MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌ సాయి, నటి వాసుకి లవ్‌ స్టోరీ వెనక సీక్రెట్‌ రివీల్‌.. పవన్‌ కళ్యాణ్‌ అంత పని చేశాడా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌ సాయి, నటి వాసుకి లవ్‌ స్టోరీ వెనక సీక్రెట్‌ రివీల్‌.. పవన్‌ కళ్యాణ్‌ అంత పని చేశాడా?

ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్‌ ఆనంద్‌ సాయి ఇప్పుడు చాలా పాపులర్‌ ఆర్కిటెక్చర్‌గా రాణిస్తున్నారు. ఆయన నటి వాసుకిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరి లవ్‌ స్టోరీ వెనకాల సీక్రెట్‌ రివీల్‌ అయ్యింది.  

3 Min read
Author : Aithagoni Raju
Published : Jun 24 2023, 09:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఆనంద్‌ సాయి పవన్‌ కళ్యాణ్‌ ఫ్రెండ్‌గా పాపులర్‌. చాలా సందర్భాల్లో తమ స్నేహాన్ని చాటుకున్నారు ఆనంద్‌ సాయి. ఆయనకు లైఫ్‌ ఇచ్చిందే పవన్‌ అని చెబుతుంటారు. అయితే పవన్‌ కళ్యాణ్‌ కారణంగానే తనకు లవ్‌ దొరికిందట. పవన్‌ `తొలిప్రేమ` సినిమాకి, ఆనంద్‌ సాయి-వాసుకి లవ్‌కి లింక్‌ ఉండటం ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా ఈ రహస్యం బయటపడింది. `తొలిప్రేమ` చిత్ర నిర్మాత జీవీజీ రాజు ఈ విషయాన్ని వెల్లడించారు. 
 

26

`తొలిప్రేమ` సినిమాతో ఆర్ట్ డైరెక్టర్‌గా ఆనంద్‌ సాయి కెరీర్‌ ప్రారంభమయ్యింది. పవన్‌ కళ్యాణ్‌ కారణంగా, నువ్వు చేయగలవనే సపోర్ట్ ఇవ్వడంతోనే ఆనంద్‌ సాయి ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా చేశారు. ఇందులో ఆయన వేసిన తాజ్‌ మహల్‌ సెట్‌ ఆయనకు మంచి గుర్తింపు, పేరుని తీసుకొచ్చింది. అంతేకాదు తనకు ప్రేమని కూడా పరిచయం చేసిందట. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే ఆనంద్‌ సాయి, వాసుకి ప్రేమలో పడ్డారని తెలిపారు నిర్మాత జీవీజీ రాజు. `తొలి ప్రేమ` 25ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత ఈ విషయాన్ని వెల్లడించారు.
 

36

`తొలిప్రేమ` సినిమా సమయంలోనే యూనిట్‌లో రెండు జంటలు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నట్టు తెలిపారు. ఆనంద్‌ సాయి-వాసుకితోపాటు పవన్‌, కీర్తిరెడ్డి డూపులు కూడా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. సినిమాలో ఓ కార్‌ యాక్సిడెంట్‌ సీన్‌ ఉంటుంది. అందులో డూప్‌ ఆర్టిస్టులున్న కారు లోయలో పడిపోయిందట. దీంతో వారికి గాయాలయ్యాయని, వారిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారట. అయితే ఆసుపత్రిలో పక్క పక్కనే వారి బెడ్లు ఉండటం, ఆ ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందని, ఆ తర్వాత పెళ్లి కార్డ్ తో తన వద్దకు వచ్చారని తెలిపారు నిర్మాత జీవీజీ రాజు. ప్రస్తుతం ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. 

