Bigg Boss Telugu 7: భార్యకి సీమంతం.. తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్న అర్జున్.. బెస్ట్ మూమెంట్
బిగ్ బాస్ తెలుగు 7లో కంటెస్టెంట్ అంబటి అర్జున్ వైఫ్ ఎంట్రీ ఇచ్చారు. ప్రెగ్నెంట్‌తో ఉన్న ఆమె రాకతో అర్జున్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. అంతేకాదు హౌజ్‌లో కంటెస్టెంట్లు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్నారు.
బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్.. పదో వారానికి చేరుకుంది. తొమ్మిదో వారంలో టేస్టీ తేజ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక పదోవారం నామినేషన్ ఆద్యంతం వేడి వేడిగా సాగింది. రాణులు, బంటుల మాదిరిగా ఈ నామినేషన్ల ప్రక్రియ జరిగింది. ముఖ్యంగా రాణులైన శోభా శెట్టి, ప్రియాంక, అశ్వినీల మధ్య గొడవ పీక్‌లోకి వెళ్లింది.
ఇక బిగ్ బాస్ హౌజ్‌లో సీమంతం జరిగింది. సీరియల్ నటుడు అర్జున్ భార్య సీమంతం చేశారు. బిగ్ బాస్ హౌజ్‌లోకి అర్జున్ వైఫ్ వచ్చింది. ఫ్యామిలీ విజిటింగ్‌లో భాగంగా ఇలా ఆమె సందడి చేసింది. ఆమె ప్రెగ్నెంట్‌గా ఉన్నారు. అర్జున్, సురేఖలు తమ ప్రేమని వ్యక్తం చేసుకున్నారు. అందరిని అబ్బురపరిచారు. వీరి మధ్య ఉన్న బాండింగ్ ఇతర కంటెస్టెంట్లని ఫిదా చేసింది.
ఈ సందర్భంగా అర్జున్ వైఫ్ ప్రెగ్నెంట్‌తో ఉండటంతో కంటెస్టెంట్లు అప్పటికప్పుడు అనుకుని సర్‌ప్రైజ్ చేశారు. తమ ఉన్న ఉన్న ఐటెమ్స్ తో సీమంతం చేశారు. శాలువా కప్పి, పండ్లు పెట్టి చిన్నపాటి సీమంతం చేసేశారు. ఇది చూసి సురేఖ ఆనందంతో ఉప్పొంగిపోయింది.
తన భార్యకి తన సమక్షంలో సీమంతం జరగడంతో అర్జున్ సైతం ఆనందం తట్టుకోలేకపోయాడు. ఆనంద బాష్పాలు కార్చారు. దీంతో బిగ్ బాస్ హౌజ్‌లో ఇదొక బెస్ట్ మూవ్‌మెంట్‌గా నిలిచింది.
ఈ సందర్భంగా తన భర్తకి సురేఖ కొన్ని సలహాలు ఇచ్చారు. సైలెంట్‌గా ఉంటున్నావని, రియాక్ట్ కావడం లేదని, ఎమోషన్స్ ని బయటపెట్టమని తెలిపింది. బిగ్ బాస్ కప్ ఇంపార్టెంట్ అని చెప్పింది. మరోవైపు కడుపులో చిన్నారి కదులుతుందని, రాత్రిళ్లు నిద్ర పోనివ్వడం లేదని తెలిపింది. ఇక బయట ఏం జరుగుతుందని అడగ్గా, తెలియదు, గుర్తు లేదు మర్చిపోయాను అంటూ, అలాగే అశ్వినిని పట్టుకుని మా ఆయన అంటే భయం పోయిందా అంటూ కామెంట్ చేస్తూ నవ్వులు పూయించింది సురేఖ.
తాజాగా విడుదలైన ఈ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. ది బెస్ట్ మూవ్‌మెంట్‌గా ఇది నిలుస్తుందని చెప్పొచ్చు. ఇక అంతేకాదు ఈ రోజు ఎపిసోడ్‌లో శివాజీ కొడుకు కూడా వచ్చాడు. డాక్టర్‌గా వచ్చి శివాజీకి ట్రీట్‌మెంట్ చేశాడు. చేయిసెట్ అయ్యిందని చెప్పి వెళ్లిపోయేటప్పుడు ఆయన మాస్క్ తీసి నాన్న అనడంతో శివాజీ ఎమోషనల్ అయ్యాడు, తన ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు.