేళ్ళు తన తాయత్తులలో చిక్కుకొని ఉంటాయి.
 

57
Asianet Image

 అయితే ఆ పాప తన కూతురే అని ఆర్యకి తెలియదు. క్షమించండి బాబు పాప వేళ్ళు మీ దారాలలో చుట్టుకుపోయాయి ఏమీ అనుకోకండి అంటూ ఆ దారాలని తప్పిస్తుంది ముసలమ్మ. ఆ తర్వాత ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోబోతుంటే ముసలమ్మ పర్మిషన్ తీసుకొని ఆ పాపని ఎత్తుకొని బాగా ఎమోషనల్ అవుతాడు ఆర్య. అనుకోకుండా ఆ సీన్ చూసి షాకవుతుంది. కన్న తండ్రి స్థానంలో ఉండి ఎత్తుకోవలసింది పరాయి వ్యక్తి స్థానంలో ఎత్తుకుంటున్నారు.
 

67
Asianet Image

 పిల్లలు మీకు దూరమయ్యారనే బాధ మీ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్నా నేనేమీ చేయలేకపోతున్నాను అని బాధపడుతుంది. ఇంతలో ఆర్య దగ్గరికి జెండే వచ్చి పూజ ప్రారంభం అవుతుంది నిన్ను రమ్మంటున్నారు అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతాడు. పూజా ప్రారంభించిన పంతులుగారు ధ్వజస్తంభం స్థాపన దంపతులిద్దరూ చేయాలి ఒకరే చేయకూడదు అంటారు. కోపంతో రగిలిపోతుంది అంజలి. మాన్సీ అనుకున్నదంతా చేసింది అనుకుంటుంది.
 

77
Asianet Image

మా కోడలు రావటానికి కుదరలేదు మా అబ్బాయి చేస్తాడు అంటుంది శారదమ్మ. అలా కుదరదమ్మ.. మీ పెద్ద కోడలు లేనప్పుడు  మీ చిన్న అబ్బాయి చిన్న కోడలు చేత పూజ చేయించవచ్చు అంటారు పంతులుగారు. దాదా చేయవలసిన పూజలు నేను చేయటం కుదరని పని అంటాడు నీరజ్. ఆర్య కూడా నీరజ్ నే పూజ చేయమంటాడు. బ్రో ఇన్ లా యే చెప్తున్నారు కదా అలాంటప్పుడు నీకేంటి ప్రాబ్లం పద పూజ చేద్దాం అంటూ నీరజ్ ని ప్రెజర్ చేస్తుంది. ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉంటుంది అను. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Navya G
About the Author
Navya G
 
Recommended Stories
Top Stories