46

ఆనంద్‌ సాయిని పవన్‌ బలవంతం చేయకపోతే, ఆనంద్‌ సాయి ఈ సినిమా చేయకపోతే వాసుకి పరిచయం అయ్యేది కాదు, వారిద్దరు పెళ్లి చేసుకునేవాళ్లు కాదు. ఓ రకంగా వీరి ప్రేమ, పెళ్లికి పవన్‌ కళ్యాణే కారణమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక అప్పట్నుంచి ఆనంద్‌ సాయి పవన్‌తోనే ఉంటున్నారు. ఆయన సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా చేస్తున్నారు. ఇప్పటి వరకు `తొలిప్రేమ`తోపాటు `యమదొంగ`, `సైనికుడు`, `గుడుంబా శంకర్‌`, `నాని`, `బృందావనం`, `పులి`, `బాలు`, `ఎవడు` వంటి యాబైకి పైగా చిత్రాలకు పనిచేశారు. ఇప్పుడు `హరిహర వీరమల్లు` చిత్రాలకు ఆనంద్‌ సాయి ఆర్ట్ డైరెక్టర్‌గా చేస్తున్నారు. 

56

మరోవైపు దేవాలయాల నిర్మాణంలోనూ ఆయన మరింత పేరుతెచ్చుకున్నారు. `యాదాద్రి టెంపుల్‌`ని ఆయనే డిజైన్‌ చేశారు. ఇప్పుడు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్‌ని, భద్రకాళీ టెంపుల్‌ని ఆయన డిజైన్‌ చేయబోతున్నారు. మరోవైపు వాసుకి పెళ్లి తర్వాత సినిమాలు మానేశారు. ఇటీవల `అన్ని మంచి శకునములే` చిత్రంలో నటించింది. ఆనంద్‌ సాయికి సపోర్ట్ గా ఉంటున్నారామే.
 

66

ఇదిలా ఉంటే తాజాగా `తొలిప్రేమ` రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆనంద్‌ సాయి మాట్లాడుతూ, ఈ సినిమాతోనే నా ప్రయాణం మొదలైంది. అప్పటికి నాకు ఆర్ట్ డైరెక్షన్ గురించి పెద్దగా తెలీదు. కానీ నువ్వు చేయగలవని కళ్యాణ్ నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఆ రోజు కళ్యాణ్ గారు ఆ ఫ్లాట్ ఫామ్ ఇవ్వడం వల్లే, ఈరోజు నేను ఇక్కడ నిల్చొని ఉన్నాను. కళ్యాణ్ గారు లేకపోతే నేను గానీ, కరుణాకరన్ గారు గానీ ఈరోజు ఇలా ఉండేవాళ్ళం కాదు. ముందుగా వేరే పెద్ద ఆర్ట్ డైరెక్టర్ ని అనుకున్నప్పటికీ, నాకు ఈ అవకాశమిచ్చి కరుణాకరన్ గారు, జి.వి.జి.రాజు గారు కూడా నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఒక కొత్త ఆర్ట్ డైరెక్టర్ వచ్చి తాజ్ మహల్ సెట్ వేయడం అంత తేలిక కాదు. నేను చేయగలనని నమ్మి అవకాశమిచ్చారు. ఈ సినిమా వల్లే నా కెరీర్ ఇంత బాగుంది. అలాగే వాసుకి కూడా నా జీవితంలోకి వచ్చింది. `తొలిప్రేమ` అనేది జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని సినిమా` అని చెప్పారు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Jason Sanjay: తండ్రి పేరు తీసేశాడా? 'సిగ్మా' టైటిల్ కార్డ్‌లో జేసన్ సంజయ్ సంచలనం!
Recommended image2
Ustaad X Dhurandhar 2: ఉస్తాద్ కి పోటీగా ధురంధర్ 2 వస్తే జరిగేది ఇదేనా ? హరీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Recommended image3
Laya Mistake: లయ చేసిన బిగ్‌ మిస్టేక్‌ ఇదే, ఒక్క సినిమాతో కెరీర్‌ తలక్రిందులు.. అది తలచుకుని ఆవేదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved