MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Prema Entha Madhuram: గిల్టీ గా ఫీల్ అవుతున్న ఆర్య.. పైశాచిక ఆనందాన్ని పొందుతున్న మాన్సీ!

Prema Entha Madhuram: గిల్టీ గా ఫీల్ అవుతున్న ఆర్య.. పైశాచిక ఆనందాన్ని పొందుతున్న మాన్సీ!

Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని టాప్ రేటింగ్ ని సంపాదించుకుంటుంది. కూతురు ఇంట్లోంచి వెళ్లిపోవటానికి కారణం తెలియక గుండెలు బాదుకుంటున్న ఓ తల్లిదండ్రుల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 6 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

Navya G | Published : Jun 06 2023, 06:56 AM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
19
Asianet Image

 ఎపిసోడ్ ప్రారంభంలో ఎందుకు ఇలా చాటుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది బామ్మ. ఇప్పుడు నన్నేమీ అడగద్దు అంటుంది అను. ఆర్య కి ఏదో డౌట్ వచ్చిన వాడిలాగా అను ఉన్న రూమ్ తలుపు తీస్తాడు. అదే సమయానికి జెండే పిలవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదే అదునుగా హాస్పిటల్ బయటికి వెళ్ళిపోతారు బామ్మ, అను.
 

29
Asianet Image

 హాస్పిటల్ అంతా వెతికిన తర్వాత అను ఎక్కడా కనిపించకపోవడంతో నిరాశగా కూర్చుండి పోతాడు ఆర్య. నేను తనని ఏమైనా అంటే కదా వెళ్ళిపోవాలి.. నాకు తెలియకుండా తనని ఏమైనా బాధ పెట్టానా అంటూ జెండేని అడుగుతాడు ఆర్య. లేదు ఆర్య నీవల్ల ఎలాంటి తప్పు జరగలేదు అంటాడు జెండే.
 

39
Asianet Image

లేదు నావల్ల ఏదో పొరపాటు జరిగింది నాకే తెలియకుండా నా వల్ల ఏదో తప్పు జరిగిపోయి ఉంటుంది అంటూ గిల్టీ గా ఫీల్ అవుతాడు ఆర్య. తను ఎంతో దూరం వెళ్లి ఉండదు ఈ చుట్టుపక్కలే ఉండి ఉంటుంది పదండి వెళ్లి వెతుకుదాం అంటూ అక్కడినుంచి బయలుదేరుతారు ఆర్య వాళ్ళు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన అను ఏడవటం చూసి విషయం ఏమిటో చెప్పమంటుంది బామ్మ.
 

49
Asianet Image

 నన్నేమీ అడగొద్దు అంటుంది అను. నిన్ను బాధ పెట్టాలని కాదు నీ బాధని చూడలేక అడుగుతున్నాను సరే నేను బాధ పెట్టను ఈ పాపని తీసుకో దిష్టి తీస్తాను అని చెప్పి దిష్టి తీసి వంట చేయటానికి వెళ్ళిపోతుంది బామ్మ. పిల్లలిద్దర్నీ చూస్తూ మీ నాన్న మన కోసం పిచ్చివాడిలాగా వెతుకుతున్నాడు అటు మీ నాన్న బాధకి ఇటు మీ కష్టాలకి నేనే కారణం అంటూ కన్నీరు పెట్టుకుంటుంది అను.
 

59
Asianet Image

సీన్ కట్ చేస్తే పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదు కనీసం ఈ జ్యూస్ తాగండి అంటూ జ్యూస్ ఇస్తుంది అంజలి. మా అమ్మి దొరికే వరకు మాకు ఆకలి దప్పులు ఉండవు అంటూ ఏడుస్తుంది పద్దు. అయితే మీరంతా పస్తులతో  చావాల్సిందే  అని మనసులోనే నవ్వుకుంటుంది మాన్సీ. హాస్పిటల్లో ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా కచ్చితంగా తీసుకువచ్చేస్తారు అని ధైర్యం చెప్తుంది అంజలి.
 

69
Asianet Image

 అంతలోనే నిరాశగా ఇంటికి వచ్చిన ఆర్య వాళ్ళని చూసి షాక్ అవుతారు సుబ్బు వాళ్లు. కంగారు ఆపుకోలేక తీసుకువచ్చారా ఎక్కడ ఉంది అని అడుగుతుంది సుబ్బు. మీతో పాటు రానన్నదా.. నాకు చెప్పండి కానీ మేము తీసుకొని వస్తాము అంటాడు సుబ్బు. ఆర్య ఏమి మాట్లాడకపోవటంతో ఏం జరిగింది అని నీరజ్ ని  అడుగుతుంది అంజలి.
 

79
Asianet Image

 జరిగిందంతా చెప్తాడు నీరజ్. మా అమ్మికి ఎందుకు ఇన్ని కష్టాలు అని ఏడుస్తుంది పద్దు. తనకి మీరంటే ప్రాణం అలాంటిది మిమ్మల్ని వదిలి ఎందుకు వెళ్లిపోయింది. తనకి ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొంటుంది కానీ ఇలా పారిపోదు. ఇలా జరిగింది అంటే ఏమనుకోవాలి ఎవరిని నిందించాలి అంటూ  బాధపడతాడు సుబ్బు. ఇంట్లో ఎలాంటి గొడవలు జరగలేదు అను బాధపడే సంఘటన కూడా ఏది జరగలేదు.
 

89
Asianet Image

అయినా అను ఎందుకిలా చేసిందో మాకు అర్థం కావడం లేదు అని బాధపడుతుంది శారదమ్మ. అంజలి కూడా ఆర్య సార్ కోసం బాధపడుతుంది. బాధ భరించలేక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆర్య. అని కనిపించకపోవడంతో ఆర్య ఏమైపోతాడో అని భయంగా ఉంది  అంటూ బాధపడుతుంది శారదమ్మ. మీరు మీరేమీ బాధపడకండి హాస్పిటల్ వరకు వచ్చిందంటే కచ్చితంగా ఆ చుట్టుపక్కలే ఉంటుంది. రేపు వెతికితే కచ్చితంగా దొరుకుతుంది అంటూ ధైర్యం చెప్తాడు జెండే.
 

99
Asianet Image

 ఎలాగైనా వదినమ్మ ను వెతికి తీసుకొస్తాము మమ్మల్ని నమ్మండి అంటూ సుబ్బు దంపతులను బ్రతిమాలుతాడు నీరజ్. మీరు ఎన్ని ప్లాన్స్ వేసినా అను తిరిగి రాకుండా ఉండటానికి నా ప్లాన్స్ నాకు ఉన్నాయి అంటూ మనసులోనే పైశాచిక ఆనందాన్ని పొందుతుంది మాన్సీ. తను అలా వెళ్ళిపోయింది అంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అంటూ కూతుర్ని వెనకేసుకొస్తాడు సుబ్బు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Navya G
About the Author
Navya G
 
Recommended Stories
Top Stories