- Home
- Entertainment
- Prema Entha Madhuram: నడిరోడ్డు మీద మదన్ పొగరు దించిన ఆర్య.. ఇద్దరి మధ్య నలిగిపోతున్న అంజలి!
Prema Entha Madhuram: నడిరోడ్డు మీద మదన్ పొగరు దించిన ఆర్య.. ఇద్దరి మధ్య నలిగిపోతున్న అంజలి!
Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతూ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. స్వేచ్ఛ, స్వతంత్రాలు కావాలంటూ అత్తింటిని నరకంగా మారుస్తున్న ఒక ఆడదాని కథ ఈ సీరియల్ ఇక ఈరోజు ఏప్రిల్ 11 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో కడుపులో ఉన్న బిడ్డతో తనలాగా మాట్లాడుతున్న భార్యని చూస్తూ అలాగే ఉండిపోతాడు ఆర్య. కడుపులో ఉన్న బిడ్డ కోసం జోల పాడుతుంది అను. ఆమె ఒడిలో వాలిపోతాడు ఆర్య. నువ్వు జోల పాడుతుంటే అమ్మ ఒడిలోనే పడుకున్నట్లుగా ప్రశాంతంగా ఉంది అంటాడు. సంతోషించిన అను మళ్లీ పాట పాడుతుంది. మరోవైపు కన్స్ట్రక్షన్ కోసం ప్లాన్ గీస్తూ ఉంటాడు మదన్.
ఏం చేస్తున్నావు అని అంజలి అడగటంతో అప్రూవల్ కి పంపించాలి కదా అందుకే ప్లాన్ గీస్తున్నాను అంటాడు మదన్. ప్రాజెక్టు క్యాన్సిల్ చేస్తానన్నావు కదా మళ్లీ ఇదేంటి అంటుంది అంజలి. ఎవడో ప్లాన్ చేంజ్ చెయ్యనంటే ప్రాజెక్టుని ఎందుకు క్యాన్సల్ చేసుకుంటాను నేనే చేంజ్ చేసుకొని అప్రూవల్ కి పంపిస్తాను అంటాడు మదన్.తను చేంజ్ చేసిన ప్లాన్ వల్ల ఎంత ప్రాఫిట్ వస్తుందో వివరించి చెప్తాడు.
నువ్వు ప్రాఫిట్ గురించే ఆలోచిస్తున్నావు కానీ ఇలా చేస్తే ఆనంద్ చెప్పిన కాంప్లికేషన్స్ కచ్చితంగా వస్తాయి అంటుంది అంజలి. బిజినెస్ ని బిజినెస్ లాగా చేయాలి సోషల్ సర్వీస్ లాగా కాదు నా డెసిషన్ ఫైనల్ అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మదన్. మరోవైపు ఆర్య వాళ్ళ దగ్గరికి వచ్చిన జెండే ఎందుకు అర్జెంట్గా రమ్మన్నావు అని అడుగుతాడు. చెప్తాను అంటూ అతని దగ్గర లాప్టాప్ తీసుకొని అందులో ఏదో చేస్తుంటాడు ఆర్య.
ఏం చేస్తున్నావు అంటాడు జెండే. సౌత్ ఇండియా బిజినెస్ అసోసియేషన్ బెస్ట్ బిజినెస్మేన్ అవార్డు కోసం నామినేషన్ రిలీజ్ చేసింది మన నీరజ్ పేరుని నామినేషన్ కి పంపిస్తున్నాను అంటాడు ఆర్య. ఎక్కడ ఉన్నా అన్నగా నీ బాధ్యత మర్చిపోవు నీ తమ్ముడిగా పుట్టడం నీరజ్ అదృష్టం అంటాడు జెండే. మా ఇద్దరిలో ఎవరికి పేరు వచ్చిన గౌరవం పెరిగేది వర్ధన్ కుటుంబానికే కదా అంటాడు ఆర్య.
మీరు మంచి పని చేస్తున్నారు ఆయనకి ఎలాగైనా ఈ అవార్డు రావాలి అప్పుడే ఆయన మీద ఆయనకి కాన్ఫిడెన్స్ రెట్టింపు అవుతుంది అంటుంది అను. అన్నా వదినల ఆశీర్వచనాలు ఉన్నాయి కదా ఖచ్చితంగా నీరజ్ సార్ విన్ అవుతారు అంటాడు జెండే. సరే ఇక నువ్వు వెళ్ళు ఎవరైనా చూస్తే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఆర్య అనటంతో అక్కడి నుంచి బయలుదేరుతాడు జెండే.
మరోవైపు కారులో వెళ్తున్న అంజలి నువ్వు కోపం తగ్గించుకోవాలి అని మదన్ తో అంటుంది. ఆ మాత్రం యాటిట్యూడ్ చూపించకపోతే మనల్ని ఎవరు సీరియస్ గా తీసుకోరు అంటాడు మదన్. రేష్ డ్రైవింగ్ చేస్తూ జెండే కి డాష్ ఇవ్వబోతాడు. కాస్తలో తప్పించుకున్న జెండే కళ్ళు కనిపించట్లేదా ఇడియట్ అంటూ కోప్పడతాడు. ఆ మాటలకి కారు ఆపి మరీ వచ్చి అతని కాలర్ పట్టుకుంటాడు మదన్.
ఆ చేతిని అడ్డుకుంటాడు ఆర్య. ఇది నీకు సంబంధం లేని విషయం ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు మదన్. తప్పు మీదే సర్ అనవసరంగా గొడవ పెంచుకోకండి అతనికి సారీ చెప్పండి అంటాడు ఆర్య. ఏం మాట్లాడుతున్నావు నేను సారీ చెప్పాలా అంటాడు మదన్. తప్పు ఎవరిదైనా తప్పే అంటాడు ఆర్య. ఆర్య చెప్పింది నిజమే తప్పు మనదే అంటూ అంజలి ఏ సారీ చెప్పి జెండెని అక్కడ నుంచి వెళ్లిపోమంటూ రిక్వెస్ట్ చేస్తుంది. ఆయన తరుపున నేను సారీ చెప్తున్నాను అంటాడు ఆర్య. మన దగ్గర వర్క్ చేస్తూ ఎవరో రోడ్డున పోయే వాడికి సపోర్ట్ చేయడమేంటి ఇది ఏమి బాగోలేదు నీ పొగరు దింపే టైం కోసం ఎదురు చూస్తాను అంటూ అక్కడి నుంచి కోపంగా అంజలిని తీసుకొని వెళ్ళిపోతాడు మదన్. అతనితో డీలింగ్ నీకు ఎప్పటికైనా ప్రమాదమే అంటూ ఆర్యని హెచ్చరిస్తాడు జెండే.
నేను చూసుకుంటాను నీకు లేటవుతుంది వెళ్ళు అంటూ జెండేని పంపించేస్తాడు ఆర్య. మరోవైపు కారులో వెళ్తూ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఆనంద్ ఎథిక్స్ కి వాల్యూ ఇస్తాడు అన్నయ్య కమర్షియల్ గా ఆలోచిస్తాడు ఇద్దరినీ మేనేజ్ చేయలేకపోతున్నాను అంటుంది అంజలి. అంతా సర్దుకుంటుందిలే అంటూ ఫ్రెండ్ ధైర్యం చెప్తుంది. ఇంతలో ఆర్య నడుస్తూ రావడం గమనిస్తుంది అంజలి. కారు ఆపి ఎక్కడికి వెళ్తున్నావు నేను డ్రాప్ చేస్తాను అంటుంది అంజలి. ఇక్కడికే ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను మీరు వెళ్ళండి అంటాడు ఆర్య. అయితే నేను కూడా నీతో కాసేపు నడుస్తాను అంటూ అతనితో పాటు నడుస్తుంది అంజలి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.